Kuwait: ప్రవాసులకు మరో ఝలక్.. వచ్చే మూడు నుంచి ఐదేళ్లలో భారీగా వర్క్ పర్మిట్ల కోత..!
ABN, First Publish Date - 2023-03-15T08:30:02+05:30
గల్ఫ్ దేశం కువైత్ గడిచిన కొన్నేళ్లుగా ప్రవాసుల (Expats) పట్ల కఠిన వ్యవహరిస్తుంది.
కువైత్ సిటీ: గల్ఫ్ దేశం కువైత్ గడిచిన కొన్నేళ్లుగా ప్రవాసుల (Expats) పట్ల కఠిన వ్యవహరిస్తుంది. వివిధ ఉల్లంఘనదారులపై ఉక్కుపాదం మోపుతోంది. ఈ నేపథ్యంలో ఇఖామా (Iqama) ఉల్లంఘనదారులు భారీగా పెరిగిపోతున్నందున ప్రవాసులకు ఇచ్చే వర్క్ పర్మిట్లను (Work Permits) భారీగా కోత విధించేందుకు అంతర్గత మంత్రిత్వశాఖలోని మినిస్ట్రీ ఆఫ్ అఫైర్స్ డిపార్ట్‌మెంట్, పబ్లిక్ అథారిటీ ఆఫ్ మ్యాన్‌పవర్ ప్రణాళిక సిద్ధం చేసినట్లు సమాచారం. రాబోయే మూడు నుండి ఐదు సంవత్సరాలలో వారి సంఖ్యను పావు మిలియన్‌కు తగ్గించే ప్రయత్నంలో అథారిటీ ఆఫ్ మ్యాన్‌పవర్ (Public Authority of Manpower) ప్రవాస కార్మికుల వర్క్ పర్మిట్‌లను సమీక్షిస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా లక్షకు పైగా ఇఖామా ఉల్లంఘనదారులు ఉన్నట్లు మంత్రిత్వశాఖ వెల్లడించింది. ప్రతియేటా అంతకంతకు పెరిగిపోతున్న ఉల్లంఘనదారులను (Violators) నియంత్రించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు.
ముఖ్యంగా జలీబ్ అల్-షౌఖ్ (Jleeb Al-Shuyoukh) ప్రాంతంలో ఉల్లంఘనదారుల ప్రభావం తీవ్రంగా ఉన్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఉల్లంఘనలకు పాల్పడుతున్న ప్రవాసుల ఏరివేతకు పలు కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా వర్క్ పర్మిట్ ఫీజులను పెంచడం, ప్రతి పని రంగానికి పరిమిత సంఖ్యలను నిర్ణయించడంతో పాటు ప్రతి కార్మికుడికి ఆరోగ్య బీమాను (Health Insurance) విధించాలని డెమోగ్రాఫిక్స్ కమిటీ గతంలో సిఫార్సు చేసింది. కొన్ని స్పెషలైజేషన్లు మినహా విదేశాల నుండి కార్మికులను రిక్రూట్ చేయడం, ఐదేళ్ల వ్యవధికి మాత్రమే పరిమితం చేయడం, ఉపాంత కార్మికులను తొలగించడం వంటివి కూడా కమిటీ ప్రతిపాదనలలో ఉన్నాయి.
ఇది కూడా చదవండి: ఆడుకుంటూ ఎంత పని చేసింది బుడ్డది.. హ్యుస్టన్‌లో విషాదకర ఘటన..!
Updated Date - 2023-03-15T08:38:41+05:30 IST