ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TANA: అమెరికాలో తెలుగు యువతి మృతి.. బాధిత కుటుంబానికి అండగా ‘తానా’

ABN, First Publish Date - 2023-01-27T21:24:56+05:30

అమెరికాలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన తెలుగు యువతి జాహ్నవి కుటుంబానికి ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) అండగా నిలిచింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: అమెరికాలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన తెలుగు యువతి జాహ్నవి కుటుంబానికి ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా-TANA) అండగా నిలిచింది. జాహ్నవి మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు తానా సభ్యులు సాయమందించారు. జనవరి 29న ఆమె మృతదేహం ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్‌లో హైదరాబాద్‌కు చేరుకోనుంది. స్కూల్ టీచర్‌గా పనిచేస్తున్న జాహ్నవి తల్లిని ఈ క్లిష్ట సమయంలో ఆర్థికంగా ఆదుకునేందుకు జాహ్నవి స్నేహితులు, తానా నిధుల సమీకరణకు పూనుకున్నారు. క్రౌడ్ ఫండింగ్ వేదిక ‘గో ఫండ్ మీ’ ద్వారా లక్షన్నర డాలర్ల నిధులు సమీకరించగలిగారు.

జాహ్నవి కుటుంబం కర్నూలు జిల్లా అదోని ఎంఐజీ కాలనీలో నివాసముంటోంది. 2021 సెప్టెంబర్‌లో జాహ్నవి అమెరికాకు వెళ్లారు. సియాటిల్‌లోని నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీలో మాస్టర్స్ చేస్తున్నారు. జనవరి 23న కాళాశాలకు వెళ్లి రాత్రి సమయంలో తిరిగొస్తుండగా ఆమెను ఓ పోలీసు వాహనం ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన జాహ్నవి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఈ దుర్వార్త ఆమె కుటుంబాన్ని శోకసంద్రంలోకి నెట్టేసింది.

Updated Date - 2023-01-27T21:37:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising