ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Sheybarah Resort: భూతల స్వర్గం అంటే ఇదేనేమో.. సౌదీలోని ఈ 'రిసార్ట్' విశేషాలు తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..!

ABN, First Publish Date - 2023-02-05T13:12:35+05:30

అరబ్ దేశం సౌదీ అరేబియా (Saudi Arabia) మరో అద్భుతమైన నిర్మాణాన్ని వచ్చే ఏడాది నుంచి అందుబాటులో తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: అరబ్ దేశం సౌదీ అరేబియా (Saudi Arabia) మరో అద్భుతమైన నిర్మాణాన్ని వచ్చే ఏడాది నుంచి అందుబాటులో తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తుంది. ప్రకృతి రమణీయత మధ్యలో ఎంతో సర్వాంగ సుందరంగా నిర్మితమవుతున్న ఆ కట్టడం ఒక రిసార్ట్ హోటల్. ఆ దేశ ప్రధాన భూభాగానికి అవతల షాబారా దీవిలో అది రూపుదిద్దుకుంటుంది. 'షాబారా రిసార్ట్' (Sheybarah Resort) పేరుతో ఈ హోటల్ నిర్మితమవుతోంది. 'రెడ్ సీ గ్లోబల్ డెవలపర్స్' అనే సంస్థ దీన్ని ఎంతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతుంది. 2024 నుంచి అతిథులకు ఈ రిసార్ట్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఇక షాబారా రిసార్ట్ విశేషాలు తెలిస్తే భూతల స్వర్గం అనే పదం కూడా చినబోతుందని దీన్ని నిర్మిస్తున్న సంస్థ చెబుతోంది. అంతేకాదండోయ్ ఇది 'మోస్ట్ ఫ్యూచరిస్టిక్ హోటల్ ఇన్ ది వరల్డ్' (Most futuristic hotel in world) అని సదరు సంస్థ చెబుతున్నమాట.

ఇది కూడా చదవండి: డైమండ్ నెక్లెస్ ఎత్తుకెళ్లిన ఎలుక.. నెటిజన్ల ఫన్నీ కామెంట్స్!

షాబారా దీవిలోని (Sheybarah Island) చుట్టూ దట్టమైన మడ అడవులు, ఎడారి వృక్షాల నడుమ దీనిని ఆధునాతన హంగులతో ఎంతో సుందరంగా నిర్మిస్తున్నారు. పర్యావరణానికి ఏమాత్రం హాని కలిగించని విధంగా పూర్తిగా సౌరవిద్యుత్‌తో నడిచేలా రూపొందిస్తున్నారు. వ్యర్థ పదార్థాలు దీవిలోనే రీసైకిల్ చేయబడతాయి. సౌరశక్తితోనే పనిచేసే డీశాలినేషన్ ప్లాంట్ రిసార్ట్‌కు మంచినీటిని సరఫరా చేస్తుంది. అతిథులకు డ్రైవర్‌లేని బగ్గీలు కూడా అందుబాటులో ఉంటాయి. అలాగే అక్కడికి వెళ్లేవారు బోర్డ్‌వాక్‌లు, బీచ్, స్పోర్ట్స్ కోర్ట్‌లు, స్నార్కెలింగ్, సోలార్ ఫామ్‌లను ఆస్వాదించవచ్చు. ఇక ఈ రిసార్ట్‌లో ఏకకాలంలో 140 మంది అతిథులకు వసతి సౌకర్యం అందుబాటులో ఉంటుందట. అతిథులకు సేవలు చేయడానిక 260 మంది సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారట. ఈ ప్రాజెక్ట్‌ పూర్తిగా జీవవైవిధ్యాన్ని కాపాడేలా ఉంటుందని దీన్ని నిర్మిస్తున్న సంస్థ అధినేత జాన్ పగానో తెలిపారు. ఇంకా చెప్పాలంటే ఇది సౌదీ పర్యాటకరంగం భవిష్యత్తునే మార్చేయగలదని ఆయన చెప్పుకొచ్చారు.

ఇది కూడా చదవండి: పెళ్లయిన తొమ్మిదో రోజే కొత్త కోడలు చేసిన పనికి మామయ్యకు హార్ట్ అటాక్.. అత్తారింట్లో అంతా ఆగమాగం..!

Updated Date - 2023-02-05T13:34:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising