Saudi Arabia: పౌరసత్వం మంజూరులో సవరణ.. ఇకపై ఆ అధికారం ఎవరికంటే..
ABN, First Publish Date - 2023-01-13T11:23:33+05:30
అరబ్ దేశం సౌదీ అరేబియా (Saudi Arabia) పౌరసత్వం మంజూరులో కొత్త సవరణను (New Amendment) ప్రవేశపెట్టింది.
రియాద్: అరబ్ దేశం సౌదీ అరేబియా (Saudi Arabia) పౌరసత్వం మంజూరులో కొత్త సవరణను (New Amendment) ప్రవేశపెట్టింది. దీనిలో భాగంగా సౌదీ జాతీయత వ్యవస్థలో కీలక మార్పులు చేసింది. ఈ మేరకు జాతీయత వ్యవస్థలోని ఆర్టికల్ 8లో చేసిన సవరణను కింగ్‌డమ్‌లోని ఉన్నతాధికారులు తాజాగా ఆమోదించారు. తాజా సవరణ ప్రకారం ఇకపై పౌరసత్వం (Citizenship) ఇచ్చే అధికారాన్ని ప్రధానమంత్రికి (Prime Minister) ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు ఈ అధికారం దేశ అంతర్గత మంత్రికి (Interior Minister) ఉండేది. ఆర్టికల్ 8ని సవరించి ఇప్పుడు ప్రధానికి ఇచ్చారు.
ఇక సౌదీ అరేబియా జాతీయత వ్యవస్థలోని ఆర్టికల్ 8 (Article 8) అనేది షరతులకు లోబడి విదేశీ తండ్రి, సౌదీ తల్లికి కింగ్‌డమ్‌లో జన్మించిన వ్యక్తులకు సౌదీ పౌరసత్వం (Saudi Citizenship) మంజూరు చేయవచ్చని చెబుతుంది. ఇలా పౌరసత్వం పొందిన వారు అక్కడి పౌర చట్టంలో పేర్కొన్న విధంగా నిర్ణీత వయసు వచ్చిన తర్వాత శాశ్వత నివాసహోదాను పొందడం జరుగుతుంది. తద్వారా ఆ దేశంలో సాధారణ పౌరులు పొందే అన్ని సేవలు వీరికి కూడా దక్కుతాయి.
Updated Date - 2023-01-13T11:23:35+05:30 IST