ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

UAE: నివాసితుల వీసా, పాస్‌పోర్ట్ వివరాల కోసం.. యూఏఈలో మరో నయా టెక్నాలజీ

ABN, First Publish Date - 2023-10-26T08:35:33+05:30

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates) తమ నివాసితుల వీసా, పాస్‌పోర్ట్ వివరాల కోసం కొత్త వ్యవస్థను తీసుకువస్తోంది. అతి త్వరలో ఈ కొత్త వ్యవస్థ అందుబాటులోకి వస్తోందని తాజాగా ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజన్‌షిప్, పౌరసత్వం, కస్టమ్స్ మరియు పోర్ట్స్ సెక్యూరిటీ (ICP) వెల్లడించింది. ఈ వ్యవస్థ అందుబాటులోకి వస్తే ప్రైవేట్ రంగ సంస్థలు ఐసీపీ డేటాబేస్ నుంచి నేరుగా నివాసితులకు సంబంధించిన సరియైన డేటాను ఈజీగా పొందవచ్చు.

అబుదాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates) తమ నివాసితుల వీసా, పాస్‌పోర్ట్ వివరాల కోసం కొత్త వ్యవస్థను తీసుకువస్తోంది. అతి త్వరలో ఈ కొత్త వ్యవస్థ అందుబాటులోకి వస్తోందని తాజాగా ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజన్‌షిప్, పౌరసత్వం, కస్టమ్స్ మరియు పోర్ట్స్ సెక్యూరిటీ (ICP) వెల్లడించింది. ఈ వ్యవస్థ అందుబాటులోకి వస్తే ప్రైవేట్ రంగ సంస్థలు ఐసీపీ డేటాబేస్ నుంచి నేరుగా నివాసితులకు సంబంధించిన సరియైన డేటాను ఈజీగా పొందవచ్చు. అలాగే కార్డ్ రీడర్ల (Card Readers) అవసరం కూడా ఉండదని ఐసీపీ పేర్కొంది. అకీద్ (Akeed) అని పిలువబడే ఈ కొత్త వ్యవస్థను ఈ ఏడాది చివరిలో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో అందుబాటులోకి తెచ్చేందుకు ఐసీపీ కసరత్తు చేస్తోంది. కాగా, ఈ వ్యవస్థను గతవారం అక్టోబర్ 16 నుంచి 20వ తేదీ వరకు దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లో జరిగిన ప్రపంచంలోనే అతిపెద్ద టెక్నాలజీ ఎగ్జిబిషన్ జిటెక్స్ గ్లోబల్ సందర్భంగా ప్రయోగాత్మకంగా ప్రదర్శించడం జరిగింది. ప్రస్తుతం ఐసీపీ డేటాబేస్ నుంచి నివాసితులు, పౌరులకు సంబంధించిన సమాచారాన్ని సంగ్రహించడానికి ఎమిరేట్స్ ఐడీలు, కార్డ్ రీడర్లను వినియోగిస్తున్నారు.

Second salary in UAE: యూఏఈ సెకండ్ శాలరీ స్కీమ్స్.. సబ్‌స్క్రిప్షన్‌లో భారతీయ ప్రవాసులే టాప్

“అకీద్ ఒక కొత్త వ్యవస్థ. ఇది త్వరలో ప్రారంభించబడుతుంది. ఆర్థిక, ఆరోగ్య సంరక్షణ, బీమా, ఇతర రంగాలలోని సంస్థలకు అవసరమైన ఐసీపీ డేటాబేస్ నుండి సరైన సమాచారాన్ని పొందడానికి ఇది సహాయపడుతుంది. ఉదాహరణకు హెల్త్‌కేర్ కంపెనీకి ఒకరి పేరు, పాస్‌పోర్ట్ వివరాలు లేదా బీమా పాలసీ వ్యక్తులు అవసరం, దీన్ని డేటాబేస్ నుంచి పొందవచ్చు. ఇది ప్రతి ఎంటిటీకి పూర్తి సరైన సమాచారం అందిస్తుంది. అలాగే వ్యక్తులు మరియు కంపెనీల కోసం సమయాన్ని కూడా ఆదా చేస్తుంది. ఈ కొత్త సర్వీస్ అనేది కార్డ్ రీడర్‌ల సేవలను భర్తీ చేస్తుంది. కాబట్టి ప్రజలు కార్డ్ రీడర్‌లో ఎమిరేట్స్ ఐడీని పెట్టాల్సిన అవసరం లేదు” అని జిటెక్స్ స్టాండ్‌లో ఐసీపీ ప్రతినిధి ఒకరు చెప్పారు.

UAE: 3నెలల విజిట్ వీసాలను నిలిపివేసిన యూఏఈ.. ప్రస్తుతం విజిటర్లకు అందుబాటులో ఉన్న ఇతర లాంగ్‌టర్మ్ వీసా ఆప్షన్లు ఇవే..

Updated Date - 2023-10-26T08:42:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising