US Visas: ఆ రెండు వీసాలపై యూఎస్ వెళ్లేవారికి గుడ్‌న్యూస్.. ఇకపై వాటితో కూడా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు..!
ABN, First Publish Date - 2023-03-24T09:11:57+05:30
టూరిస్ట్ వీసా (Tourist Visa) లేదా బిజినెస్ వీసాపై (Business Visa) అమెరికా వచ్చేవారికి జో బైడెన్ (Joe Biden) ప్రభుత్వం గుడ్‌న్యూస్ (Good News) చెప్పింది.
వాషింగ్టన్: టూరిస్ట్ వీసా (Tourist Visa) లేదా బిజినెస్ వీసాపై (Business Visa) అమెరికా వచ్చేవారికి జో బైడెన్ (Joe Biden) ప్రభుత్వం గుడ్‌న్యూస్ (Good News) చెప్పింది. ఈ రెండు వీసాలపై యూఎస్ వచ్చినవారు జాబ్స్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని, ఇంటర్వ్యూలకు హాజరు కావొచ్చని తెలిపింది. అయితే, ఉద్యోగంలో చేసేముందే ఆ వీసాను మార్చుకోవాల్సి ఉంటుందని అమెరికా ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక తమ దేశానికి వ్యాపార పనుల కోసం వచ్చే విదేశీయులకు బీ-1 వీసాను (B1 Visa), సందర్శకులకు బీ-2 వీసాను (B2 Visa) ఇస్తుంటుంది యూఎస్. బైడెన్ ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో ఈ రెండు వీసాల వారు ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి మార్గం సుగమమైంది.
ఈ మేరకు యూఎస్ సిటిజెన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (US Citizenship and Immigration Services) బుధవారం వివరాలను వెల్లడించింది. కాగా, ఇటీవల లేఆఫ్‌ల (Layoffs) కారణంగా చాలామంది ఉద్యోగాలు పొగొట్టుకున్నారు. ఇలా జాబ్స్ పోయినవారు అగ్రరాజ్యం వలస నిబంధనల ప్రకారం రెండు నెలల్లో కొత్త ఉద్యోగం వెతుక్కొవాల్సి ఉంటుంది. లేనిపక్షంలో దేశం విడిచిపెట్టి వెళ్లిపోవాలి. ఇలాంటి విపత్కర సమయంలో అమెరికా ఇలా బిజినెస్, పర్యాటక వీసాలపై ఆ దేశానికి వెళ్లే విదేశీయులు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే (Apply for Jobs) వెసులుబాటు కల్పించడం చాలా మంచి నిర్ణయం అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇది కూడా చదవండి: ప్రముఖ సీనియర్ నటి కుమార్తెకు యూఏఈ 'గోల్డెన్ వీసా'..!
ఈ నేపథ్యంలో బుధవారం యూఎస్‌సీఐఎస్ (USCIS) వరుస ట్వీట్లు చేసింది. 60 రోజుల్లో ఉద్యోగం రానివారు దేశం విడిచి వెళ్లాలన్న అంశాన్ని కొన్నిసార్లు తప్పుగా అర్థం చేసుకుంటున్నారని, వారికి అనేక మార్గాలున్నాయని తెలిపింది. "హెచ్-1బీ వీసా ఉన్నవారు ఉద్యోగం కోల్పోయినా వారికి పలు అవకాశాలున్నాయి. ఆ వీసాను మార్చుకోవడం, హోదాను సర్దుబాటు చేసుకునేందుకు దరఖాస్తు చేసుకోవడం, తప్పనిసరి పరిస్థితుల నేపథ్యంలో ఉద్యోగ ధృవీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేసుకోవడం, సరైన కారణాలు చూపుతూ జాబ్ మారేందుకు పాత యాజమాన్య సంస్థను వదిలేస్తున్నానని దరఖాస్తు చేసుకోవడం వంటి వెసులుబాటు ఉన్నాయి. ఇలాంటి దరఖాస్తులను 60 రోజుల్లోగా చేసుకుని ఉంటే హెచ్-1బీ వీసాలున్నవారు ఉద్యోగం పోయినా అగ్రరాజ్యంలో ఉండవచ్చు. చాలామందికి బీ-1, బీ-2తో జాబ్స్ వెతుక్కోవడానికి అనుమతి ఉంది" అని యూఎస్‌సీఐఎస్ తన ట్వీట్‌లో (Tweet) పేర్కొంది.
ఇది కూడా చదవండి: సింప్లీ సూపర్బ్.. ఇండియన్స్‌తో కలిసి బ్రిటీష్ పోలీస్ స్టెప్పులు.. వైరల్ అవుతున్న వీడియో!
Updated Date - 2023-03-24T09:11:57+05:30 IST