ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

UAE-India travel: భారత ప్రవాసులు కేవలం రూ.10వేలకే స్వదేశానికి రావొచ్చు.. పైగా 200కేజీల వరకు లగేజీకి అనుమతి

ABN, First Publish Date - 2023-09-19T08:08:23+05:30

భారత ప్రయాణికులకు (Indian Passengers) యూఏఈ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. యూఏఈ నుంచి భారత ప్రవాసులు (Indian Expats) కేవలం రూ.10వేలకే స్వదేశానికి రావొచ్చు. పైగా 200కేజీల వరకు లగేజీ (Baggage)కి కూడా అనుమతి ఉంటుంది.

అబుదాబి: భారత ప్రయాణికులకు (Indian Passengers) యూఏఈ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. యూఏఈ నుంచి భారత ప్రవాసులు (Indian Expats) కేవలం రూ.10వేలకే స్వదేశానికి రావొచ్చు. పైగా 200కేజీల వరకు లగేజీ (Baggage)కి కూడా అనుమతి ఉంటుంది. దీనికోసం దక్షిణాది రాష్ట్రమైన కేరళ (Kerala) కు యూఏఈ నుంచి షిప్ సర్వీస్ నడపనుంది. దీని ద్వారా చాలా తక్కువ ఖర్చుతో భారతీయులు (Indians) స్వదేశానికి వచ్చే వెసులుబాటు కలుగుతుంది. ఇన్నాళ్లు భారీగా ఉన్న విమాన చార్జీలతో బెంబెలెత్తిపోయిన మనోళ్లకు ఇది నిజంగా గుడ్‌న్యూస్ అనే చెప్పాలి. ఈ ఏడాది చివరినాటికి ఈ షిప్ సర్వీస్‌ (Ship Service) ను ప్రారంభించాలని యూఏఈ యోచిస్తోంది.

ఈ సర్వీస్ ద్వారా భారతీయులు కేరళకు దాదాపు మూడు రోజుల్లోనే చేరుకోవచ్చని ఇండియన్ అసోషియేషన్ షార్జా అధ్యక్షుడు వైఏ రహీం తెలిపారు. "డిసెంబర్‌లో స్కూళ్ల సెలవులకు ముందు సర్వీస్‌ను ప్రారంభించాలనే ఆలోచన ఉంది. యూఏఈలోని భారతీయ ప్రవాసులు అధిక విమాన ఛార్జీలు చెల్లించకుండా వారి స్వస్థలాలకు వెళ్లేలా ప్రణాళికలు రూపొందించాం" అని అన్నారు. ప్రాజెక్ట్ గురించి చర్చించేందుకు కేరళ ప్రభుత్వ ప్రతినిధులు సెప్టెంబర్ 24న భారత కేంద్ర ప్రభుత్వ మంత్రులను కలుస్తారని పేర్కొన్నారు. ఈ భేటీ అనంతరం తాము నవంబర్ నాటికి సర్వీస్ ట్రయల్ రన్ చేయాలని నిర్ణయించామని పేర్కొన్నారు. ఇక ఈ సర్వీస్ టికెట్ ధర వచ్చేసి 442 నుంచి 663 దిర్హమ్స్ (రూ.10వేల నుంచి రూ.15వేల మధ్య) వరకు ఉంటుందని తెలిపారు. అది కూడా ట్రావెల్ టైమ్‌ (Travel Time) పై ఆధారపడి ఉంటుందన్నారు. అంటే పీక్ ట్రావెట్ టైమ్‌లో ధరలు ఎక్కువగా ఉంటాయన్నమాట.

ఇక యూఏఈ (UAE) మరియు భారత్ మధ్య ప్రయాణాన్ని పూర్తి చేయడానికి ఈ ప్యాసింజర్ షిప్‌కు మూడు రోజులు పడుతుంది. నౌకలో ఒకేసారి 1,250 మంది ప్రయాణికులు (Travellers) ప్రయాణించే వెసులుబాటు ఉంటుంది. ఈ ట్రిప్ సమయంలో ప్రయాణికులు 200కేజీల వరకు లగేజీ తీసుకెళ్లవచ్చు. అలాగే వేర్వేరు ప్లాన్‌ల ప్రకారం ప్రయాణీకులకు బోర్డింగ్‌లో అనేక రకాల ఆహార పదార్థాలు, వినోదం ఉంటాయి. ఈ నౌక సర్వీస్‌ను ప్రస్తుతం రెండు గమ్యస్థానాలకు నడపాలనే యోచనలో ఉన్నట్లు తెలిసింది. కొచ్చి, బేపూర్‌లకు ఈ షిప్ సర్వీస్ ఉండనుంది. కాగా, కొచ్చి భారతదేశంలోని అతిపెద్ద ఓడరేవులలో ఒకటి. ఇక బేపూర్ ఇండియాలోని నైరుతి తీరంలో కోజికోడ్‌లో ఉన్న ఓడరేవు.

UAE: మీ వద్ద ఈ 3 వీసాలు ఉంటే చాలు.. యూఏఈలో పని చేయకుండా కూడా.. రెసిడెన్సీకి ఇట్టే అనుమతి పొందవచ్చు!

Updated Date - 2023-09-19T08:16:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising