ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Golden Visa: యూఏఈ గోల్డెన్ వీసా పొందేందుకు 3 సులువైన మార్గాలు.. అది కూడా నాన్-రియల్ ఎస్టేట్ పెట్టుబడుల ద్వారా..

ABN, First Publish Date - 2023-11-07T09:17:37+05:30

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates) లో దీర్ఘకాలిక నివాసానికి వీలు కల్పించేది గోల్డెన్ వీసా (Golden Visa ). అయితే, ఈ వీసా విదేశీయులకు అంత ఈజీగా దొరకదు. వివిధ రంగాల్లో తమ దేశానికి విశేష కృషి చేసిన వారికి యూఏఈ ప్రభుత్వం ఈ గోల్డెన్ వీసాను మంజూరు చేస్తుంది.

దుబాయ్: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates) లో దీర్ఘకాలిక నివాసానికి వీలు కల్పించేది గోల్డెన్ వీసా (Golden Visa ). అయితే, ఈ వీసా విదేశీయులకు అంత ఈజీగా దొరకదు. వివిధ రంగాల్లో తమ దేశానికి విశేష కృషి చేసిన వారికి యూఏఈ ప్రభుత్వం ఈ గోల్డెన్ వీసాను మంజూరు చేస్తుంది. యూఏఈ ఇచ్చే ఈ లాంగ్‌టర్మ్ వీసా 10, 5ఏళ్ల కాలపరిమితో ఉంటుంది. అంతేగాక ఆటోమెటిక్‌గా రెన్యువల్ అవుతుంది. 2019లో యూఏఈ ప్రభుత్వం ఈ దీర్ఘకాలిక రెసిడెన్సీ వీసాల కోసం ఓ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఈ వ్యవస్థ యూఏఈలో విదేశీయులకు ఎలాంటి స్పాన్సర్షిప్ అవసరం లేకుండా నివాసం, పనిచేసుకోవడం, అధ్యయనానికి వీలు కల్పిస్తుంది. అలాగే వందశాతం ఓనర్‌షిప్‌తో ఆ దేశంలో సొంతంగా వ్యాపారాలు నిర్వహించుకోవచ్చు.

ఇలా ఎమిరేట్స్ జారీచేసే ఈ గోల్డెన్ వీసాతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇక ఈ వీసాను 2018 కేబినెట్ తీర్మానం నెం. 56 ప్రకారం పెట్టుబడిదారులు (కనీసం రూ. 20.50కోట్లు), పారిశ్రామికవేత్తలు, సైన్స్, నాలెడ్జ్, స్పోర్ట్స్ రంగంలోని నిపుణులు, ప్రత్యేక ప్రతిభావంతులకు ఇస్తున్నారు. అయితే, రియల్ ఎస్టేట్‌లో భారీ పెట్టుబడులు పెట్టకుండా కూడా ఇతర ఇన్వెస్ట్‌మెంట్స్ ద్వారా ఈ వీసాను పొందే వెసులుబాటు ఉంది. ఎలాగంటే.. మూడు నాన్-రియల్ ఎస్టేట్ పెట్టుబడుల ద్వారా గోల్డెన్ వీసాను పొందవచ్చు. బ్యాంక్ డిపాజిట్స్, కంపెనీ ఇన్వెస్టర్, ప్రూప్ ఆఫ్ ట్యాక్స్ పేమెంట్స్.. ఈ మూడు మార్గాల ద్వారా కూడా సులువుగా విదేశీయులు గోల్డెన్ వీసా పొందవచ్చు.

Big Ticket raffle: ఫ్రీ టికెట్‌తో రూ. 45కోట్లు గెలుచుకున్న ప్రవాసుడు.. తీరా నిర్వాహకులు ఫోన్ చేస్తే నో రెస్పాన్స్!

బ్యాంక్ డిపాజిట్..

యూఏఈ (UAE) లో గుర్తింపు పొందిన బ్యాంకులో మీకు 2 మిలియన్ దిర్హామ్‌ల (రూ. 4.53కోట్లు) డిపాజిట్ ఉందని పేర్కొంటూ సంబంధిత అధికారులకు ఒక లేఖను సమర్పించాలి. తద్వారా మీకు గోల్డెన్ వీసా మంజూరు చేయడబడుతుంది.

కంపెనీ ఇన్వెస్టర్..

గుర్తింపు పొందిన కంపెనీలో పెట్టుబడిదారుడిగా ఉన్నట్టు చెల్లుబాటయ్యే వాణిజ్య లైసెన్స్ లేదా పారిశ్రామిక లైసెన్స్‌తో పాటు మీ ఇన్వెస్ట్‌మెంట్ అనేది 2 మిలియన్ దిర్హామ్‌ల (రూ. 4.53కోట్లు) తగ్గకుండా అసోసియేషన్ ఆఫ్ మెమోరాండం (MOA) ఇవ్వాల్సి ఉంటుంది.

ప్రూప్ ఆఫ్ ట్యాక్స్ పేమెంట్స్..

ఈ కేటగిరీ కింద గోల్డెన్ వీసా కోసం అర్హత పొందేందుకు మీరు ఫెడరల్ టాక్స్ అథారిటీ (Federal Tax Authority) నుండి పెట్టుబడిదారుడిగా ప్రభుత్వానికి సంవత్సరానికి 250,000 దిర్హమ్స్ (రూ.56లక్షలు) కంటే తక్కువ కాకుండా చెల్లిస్తున్నట్లు ఒక లేఖను సమర్పించాలి.

ఇక ఈ మూడు పద్దతులలో గోల్డెన్ వీసా పొందేందుకు కావాల్సిన ఇతర ధృవపత్రాలు..

• ఇటీవలి పాస్‌పోర్ట్ సైజ్ కలర్ ఫొటో

• చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్ట్ జిరాక్స్ కాపీ

• ఆరోగ్య బీమా పాలసీ జిరాక్స్ కాపీ

• మెడికల్ ఫిట్‌నెస్ టెస్ట్ జిరాక్స్ కాపీ

• యూఏఈ ఎంట్రీ పర్మిట్ జిరాక్స్ కాపీ

UAE family visit visa: యూఏఈ టూర్ వెళ్లే ఆలోచనలో ఉన్నారా? అయితే ఇది మీ కోసమే..!

Updated Date - 2023-11-07T09:18:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising