Residence Visa: యూఏఈలో నవజాత శిశువుల నివాస వీసా ఫీజు ఎంతంటే..?
ABN, First Publish Date - 2023-07-30T08:29:50+05:30
ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజన్‌షిప్, కస్టమ్స్ మరియు పోర్ట్స్ సెక్యూరిటీ (ICP) ప్రకారం, నివాసిత విదేశీయులు ప్రైవేట్ సెక్టార్ లేదా ఫ్రీ జోన్‌లో పనిచేస్తున్న నివాసి స్పాన్సర్‌షిప్ క్రింద యూఏఈ (UAE) లోపల నవజాత శిశువుల కోసం రెసిడెన్సీ వీసాను జారీ చేయవచ్చు.
Residence Visa: ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజన్‌షిప్, కస్టమ్స్ మరియు పోర్ట్స్ సెక్యూరిటీ (ICP) ప్రకారం, నివాసిత విదేశీయులు ప్రైవేట్ సెక్టార్ లేదా ఫ్రీ జోన్‌లో పనిచేస్తున్న నివాసి స్పాన్సర్‌షిప్ క్రింద యూఏఈ (UAE) లోపల నవజాత శిశువుల కోసం రెసిడెన్సీ వీసాను జారీ చేయవచ్చు. తాజాగా ఈ నవజాత శిశువుల నివాస వీసా ఫీజును ఐసీపీ 350 దిర్హమ్స్‌గా (రూ. 7839) నిర్ణయించింది. ఇక ఈ సేవను పొందడానికి ఐసీపీ అధికారిక వెబ్‌సైట్ https://icp.gov.ae/, UAEICP స్మార్ట్ అప్లికేషన్ ద్వారా లేదా డిజిటల్ గుర్తింపుతో లేదా వినియోగదారు పేరుతో లాగిన్ కావాల్సి ఉంటుంది. ఆపై సంబంధిత దరఖాస్తు ఫార్మ్‌ను నింపి, చివరకు ఫీజు చెల్లించడం ద్వారా సేవను పొందవచ్చని స్పష్టం చేసింది.
కాగా, ఈ సర్వీస్‌ను పొందేందుకు పాస్‌పోర్ట్ ఒక నెల కంటే ఎక్కువ కాలం చెల్లుబాటులో ఉండాలి. అలాగే శిశువు పుట్టిన తేదీ నుండి 120 రోజులలోపు దేశం విడిచి వెళ్లని ఎమిరేట్స్‌లోని నవజాత శిశువు కోసం రెసిడెన్సీ ప్రక్రియలు పూర్తి చేయాలి. లేనిపక్షంలో ఐసీపీ (ICP) నిబంధనల ప్రకారం 120 రోజుల తర్వాత నవజాత శిశువుపై జరిమానాలు వర్తించబడతాయని సంబంధిత అధికారులు తెలిపారు. ఇక నవజాత శిశువుల కోసం రెసిడెన్సీ వీసా పొందేందుకు అవసరమైన పత్రాలను ఈ సందర్భంగా ఐసీపీ వెల్లడించింది.
తల్లిదండ్రుల ఐడీ కార్డ్, ఫీజు చెల్లింపు తాలూకు రసీదు, నవజాత శిశువు ఒర్జినల్ పాస్‌పోర్ట్, స్పాన్సర్ జీతం సర్టిఫికేట్, అతని పాస్‌పోర్ట్ కాపీ, కలర్ ఫోటో, బర్త్ సర్టిఫికేట్, వర్క్ పర్మిట్, లీజు ఒప్పందం, ఆరోగ్య బీమా కాపీ, తల్లి పాస్‌పోర్ట్ కాపీ సమర్పించాల్సి ఉంటుంది. నవజాత శిశువుకు నివాస వీసా జారీ చేయడానికి రుసుములో దరఖాస్తు ఫీజు కోసం 100 దిర్హమ్స్, వీసా జారీ ఫీజు 100 దిర్హమ్స్, స్మార్ట్ సర్వీసులకు 100 దిర్హమ్స్, ఎలక్ట్రానిక్ సేవలు, ఐసీపీ సేవల కోసం మరో 50 దిర్హమ్స్ ఇలా మొత్తంగా 350 దిర్హమ్స్ రుసుముగా చెల్లించాలని అధికారులు పేర్కొన్నారు.
US: అమెరికాలో పిడుగుపాటుకు గురైన.. ఈ తెలుగు యువతి విషయంలో నిజంగా అద్భుతమే జరిగింది..!
Updated Date - 2023-07-30T08:31:31+05:30 IST