Eid Al Adha: యూఏఈలో లాంగ్ వీకెండ్.. ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగులకు ఎన్ని రోజుల సెలవులంటే..
ABN, First Publish Date - 2023-06-20T08:31:57+05:30
ఈద్ అల్ అధా (Eid Al Adha) కోసం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates) తాజాగా ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగులకు అధికారిక సెలవులను ప్రకటించింది.
అబుదాబి: ఈద్ అల్ అధా (Eid Al Adha) కోసం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates) తాజాగా ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగులకు అధికారిక సెలవులను ప్రకటించింది. ఈద్‌కు 4 రోజులు సెలవులు ఇస్తున్నట్లు తన ప్రకటనలో పేర్కొంది. జూన్ 27 నుంచి 30 వరకు వరుసగా నాలుగు రోజులు సెలవులు ప్రకటించింది. ఇక వీకెండ్ కూడా కలిసి రావడంతో శని, ఆదివారం కలిపి మొత్తం 6 రోజులు సెలవులు వస్తున్నాయి. జూలై 3 నుంచి యధావిధిగా కార్యాలయాలు తెరచుకుంటాయి. కాగా, ఏప్రిల్‌లో రంజాన్ (Ramdan) తర్వాత ఈ ఏడాదిలో ఇది రెండో అతి పెద్ద లాంగ్ వీకెండ్ అని చెప్పొచ్చు.
అయితే, యూఏఈ నివాసితులు (Residents) ఈ 6 రోజుల వీకెండ్‌ను 9 లేదా 10 రోజుల సెలవులుగా మార్చుకునే అవకాశం ఉంది. జూన్ 26న ఒకరోజు సెలవు (Leave) కోసం దరఖాస్తు చేసుకుంటే.. దీనికి ఒకవేళ ఆయా కంపెనీలు కూడా ఆమోదం తెలిపితే మాత్రం ఎమిరేట్‌లోని ఉద్యోగులు జూన్ 24 నుంచి జూలై 2 వరకు తొమ్మిది రోజులు పాటు సెలవుల్లో ఉండొచ్చు. మరోవైపు షార్జాలో (Sharjah) పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు ఏకంగా 10రోజుల విరామం పొందే వీలు ఉంది. ఎందుకంటే ఇక్కడ వారానికి నాలుగు రోజుల పని విధానం అమల్లో ఉంది. దీంతో ఈ రెండు ఎమిరేట్స్‌లలోని ఉద్యోగులు ఈ లాంగ్ వీకెండ్‌ను భారీగా ప్లాన్ చేసుకుంటున్నారు. ఎక్కువగా పొరుగు దేశాలకు విహారయాత్రలకు వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నట్లు అక్కడి ట్రావెల్ ఏజెన్సీలు (Travel Agencies) పేర్కొంటున్నాయి.
The Marble Palace: దుబాయిలో అమ్మకానికి రూ.1,600కోట్ల భవంతి.. కొనుగోలు చేసే యోచనలో భారతీయుడు!
Updated Date - 2023-06-20T08:31:57+05:30 IST