ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

UAE: ప్రవాసులు జర జాగ్రత్త.. ఇకపై అలా చేశారో రోజుకు రూ.1100 జరిమానా..!

ABN, First Publish Date - 2023-08-09T07:57:25+05:30

యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్‌ (United Arab Emirates) లోని ప్రవాసులు ఎవరైతే వీసాల గడువు ముగిసినా.. ఇంకా దేశంలోనే ఉంటారో వారికి ఇకపై డైలీ జరిమానా ఉంటుంది.

అబుదాబి: యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్‌ (United Arab Emirates) లోని ప్రవాసులు ఎవరైతే వీసాల గడువు ముగిసినా.. ఇంకా దేశంలోనే ఉంటారో వారికి ఇకపై డైలీ జరిమానా ఉంటుంది. అలా గడువు ముగిసిన రెసిడెన్సీ, విజిట్ వీసాలపై ఉండేవారికి రోజుకు 50 దిర్హమ్స్ (రూ.1,128) ఫైన్ ఉంటుందని ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ నేషనాలిటీ, కస్టమ్స్ అండ్ పోర్ట్స్ సెక్యూరిటీ (Federal Authority for Identity and Nationality, Customs and Ports Security) వెల్లడించింది. గ్రేస్ పీరియడ్ ముగిసిన తర్వాత ప్రతి రోజూ యాభై దిర్హమ్స్ చెల్లించాల్సి ఉంటుందని సంబంధిత అధికారులు స్పష్టం చేశారు. ఇక ఇటీవల తీసుకొచ్చిన ఎలక్ట్రానిక్ సర్వీసులను కూడా ఈ సందర్భంగా అధికారులు గుర్తు చేశారు.

ఎంట్రీ పర్మిట్‌తో సహా వీసా సర్వీస్‌ను సైతం అధికారిక వెబ్‌సైట్ 'దుబాయ్ నౌ' (Dubai Now), స్మార్ట్ యాప్, టైపింగ్ సెంటర్ ద్వారా పొందవచ్చని తెలిపారు. వీసా దరఖాస్తు కోసం ఎలక్ట్రానిక్ ఛానెల్‌లు ఉన్నాయని, వాటి ద్వారా ఎంట్రీ పర్మిట్, రెసిడెన్సీ అనుమతి కోసం అభ్యర్థనను సమర్పించవచ్చని అధికారులు తెలిపారు. ఆ అప్లికేషన్లు గూగుల్ (Google), యాపిల్ (Apple) స్టోర్లలో అందుబాటులో ఉన్నాయి. వీసా లేదా ఎంట్రీ పర్మిట్ పొందడం కోసం దరఖాస్తును నేరుగా, అథారిటీతో నమోదు చేసుకున్న టైపింగ్ కార్యాలయాలు లేదా జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారినర్స్ అఫైర్స్ దుబాయి ద్వారా గుర్తింపు పొందిన కార్యాలయాల ద్వారా సమర్పించవచ్చని అధికారులు వెల్లడించారు.

Expats: 100 మంది ప్రవాసులను దేశం నుంచి వెళ్లగొట్టిన కువైత్.. కారణమిదే..!

Updated Date - 2023-08-09T07:57:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising