ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

NRI: సీన్ రివర్స్.. కజిన్‌ను హతమార్చేందుకు ఇద్దరు షూటర్లను నియమించిన ఎన్నారై.. చివరికి జరిగింది ఇదీ!

ABN, First Publish Date - 2023-02-12T08:47:41+05:30

ఈ నెల 8న పంజాబ్‌లోని (Punjab) సంరల పోలీసులు ఇద్దరు షార్ప్ షూటర్లను (Sharpshooters) అదుపులోకి తీసుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లూథియానా: ఈ నెల 8న పంజాబ్‌లోని (Punjab) సంరల పోలీసులు ఇద్దరు షార్ప్ షూటర్లను (Sharpshooters) అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద గన్‌తో (Gun) పాటు ఎనిమిది బుల్లెట్స్ దొరకడంతో అనుమానం వచ్చి పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. అనంతరం విచారించగా వారు చెప్పిన విషయం పోలీసులకు షాక్‌కు గురి చేసింది. వెంటనే వారిచ్చిన సమాచారంతో కువైత్‌లో (Kuwait) ఉండే ఎన్నారై‌పై (NRI) కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సంరల డీఎస్‌పీ వార్యం సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 8న స్పెషల్ తనిఖీలు నిర్వహిస్తున్న సంరల పోలీసులు గురుచరణ్ సింగ్ నిక్కా, కుల్వంత్ సింగ్ కంతాలను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద తుపాకీతో పాటు 8బల్లెట్లు లభించడంతో అరెస్ట్ చేశారు. అనంతరం వారిని తర్వాతి రోజు కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం వారిని రెండు రోజుల రిమాండ్ విధించింది. అయితే, పోలీసుల విచారణలో వారు షాకింగ్ విషయం చెప్పారు.

తమను కువైత్‌లో ఉండే బధానీ కలాన్‌కు చెందిన ఎన్నారై ఏకం సింగ్ తన కజిన్ చంపేందుకు సుపారీ ఇచ్చినట్లు వెల్లడించారు. ఏకం సింగ్ కుటుంబ తగాదాల నేపథ్యంలో తన కజిన్‌ను హతమార్చేందుకు ఇలా ప్లాన్ చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. అంతేగాక ఈ పని పూర్తి చేస్తే గురుచరణ్ సింగ్ నిక్కా, కుల్వంత్ సింగ్ కంతాలను స్పాన్సర్‌షిప్‌పై కువైత్ తీసుకెళ్లడంతో పాటు బస ఏర్పాటు చేస్తానని ఏకం డీల్ కుదుర్చుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇంతకుముందు కూడా ఒకసారి ఈ ఇద్దరు ఏకం చెప్పిన వ్యక్తిని చంపేందుకు ప్రయత్నించి విఫలయత్నం చేశారు. దాంతో ఈసారి ఎలాగైనా ఆ వ్యక్తిని అంతమొందించాలని వారికి గట్టిగా చెప్పినట్లు పోలీసులు తేల్చారు. గురుచరణ్ సింగ్ నిక్కా, కుల్వంత్ సింగ్ కంతా, ఏకం సింగ్‌పై హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్‌పీ వార్యం సింగ్ చెప్పారు.

ఇది కూడా చదవండి: అదృష్టం అంటే ఈ భారతీయుడిదే.. 2నెలల కింద 1కిలో గోల్డ్.. మళ్లీ ఇప్పుడేమో..

Updated Date - 2023-02-12T08:47:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising