ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

NATS: 'నాట్స్' ఆధ్వర్యంలో న్యూజెర్సీలో టెన్నీస్ టోర్నమెంట్‌

ABN, First Publish Date - 2023-05-16T11:00:33+05:30

అమెరికాలో తెలుగువారిలో క్రీడాస్ఫూర్తిని రగిలించేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం 'నాట్స్' (NATS) తాజాగా టెన్నీస్ టోర్నమెంట్ నిర్వహించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సింగిల్స్, డబుల్స్‌లో సత్తా చాటిన తెలుగు ప్లేయర్స్

ప్లేయిన్స్‌బరో, న్యూ జెర్సీ: అమెరికాలో తెలుగువారిలో క్రీడాస్ఫూర్తిని రగిలించేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం 'నాట్స్' (NATS) తాజాగా టెన్నీస్ టోర్నమెంట్ నిర్వహించింది. న్యూజెర్సీలో నాట్స్ నిర్వహించిన టెన్నీస్ టోర్నమెంట్‌కు చక్కటి స్పందన లభించింది. సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో జరిగిన ఈ టోర్నమెంట్‌లో తెలుగు, తెలుగేతర ఆటగాళ్లు తమ సత్తా చాటారు. న్యూ యార్క్, న్యూ జెర్సీ రాష్ట్రాలనుండి మొత్తం 44 డబుల్స్ టీమ్స్ పాల్గొన్న ఈ టోర్నమెంట్ గత 5 వారాలుగా నిరాఘాటంగా సాగుతూ, ప్లేయిన్స్‌బరో టౌన్షిప్ కోర్ట్‌లలో ఫైనల్‌లో పోటీ పడ్డారు.

ఎడిసన్‌కు చెందిన చేతన్ చావ్డ, ఆనంద్ ఠాకూర్ డబుల్స్

ఎడిసన్‌కు చెందిన చేతన్ చావ్డ, ఆనంద్ ఠాకూర్ డబుల్స్ ఛాంపియన్షిప్‌తో పాటు, 1000 డాలర్ల నగదు బహుమతి కూడా గెలిచారు. డబుల్స్ టోర్నమెంట్‌లో సౌత్ బృన్స్విక్‌కు చెందిన ప్రహ్లాద్ విష్ణుభొట్ల, రామచంద్రన్ పిలవులతిల్ రన్నరప్‌గా నిలిచి 500 డాలర్ల ప్రైజ్ మనీని గెలుచుకున్నారు. యూఎస్‌టీఏ (USTA) ర్యాంకింగ్ జట్లు ప్రభు లక్ష్మి శ్రీకాంత్, ప్రకాష్ కోడె, రాజేష్, తారాచంద్ వర్మ టోర్నమెంట్‌లో పాల్గొని, ఆట ప్రమాణాలను పెంచారు.

టెన్నీస్ సింగిల్స్

13 నుండి 25 సంవత్సరాల వయస్సు విభాగంలో టెన్నిస్‌ను ప్రోత్సహించడం ద్వారా ట్రోఫీలు, ప్రైజ్ మనీని గెలుచుకునే అవకాశాన్ని కల్పించాలని నాట్స్ కోరుకుంది. సింగిల్స్ టోర్నమెంట్‌లో మొత్తం 26 మంది యువ ఆటగాళ్లు పాల్గొన్నారు. వశిష్ట లింగ సింగిల్స్ ఛాంపియన్‌గా నిలిచి, 1000 డాలర్ల ప్రైజ్ మనీని గెలుచు గెలుచుకున్నారు. సాధిష్ట లింగ రన్నరప్‌గా నిలిచి 500 డాలర్ల నగదు బహుమతి దక్కించుకున్నారు.

నాట్స్ స్పోర్ట్స్ కమిటీ డైరెక్టర్ సరోజ సాగరం, కో డైరెక్టర్ చంద్రశేఖర్ కొణిదెల, చైర్ పర్సన్ శ్రీనివాస్ కొల్ల, ఆర్గనైజింగ్ సభ్యులు గోవింద్, స్పోర్ట్స్ కమిటీ సభ్యులు శ్రీనివాస్ నీలం, శ్రీనివాస్ వెంకట్ రామన్, గణేశ్ పిల్లరశెట్టి ఈ టోర్నమెంట్‌ దిగ్విజయంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించారు. యూఎస్‌టీఏ ర్యాంక్ క్రీడాకారులు హేమంత్ కొల్లూరి, ప్రణవ్ వడ్డేపల్లి, బ్రైనెర్ ఏంజిలో, తనీష్ మురళి తమ ఆటలో అద్భుత ప్రదర్శన కనబరిచారు.

ఈ టోర్నమెంట్ విజయవంతం కావడానికి తమ వంతు కృషి చేశారు. టెన్నీస్ టోర్నమెంట్‌లో విజేతలకు నాట్స్ చైర్ విమెన్ అరుణ గంటి, నాట్స్ సంబరాల కమిటీ కన్వీనర్ శ్రీధర్ అప్పసాని, కో కన్వీనర్ రాజ్ అల్లాడ, డిప్యూటీ కన్వీనర్ శ్రీహరి మందాడి, కో కోఆర్డినేటర్ రంజిత్ చాగంటి, సంబరాల కమిటీ ట్రెజరర్ చక్రధర్ వోలేటి, నాట్స్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ (మీడియా) మురళీ మేడిచెర్ల, కో డైరెక్టర్ చంద్రశేఖర్ కొణిదెల, నాట్స్ నాయకులు డా. సూర్యం గంటి, విష్ణు ఆలూరు, ప్రసాద్ గుఱ్ఱం తదితరులు విజేతలకు బహుమతులు అందించారు.

నాట్స్ టెన్నీస్ టోర్నమెంట్ విజయానికి దోహదపడ్డ ప్రతి ఒక్కరికి నాట్స్ ప్రెసిడెంట్ బాపయ్య చౌదరి(బాపు) నూతి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Updated Date - 2023-05-16T13:37:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising