ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TACA: కెనడాలో వైభవంగా 'తాకా' వారి సంక్రాంతి సంబరాలు

ABN, First Publish Date - 2023-01-17T07:54:47+05:30

తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా (TACA) వారు మైఖేల్ పవర్ స్కూల్, ఎటోబీకోక్, కెనడాలో జనవరి 15న సంక్రాంతి సంబరాలను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టొరంటో: తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా (TACA) వారు మైఖేల్ పవర్ స్కూల్, ఎటోబీకోక్, కెనడాలో జనవరి 15న సంక్రాంతి సంబరాలను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఈ సంబరాలకు -15 డిగ్రీల చలిలో కూడా దాదాపు 1000 మందికి పైగా తెలుగువారు వచ్చి వేడుకలను విజయవంతం చేసారు. ఈ కార్యక్రమానికి అనిత సజ్జ, మహమ్మద్ ఖాజిల్,  విద్య భవనం, ప్రియ టేకి వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

మొదటగా తాకా అధ్యక్షులు కల్పనా మోటూరి, జ్యోతి సామంతపూడి, రజని లయం, జయశ్రీ తిరుచునాపల్లి, పల్లవి తెరాల కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనంతో ప్రారంభించారు. కల్పన అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసి తాకా చేస్తున్న ఎన్నో కార్యక్రమాలు గురించి వివరించారు. తాకా కార్యదర్శి ప్రసన్న తిరుచిరాపల్లి కార్యక్రమానికి విచ్చేసిన అతిథులను అందరినీ ఆహ్వానించి సంక్రాంతి పండుగ ప్రాముఖ్యతను వివరించారు. 25కి పైగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, కళా నృత్యాలు, సినిమా పాటలు, డాన్సులుతో  దాదాపు 4 గంటల పాటు ఉల్లాసంగా ఈ కార్యక్రమం జరిగింది.

'తాకా' వారు కార్యక్రమానికి వచ్చిన చిన్న పిల్లలకు డైరెక్టర్ అనిత సజ్జ, కల్పన మోటూరి భోగి పళ్ళ కార్యక్రమమును నిర్వహించి మంగళ వాయిద్యాల మధ్య ముత్తైదువులచే చిన్నారులను ఆశీర్వదింప చేసారు. తాకా కార్యవర్గ సభ్యులు శృతి ఏలూరి, రాణి మద్దెల సంక్రాంతి పండుగ మీద ముగ్గుల పోటీలు, చిన్నపిల్లలకు చిత్ర గీత పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. 

 

ప్రతి సంవత్సరం తాకా వారు ఆనవాయితీ ప్రకారం టొరంటో కాలమానంలో ప్రచురించిన తెలుగు క్యాలెండర్‌ను సంక్రాంతి పండుగ నాడు ఆవిష్కరిస్తారు. అలాగే ఈ సంవత్సరం కూడా టొరంటో తెలుగు తిధులు, నక్షత్రాలకు అనుగుణంగా ప్రచురించిన తెలుగు క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా తెలుగు క్యాలెండర్ ముద్రణకు సహకరించిన, టొరంటోకు తీసుకువచ్చిన రాకేష్ గరికిపాటికి, ప్రసన్న తిరుచిరాపల్లికి కల్పనా మోటూరి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసారు. తాకా 2023 ప్రధాన దాత రామ్ జిన్నాల తెలుగు క్యాలెండరును ఆవిష్కరించారు. తాకా డైరెక్టర్ గణేష్ తెరాల ఆధ్వర్యంలో అచ్చ తెలుగు వంటకాలు, అరిసెలతో తాకా వారు భోజనాలను ఏర్పాటు చేశారు. 

ఈ కార్యక్రమ విజయవంతం కావడానికి కృషి చేసిన కార్యదర్శి ప్రసన్న తిరుచిరాపల్లి, కోశాధికారి మల్లికార్జున చారి పదిర, ఉపాధ్యక్షులు నాగేంద్ర హంసాల, డైరెక్టర్స్ అనిత సజ్జ, శృతి ఏలూరి, గణేష్ తెరాల, రాణి మద్దెల, ట్రస్టీ చైర్మన్ మునాఫ్ అబ్దుల్, సభ్యులు రాఘవ్ అల్లం, సురేష్ కూన, వాణి జయంతి, ప్రవీణ్ పెనుబాక, వ్యవస్థాపక చైర్మన్  రవి వారణాసి, సభ్యులు చారి సామంతపూడి, శ్రీనాథ్  కుందూరు, అరుణ్ లయం, లోకేష్ చిల్లకూరు, రమేష్ మునుకుంట్ల, రాకేష్ గరికపాటి, రామచంద్రరావు దుగ్గినను అధ్యక్షులు కల్పన మోటూరి అభినందించారు.

అటు పిమ్మట కెనడా, భారత దేశ భక్తి గీతాలు ఆలపించడం జరిగింది. చివరిగా కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ ప్రధాన దాత రామ్ జిన్నాల, ఇతర దాతలకు, వీక్షించిన అతిధులకు తాకా కార్యదర్శి ప్రసన్న తిరుచిరాపల్లి వందన సమర్పణతో కార్యక్రమాన్ని జయప్రదంగా ముగించారు. 

Updated Date - 2023-01-17T07:56:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising