ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

NRIs: సింగపూర్‌లో శోభాయమానంగా శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది ప్రత్యేక పూజలు

ABN, First Publish Date - 2023-03-25T09:16:31+05:30

సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో లోక కళ్యాణార్ధం, రాబోవు సంవత్సరమంతా అందరికీ శ్రేయస్కరంగా ఉండాలనే మహా సంకల్పంతో శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది పర్వదినాన ఎన్నారైలు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

శ్రీవారి కళ్యాణ మహోత్సవం

సింగపూర్ సిటీ: సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో లోక కళ్యాణార్ధం, రాబోవు సంవత్సరమంతా అందరికీ శ్రేయస్కరంగా ఉండాలనే మహా సంకల్పంతో శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది పర్వదినాన ఎన్నారైలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ శ్రీనివాసునకు సుప్రభాతసేవ, తోమాలసేవ, అభిషేకం, విశేషపూజలతో పాటు విష్ణుదుర్గ అమ్మవారికి అభిషేకము మొదలగు విశేష కైంకర్యములతో శ్రీవారి కళ్యాణోత్సవాన్ని స్థానిక సెరంగూన్ రోడ్‌లోని శ్రీ శ్రీనివాస పెరుమాళ్ దేవాలయంనందు బుధవారం నాడు (మార్చి 22) అత్యంత భక్తిశ్రద్ధలతో, శాస్త్రోక్తంగా, కోలాహలంగా గోవింద నామస్మరణల మధ్య నిర్వహించారు. సింగపూర్‌లో కోవిడ్-19 నిబంధనలను పూర్తిగా సడలించిన తరువాత వచ్చిన ఉగాది కావటంతో సింగపూర్ తెలుగు సమాజం శోభాయమానంగా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. దీంతో వారాంతము కాకపోయినూ భారీగా తరలివచ్చిన భక్తకోటి ఆ దేవదేవుని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఇంత భారీగా నిర్వహించిన తెలుగు సమాజానికి అందరూ కృతజ్ఞతలు తెలిపారు. దేవాలయం బ్రహ్మోత్సవాల చివరి రోజు ఈసారి ఉగాది నాడు రావటం విశేషం.

కాగా, సంవత్సరంలో కేవలం నాలుగు సార్లు మాత్రమే అరుదుగా దేవాలయం వెలుపలకు వచ్చే ఉత్సవ మూర్తులకు తెలుగువారు ఉగాదిన అనేక సేవలు చేయడం మరో విశేషం. కళ్యాణోత్సవానంతరం శ్రీవారు ఆస్ధానంలో ఉండగా నిర్వహించిన పంచాంగ శ్రవణంను అందరూ ఆసక్తిగా ఆలకించారు. అంతేకాకుండా ఈ సంవత్సరం ఉదయము పూట కూడా సుమారు గంటసేపు పంచాంగ శ్రవణాన్ని ప్రత్యక్షప్రసారం ద్వారా ఏర్పాటు చేశారు.

తెలుగు సమాజం అధ్యక్షులు కోటిరెడ్డి మాట్లాడుతూ తెలుగు వారందరికీ శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలపటంతో పాటు ఈ సంవత్సరం అందరికీ బాగుండాలని ఆకాంక్షించారు. కళ్యాణోత్సవంలో పాల్గొన్న దంపతులకు తిరుమల తిరుపతి దేవస్థానం మరియు తి. తి. దే. కార్యవర్గ సభ్యులు శ్రీ చెవిరెడ్డి భాస్కరరెడ్డి సహాయ సహకారాలతో తీసుకొని వచ్చిన తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ, వడ ప్రసాదాలను, మంగళ ద్రవ్యాలను, బహుమానాన్ని అందజేసామని తెలిపారు.

కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయగా సుమారు 3,000 మంది వీక్షించారు. అలాగే ఈ ఉగాది నాడు సుమారు 2,000 మందికి సింగపూర్‌లోనే అరుదుగా లభించే వేప పువ్వు అందించామని తెలిపారు. సంప్రదాయబద్ధంగా తయారు చేసిన షడ్రచుల సమ్మిళితమైన ఉగాది పచ్చడిని సుమారు 6,000 మందికి పైగా అందించామని, కార్యక్రమానికి హాజరైన వారికి అన్నప్రసాదాన్ని అందించామని కార్యక్రమ నిర్వాహకులు బచ్చు ప్రసాద్ తెలియజేసారు. తమ కుటుంబాలకు దూరంగా సింగపూర్ నివశిస్తున్న కార్మిక సోదరులకు కూడా ఉగాది పచ్చడిని అందించామని తెలిపారు. స్ధానికులు కూడా ఉగాది పచ్చడిని సేవించి దాని విశిష్ఠతను తెలుసుకోవడం గమనార్హం.

కార్యక్రమానికి అన్నివిధాల సహకరించిన పెరుమాళ్ దేవస్ధాన కార్యవర్గాలకు, దాతలకు, కళ్యాణోత్సవంలో పాల్గొన్న దంపతులకు, భక్తులకు, పంచాంగ శ్రవణం చేసిన పండితులకి, వాలంటీర్లకు, కార్యక్రమానికి హాజరైన మరియు లైవ్ ద్వారా వీక్షించిన అందరికీ కార్యదర్శి సత్యచిర్ల ఈ సందర్భంగా ధన్యవాదములు తెలియజేశారు.

Updated Date - 2023-03-25T09:16:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising