ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TAUK: 'టాక్' 6వ వార్షికోత్సవ వేడుకలు

ABN, First Publish Date - 2023-01-31T07:56:28+05:30

లండన్ నగరంలోని హౌన్సలో పట్టణంలో తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ (Telangana Association of United Kingdom) ఆరవ వార్షికోత్సవ వేడుకలతో పాటు గణతంత్ర దినోత్సవం (Republic Day) చాలా ఘనంగా నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లండన్: లండన్ నగరంలోని హౌన్సలో పట్టణంలో తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ (Telangana Association of United Kingdom) ఆరవ వార్షికోత్సవ వేడుకలతో పాటు గణతంత్ర దినోత్సవం (Republic Day) చాలా ఘనంగా నిర్వహించారు. మొదటగా 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉపాధ్యక్షురాలు శుషుమ్నా రెడ్డి మువన్నెల పతాక ఆవిష్కరణ చేశారు. ఆ తర్వాత అమరవీరులకు రెండు నిమిషాలు మౌనం పాటించి, దేశ స్వాతంత్ర సమరయోధులకు, జయశంకర్‌కు నివాళులు అర్పించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. టాక్ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల మాట్లాడుతూ, యావత్తు దేశ ప్రజలు ఈ రోజున గణతంత్ర దినోత్సవాన్ని పండుగగా జరుపుకుంటున్న ఈ శుభ సమయంలో మన దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన ఎందరో అమర వీరులను, త్యాగమూర్తులను స్మరించుకున్నారు. టాక్ సభ్యులందరికి ఆరవ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ యూకే అధ్యక్షులు అశోక్ దూసరి మాట్లాడుతూ, ఆ మహనీయుల ఆశయాల సాధనకు మనందరం కృషి చేద్దాం అన్నారు. అభివృద్ధి ఫలాలు సమాజంలోని అన్ని వర్గాల వారికి సమంగా అందాలనీ బాధ్యత గల పౌరులుగా మనందరం సమిష్టిగా శ్రమించి మన రాజ్యాంగ నిర్మాతలు ఆశించిన ఉజ్వల భారతాన్ని నిర్మించుకోవాలనే సాధన లక్ష్యంతో అహర్నిశం, అనుక్షణం కృషి చేద్దాం అని పేర్కొన్నారు. స్పోర్ట్స్ సెక్రటరీ రాకేష్ పటేల్ మాట్లాడుతూ, భారతీయతే మనకు ప్రథమం అనే సందేశాన్ని తీసుకెళ్లే దిశగా నేడు 'టాక్' సంస్థ ఆరవ ఆవిర్భావ వేడుకల సందర్భంగా ముందు గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ పతాకం ఎగరవేసుకోవడం నాకు ఎంతో స్ఫూర్తినిచ్చిందని తెలిపారు. ఈ సందర్భంగా టాక్ కార్యవర్గాన్ని అభినందించారు. గణతంత్ర దినోత్సవం అంటే కేవలం వేడుకలు జరుపుకునే రోజు మాత్రమే కాదని, ఇది దేశభక్తి మరియు స్వేచ్ఛ యొక్క మధురానుభూతి అని కమ్యూనిటీ అఫైర్స్ ఛైర్మెన్ నవీన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా నూతన సభ్యులు నిఖిల్ వేముల, సందీప్ బుక్క, నీలిమ, హారిక, కార్తిక్ శ్రీవాస్తవ, గణేష్ కుప్పాలను ప్రవీణ్ వీర, సత్యపాల్, మల్లారెడ్డి, సుప్రజ పులుసు 'టాక్' కండువాలు కప్పి కమిటీలోకి సాదరంగా ఆహ్వానించారు. 'టాక్' ఐటీ సెక్రటరీ నవీన్ భువనగిరి మాట్లాడుతూ కొత్త సభ్యుల చేరికతో ఇంకా ఎక్కువ స్ఫూర్తితో పని చేయాలని కోరారు.

అడ్వైజరీ బోర్డు వైస్ చైర్మన్ మట్టా రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో లండన్ నగరంలో తెలంగాణ జెండా మోసి, రాష్ట్రం ఏర్పాటు అయ్యే వరకు పోరాటం చేసిన ఎంతో మంది ఉద్యమ బిడ్డలతో కలిసి ఈ వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. చివరగా టాక్ ఇయర్ కేలండర్‌ని రిలీజ్ చేసి ఆ తర్వాత కేక్ కట్ చేసి పరస్పరం 'టాక్' సభ్యులు వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మల్లారెడ్డి వందన సమర్పణతో కార్యక్రమాన్ని ముగించారు. ఈ వేడుకలో టాక్ అధ్యక్షులు రత్నాకర్ కడుదుల, ఉపాధ్యక్షురాలు శుషుమ్నా రెడ్డి, బోర్డు చైర్మన్ మట్టా రెడ్డి, ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ యూకే అధ్యక్షులు అశోక్ దూసరి కార్యవర్గ సభ్యులు నవీన్ రెడ్డి ప్రవీణ్ కుమార్ వీర, రవి ప్రదీప్ పులుసు, నవీన్ భువనగిరి, హరి గౌడ్, రాకేష్ పటేల్, సత్యపాల్, మల్లారెడ్డి, నిఖిల్ వేముల, సందీప్ బుక్క, కార్తీక్ శ్రీవాస్తవ, గణేష్ కుప్పాల, శివ వెన్న, లడ్డు, ప్రశాంత్, మనోజ్, నితిన్, సాయి కిరణ్ రెడ్డి, అక్షయ్, ధీర, మహిళా విభాగం సభ్యులు సుప్రజ పులుసు, నీలిమ, హారిక, నందిని, పావని, తార తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-31T07:56:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising