ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

UAE: 2022లో ప్రవాసులకు యూఏఈ ఎన్ని రెసిడెన్సీ పర్మిట్లు జారీ చేసిందంటే..?

ABN, First Publish Date - 2023-03-05T14:13:23+05:30

ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ సిటిజన్‌షిప్, కస్టమ్స్, పోర్ట్స్ సెక్యూరిటీ ( Federal Authority for Identity and Citizenship, Customs and Ports Security) తాజా గణాంకాల ప్రకారం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

అబుదాబి: ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ సిటిజన్‌షిప్, కస్టమ్స్, పోర్ట్స్ సెక్యూరిటీ ( Federal Authority for Identity and Citizenship, Customs and Ports Security) తాజా గణాంకాల ప్రకారం.. 2022లో 3,415,241 మంది నివాసితులకు రెసిడెన్సీ పర్మిట్లు (Residency Permits) జారీ చేసింది. ఇది 2021తో పోలిస్తే 46శాతం అధికం. 2021లో కేవలం 2,032,855 మందికి మాత్రమే నివాస అనుమతులు ఇచ్చింది. 2022లో దేశంలోని ప్రవాసుల (Expats) కోసం నివాస అనుమతులను రెన్యువల్ చేయడానికి మొత్తం 2,390,595 లావాదేవీలు జరగగా, వీటి సంఖ్య 2021లో 2,379,134గా ఉంది. యూఏఈలో (UAE )వివిధ రకాల వీసాలు, ప్రవేశ, నివాస అనుమతులను పొందేందుకు విదేశాలలో ఉన్న వ్యక్తులు తమ అధికారిక వెబ్‌సైట్ www.icp.gov.ae, స్మార్ట్ యాప్(UAEICP) ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని ఐసీపీ తెలియజేసింది.

ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలు లేదా ఫ్రీ జోన్ కోసం పనిచేసే వ్యక్తికి లేబర్ రెసిడెన్సీ పర్మిట్లు (Labour Residency Permits), నివాస అనుమతి పెట్టుబడిదారు లేదా భాగస్వామి, విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో చదువుకోవడానికి నివాస అనుమతి, అలాగే ప్రభుత్వ, ప్రైవేట్ సెక్టార్‌లో లేదా ఫ్రీ జోన్‌లో పనిచేస్తున్న తండ్రికి నవజాత శిశువుకు నివాస అనుమతి, గృహ సహాయకులకు నివాస అనుమతులు, స్పాన్సర్ కుటుంబ సభ్యులకు నివాస అనుమతి ఇవ్వనున్నట్లు ఈ సందర్భంగా ఐసీపీ వెల్లడించింది. అయితే, ప్రాయోజిత వ్యక్తికి మాత్రం తప్పనిసరిగా ఆరు నెలల కంటే తక్కువకాకుండా చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్ట్ (Passport) కలిగి ఉండాలని ఐసీపీ ప్రకటించింది.

ఇది కూడా చదవండి: అదానీ షేర్ల దూకుడుతో ఆ ఎన్నారై పంటపడింది.. రెండు రోజుల్లోనే ఏకంగా రూ. 3,100 కోట్ల లాభం..!

Updated Date - 2023-03-05T14:13:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising