UAE: పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా 1,025 మంది ఖైదీలకు క్షమాభిక్ష!
ABN, First Publish Date - 2023-03-22T08:44:07+05:30
పవిత్ర రంజాన్ (Ramadan) మాసం సందర్భంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates) తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.
అబుదాబి: పవిత్ర రంజాన్ (Ramadan) మాసం సందర్భంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates) తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. 1,025 మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించింది. ఈ మేరకు ఆ దేశ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ (UAE President Sheikh Mohamed bin Zayed) దేశవ్యాప్తంగా వివిధ జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న 1,025 మంది ఖైదీలను విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక ముఖ్యమైన ఇస్లామిక్ సందర్భాలలో యూఏఈలోని ప్రతి ఎమిరేట్ పాలకులు ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదిస్తుంటారు. సత్ర్పవర్తన కలిగిన ఖైదీలకు సామాజిక, వృత్తిపరమైన జీవితాలను గడపడానికి వీలుగా వారికి ఒక అవకాశం కల్సించాలనే ఉద్దేశంతో ఇలా క్షమాభిక్ష పెడుతుంటారు.
ఇదిలాఉంటే.. రంజాన్ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా 1.9 బిలియన్లకు పైగా ముస్లింలు పవిత్ర మాసం ఆచారాలను స్వీకరించడానికి సిద్ధం అవుతున్నారు. బుధవారం (మార్చి 22) చందమామ కనిపిస్తే ఇవాళ్టి నుంచే రంజాన్ మాసం ప్రారంభం అవుతుంది. లేదంటే రేపటి (గురువారం) నుంచి పవిత్ర మాసం ప్రారంభంకానుంది. ఈ మేరకు యూఏఈ మూన్ సైటింగ్ కమిటీ (UAE's Moon Sighting Committee) భేటీ అనంతరం దీనిపై ఒక నిర్ణయం తీసుకోనుంది. కాగా, ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం రంజాన్ నెల ఉపవాసాలు (రోజా) చంద్రుడు కనిపించే సమయాన్ని బట్టి 29 లేదా 30 రోజల పాటు కొనసాగుతాయి.
ఇది కూడా చదవండి: ఆసియాలోనే అతిపెద్ద అమెరికన్ కాన్సులేట్ కార్యాలయం.. ఇకపై వీసాల కోసం వేచి ఉండే అవస్థలకు చెక్!
Updated Date - 2023-03-22T08:44:07+05:30 IST