Oman: 60 ఏళ్లకు పైబడిన నివాసితుల 'వర్క్' విషయంలో ఒమాన్ కీలక నిర్ణయం..!
ABN, First Publish Date - 2023-03-21T12:05:08+05:30
60 ఏళ్లకు పైబడిన నివాసితులు (Residents) పని చేసే విషయమై తాజాగా ఒమాన్ (Oman) కీలక నిర్ణయం తీసుకుంది.
మస్కట్: 60 ఏళ్లకు పైబడిన నివాసితులు (Residents) పని చేసే విషయమై తాజాగా ఒమాన్ (Oman) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేటగిరీ రెసిడెంట్స్ ఇకపై పని (Work) చేసుకోవచ్చని తెలిపింది. వారి అనుభవం కొత్తగా పనిలో చేరేవారికి ఎంతగానో ఉపయోగ పడుతుందని ఈ సందర్భంగా కార్మిక శాఖ మంత్రి మహద్ బిన్ సైద్ బిన్ అలీ బావోవైన్ తెలిపారు. 'టుగెదర్ వి అడ్వాన్స్' (Together We Advance) ఫోరం సదస్సులో మాట్లాడిన మంత్రి.. 60 ఏళ్లు దాటిన నివాసితులను కూడా పని చేసుకునే వెసులుబాటు కల్పిస్తూ సుల్తానేట్ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.
ఈ నిర్ణయం వల్ల బిజినెస్ ఓనర్లకు వర్కర్ల బెడద ఉండదని, అదే సమయంలో ఉద్యోగార్థులకు మంచి అవకాశాలు కూడా దొరుకుతాయని మంత్రి తెలిపారు. ఇక సంస్కృతి, క్రీడలు, యువజన వ్యవహారాల మంత్రి సయ్యద్ థెయాజిన్ బిన్ హైథమ్ బిన్ తారిక్ అల్ సయీద్ ఆధ్వర్యంలో తీసుకొచ్చిన 'టుగెదర్ వి అడ్వాన్స్' ఫోరం ముఖ్యంగా మూడు అంశాలపై దృష్టి సారించిందని పేర్కొన్నారు. ఒమాన్ విజన్, ఆర్థిక స్థిరత్వం, పని ఈ మూడు అంశాలే లక్ష్యంగా ఫోరం ముందుకుసాగుతుందని మంత్రి బావోవైన్ చెప్పుకొచ్చారు.
ఇది కూడా చదవండి: కెనడాలో ఘోరం.. అందరూ చూస్తుండగా భారతీయ విద్యార్ధిపై దాడి.. నడిరోడ్డుపై దారుణంగా కొట్టి ఆపై..!
Updated Date - 2023-03-21T12:05:08+05:30 IST