Visa free Countries: మలేషియా ఆఫర్ ఓకే కానీ.. అసలు ఏఏ దేశాలకు భారతీయులు వీసా లేకుండా వెళ్లొచ్చంటే..!
ABN , First Publish Date - 2023-11-28T20:34:41+05:30 IST
భారతీయులకు అనేక దేశాల ప్రభుత్వాలు వీసా లేకుండానే తమ దేశాల్లో పర్యటించేందుకు అవకాశం కల్పిస్తున్నాయి.
ఎన్నారై డెస్క్: విదేశీ పర్యటనలంటే మీకిష్టమా? అయితే..ప్రపంచాన్ని చుట్టొచ్చేందుకు ఇంతకు మించిన తరుణం మరొకటి ఉండకపోవచ్చు. భారతీయులకు వీసాలు అవసరం లేకుండానే అనేక దేశాలు స్వాగతం పలుకుతున్నాయి. తాజాగా మలేషియా ప్రభుత్వం భారత పాస్‌పోర్టు ఉన్న వారికి వీసా రహిత ఎంట్రీకి అవకాశం ఇచ్చింది. కొన్ని రోజుల క్రితమే థాయ్‌లాండ్ కూడా ఇదే ఆఫర్ ప్రకటించింది. వీటితో పాటూ అనేక దేశాలు గతంలోనే భారతీయులకు వీసా అక్కర్లేని పర్యటనలకు అవకాశం కల్పించాయి. అవేంటో ఓమారు తెలుసుకుంటే విదేశీ పర్యటనల ప్లానింగ్ సమయంలో అక్కరకు వస్తుంది.
భారత విదేశాంగ శాఖ వివరాల ప్రకారం..
బార్బడాస్
భూటాన్
డొమినికన్ రిపబ్లిక్
ఫిజీ
హైతీ
హాంకాంగ్
కజకస్థాన్
మాల్దీవ్స్
నేపాల్
నుయీ ఐలాండ్
ఖతర్
సెయింట్ విన్సెంట్ అండ్ గ్రెనడీన్స్
సెనెగల్
శ్రీలంక
సెయింట్ లూషియా
ది కుక్ ఐలాండ్స్ దేశాల ప్రభుత్వాలు భారతీయులను వీసా రహిత పర్యటనలకు అనుమతించాయి. తాజాగా ఈ లిస్టులో మలేషియా, థాయ్‌లాండ్ చేరాయి.
Viral: చికెన్ శాండ్‌విచ్‌తో ఫ్లైట్ ఎక్కిన మహిళ..విమానంలో కునుకు తీయడంతో జరిగిందో దారుణం!
Viral: విసిగిపోయిన భారతీయ రెస్టారెంట్.. బ్రిటన్ ప్రజలకు ఊహించని వార్నింగ్!