BR Ambedkhar Statue: భారత దేశానికే తలమానికం అంబేద్కర్ విగ్రహం
ABN, First Publish Date - 2023-04-14T20:54:37+05:30
భారత దేశంలోనే అతిపెద్దదైన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని రాష్ట్ర రాజధానిలో ప్రతిష్ఠచడం గర్వకారణం అని ఎన్నారై బీఆర్ఎస్ బహ్రెయిన్ శాఖ అధ్యక్షులు రాధారపు సతీష్ కుమార్ అన్నారు.
ఎన్నారై డెస్క్: భారత దేశంలోనే అతిపెద్దదైన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని రాష్ట్ర రాజధానిలో ప్రతిష్ఠచడం గర్వకారణం అని ఎన్నారై బీఆర్ఎస్ బహ్రెయిన్ శాఖ అధ్యక్షులు రాధారపు సతీష్ కుమార్ అన్నారు. ఆయన మాట్లాడుతు తెలంగాణ పౌర సమాజం తలెత్తుకునేలా అంబేద్కర్ జయంతి రోజున డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భారత దేశంలోనే అతిపెద్దదైన 125 అడుగుల ఎత్తయిన విగ్రహం హైదరాబాద్ నడిబొడ్డున ఏర్పాటు చేయడం చరిత్రలో సువర్ణాధ్యాయమని, భారత దేశానికే తలమానికంగా నిలుస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడంపై సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రం తీసుకోని నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం తీసుకోవడం గొప్ప విషయమన్నారు. జీవిత పర్యంతం సామాజిక అసమానతల నిర్మూలనకు పోరాడుతూనే, అన్ని వర్గాల వారికి సమన్యాయం జరగాలనే దార్శనికతతో రాజ్యాంగాన్ని రూపొందించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భారతదేశ అస్తిత్వపు ప్రతీక అని సతీష్ కుమార్ కొనియాడారు.
దళితుల ఆత్మ గౌరవ ప్రతీక
దేశంలో మునుపెన్నడూ లేని విధంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని నిర్మించడమే కాకుండా నూతన సచివాలయానికి అంబేద్కర్ నామకరణ చేయడం చారిత్రాత్మకమని ఎన్నారై బిఆర్ఎస్ సెల్ బహ్రెయిన్ శాఖ జనరల్ సెక్రటరీలు శ్రీ రాజేందర్ మగ్గిడి, సుమన్ అన్నారం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎన్నారై బిఆర్ఎస్ సెల్ బహ్రెయిన్ శాఖ జనరల్ సెక్రటరీలు రాజేందర్ మగ్గిడి, సుమన్ అన్నారం మాట్లాడుతూ కేంద్రం సమాఖ్య స్ఫూర్తికి విరోధంగా పక్షపాత ధోరణి ప్రదర్శిస్తున్నది. లౌకికత్వానికి భిన్నంగా మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ బీజేపీ తన ఉనికిని కాపాడుకుంటున్నది. ఎనిమిదిన్నరేండ్ల కేంద్రం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా పక్షపాత ధోరణి ప్రదర్శిస్తున్న కాలంలో దేశవ్యాప్తంగా వేలాది మంది దళితులపై దాడులు జరగ డానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కారణం.
తెలంగాణలో మాత్రం అట్టడుగు స్థానంలో ఉన్న దళిత సమాజాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని తీసు కువచ్చి విప్లవాత్మకమైన మార్పునకు నాంది పలికారు. నిరుపేద దళిత కుటుంబాలకు ఏకంగా రూ.10లక్షలు అందించి వారికి శాశ్వతంగా ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా చేదోడు వాదోడుగా నిలిచి గెలిచి చూపించిన ఘనత కూడా కేసీఆర్‌కి మాత్రమే దక్కుతుంది. దళితబంధు పథకం విజయవంతంగా అమలు కావడమే కాకుండా అనేక కుటుంబాల్లో వెలుగులు నింపింది. రాజ్యాంగ నిర్మాతకు కనీవినీ ఎరుగని రీతిలో తెలంగాణ రాష్ట్రంలో అపూర్వమైన గౌరవం దక్కుతున్నది. కొత్త రాష్ట్రంలో రూపుదిద్దుకున్న సచివాలయానికి బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టడంతో పాటు సచివాలయం సమీపంలోనే 125 అడుగుల నిలువెత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేయడం కేసీఆర్ గొప్పతనానికి నిదర్శనం. ప్రజాస్వామ్య విలువలకు అధిక ప్రాధాన్యతను ఇచ్చే కేసీఆర్, అడుగడుగునా రాజ్యాంగ నిర్మాతను కొలుస్తూ అంబేద్కర్ చూపిన బాటలోనే పయనిస్తున్నారు.
స్వాతంత్య్రం సిద్ధించిన తొలి. నాళల్లో దళిత జాతి మేలు కోసం అంబేద్కర్ కృషి చేసినట్లే 75ఏండ్ల స్వతంత్ర భారతదేశంలో కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం అట్టగుడు వర్గాలను ఆరాధిస్తున్నది. చారిత్రక హుస్సేన్ సాగర్ పక్కనే నిర్మితమైన అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుతో తెలం గాణ ప్రజలంతా హర్షాతిరేకలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా దళి తులు కేసీఆర్ కృషిని కొనియాడుతున్నారు. మహనీయుడిని విగ్రహ రూపంలో నిర్మించుకొని నిత్యం గుర్తుంచుకోవడం కేవలం కృతజ్ఞత మాత్రమే కాదు.. చారిత్రక బాధ్యత కూడా అని తెలంగాణ సీఎం కేసీఆర్ గుర్తించడం చారిత్రాత్మకం. భారత రాజ్యాంగం ద్వారా చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు బాటలు వేసిన మహనీయున్ని నిత్యం గుర్తు చేసుకునేందుకు సీఎం కేసీఆర్ చేసిన ప్రయత్నం ఇది. రాజకీయ, సామాజిక, ఆర్థిక సమాన అవ కాశాలు ఎలా ఉండాలో కూడా చెప్పిన ఆధునిక భారతదేశపు ఆత్మ అంబేద్కర్ బాటలోనే కేసీఆర్ నడుస్తున్నారు.
Updated Date - 2023-04-14T20:54:37+05:30 IST