Robbery: ఎన్నారైలే వారి టార్గెట్.. ఒకేరాత్రి మూడు ఇళ్లను దోచుకెళ్లారు..!
ABN, First Publish Date - 2023-07-28T12:23:21+05:30
ఇటీవల కాలంలో దొంగలు (Thieves) ఎన్నారైల ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నారు.
ఎన్నారై డెస్క్: ఇటీవల కాలంలో దొంగలు (Thieves) ఎన్నారైల ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నారు. ఎందుకంటే వారి ఇళ్లలో ఎక్కువ నగదు దొరుకుతుంది. అలాగే వారి ఇళ్లలో చాలా వరకు ఎవరూ ఉండరు. తాళం వేసి ఉంటాయి. ఇక సెక్యూరిటీ కూడా చాలావరకు తక్కువగానే ఉంటుంది. దాంతో దొంగలు పక్కా ప్లాన్ ప్రకారం ఎన్నారైల ఇండ్లలోనే చోరీలు (Robbery) చేస్తున్నారు. ఇదే కోవలో తాజాగా ఒకేరాత్రి ముగ్గురు ఎన్నారైల ఇళ్లను దోచుకెళ్లారు. విలువైన ఆభరణాలతో పాటు లక్షల రూపాయలు కొల్లగొట్టారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. పంజాబ్ రాష్ట్రం కపుర్తలా జిల్లాలోని ఫగ్వారా సమీపంలోని నారంగ్ షాపూర్ (Narang Shahpur) అనే గ్రామంలో జులై 26వ తేదీ రాత్రి ఎన్నారైలకు చెందిన రెండు ఇళ్లలో దోపిడీ జరిగింది. కొందరు దుండగులు ఈ ఇళ్లలోకి ప్రవేశించి విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారు.
మొదటి ఇంట్లోంచి రూ. 2లక్షల నగదు, 1,500 అమెరికన్ డాలర్లు, 16 తులాల బంగారు ఆభరణాలు పట్టుకెళ్లారు. అలాగే రెండో ఇంట్లోంచి 10 తులాల బంగారు ఆభరణాలు, 1,500 అమెరికన్ డాలర్లు, రూ.25 వేల క్యాష్ ఎత్తుకెళ్లారు. ఈ గ్రామానికి చేరువలో ఉండే భానోకి అనే విలేజ్‌లోని మరో ఇంట్లో కూడా చోరీ జరిగింది. ఆ ఇంట్లోంచి బంగారు నగలు, రూ.18 వేల నగదును దొంగలు కాజేశారు. ఇలా ఈ మూడు చోరీలలో దొంగలు సుమారు రూ.22 లక్షల వరకు ఎత్తుకెళ్లారని అంచనా. అందులో 3,000 అమెరికన్ డాలర్లు, రూ.2.25లక్షల క్యాష్‌తో పాటు సుమారు 26 తులాల బంగారు నగలు ఉన్నాయి. కాగా, ఎన్నారైలు తమ ఇళ్ల తలుపులు, కిటికీలకు గట్టి డోర్లు, సెక్యూరిటీ కెమెరాలు, అలారం సిస్టమ్, స్ట్రాంగ్ లాకర్స్ వంటివి ఏర్పాటు చేసుకోవడం మంచిదని ఈ సందర్భంగా పోలీసులు సూచించారు. ఎన్నారైలు తమ ఇళ్లలో ఉండనప్పుడు సెక్యూరిటీ గార్డ్స్‌ను నియమించుకోవడం చేయాలని తెలిపారు.
Emirates draw: అదృష్టం అంటే ఈ భారత ప్రవాసుడిదే.. ప్రతినెల రూ.5.60లక్షలు.. అది కూడా 25ఏళ్ల వరకు..!
Updated Date - 2023-07-28T12:23:21+05:30 IST