ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

UAE: ప్రైవేట్ రంగంలో ఉద్యోగ నియామకాల్లో కొత్త రూల్.. యూఏఈలోని భారతీయ ప్రవాసులకు కష్టాలు మొదలైనట్టేనా?

ABN, First Publish Date - 2023-07-12T11:17:12+05:30

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates) ప్రైవేట్ రంగంలో ఉద్యోగ నియామకాల్లో వచ్చే ఏడాది నుంచి కొత్త రూల్ తీసుకువస్తుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అబుదాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates) ప్రైవేట్ రంగంలో ఉద్యోగ నియామకాల్లో వచ్చే ఏడాది నుంచి కొత్త రూల్ తీసుకువస్తుంది. ప్రైవేట్ రంగానికి చెందిన దాదాపు 14 కేటగిరీలకు చెందిన ఉద్యోగాలకు ఈ కొత్త రూల్‌ను అమలు చేయాలని నిర్ణయించింది. ఇక కొత్త రూల్ ప్రకారం 20 నుంచి 49 మంది ఉద్యోగులు కలిగిన సంస్థలు తప్పనిసరిగా ఒక యూఏఈ జాతీయుడు (One Emirati) ఉండేలా నియామకాలు చేపట్టాలి. ఈ రూల్ 2024 నుంచి అమల్లోకి వస్తుంది. ఆ తర్వాతి ఏడాది (2025) నుంచి ఈ ఒకరు కాస్తా రెండింటికి పెంచాలని నిర్ణయించింది. అంటే.. 2025 నుంచి 49 మంది ఉద్యోగుల్లో ఇద్దరు ఎమిరేటీలు (Emiratis) ఉండడం తప్పనిసరి అన్నమాట. ఈ మేరకు ఆ దేశ మానవ వనరులు మరియు ఎమిరేటైజేషన్ మంత్రిత్వ శాఖ (Ministry of Human Resources and Emiratisation) తాజాగా ఓ కీలక ప్రకటన విడుదల చేసింది.

"2024లో కనీసం ఒక యూఏఈ పౌరుడిని, 2025లో ఇద్దరిని నియమించుకోవాల్సిన అవసరం ఉంది. 14 కీలక ఆర్థిక రంగాలలోని టార్గెటెడ్ సంస్థలలో ఉపాధి పొందుతున్న ఎమిరాటీల సంఖ్యను పెంచడం ఈ నిర్ణయం లక్ష్యం. ఆయా సంస్థలకు మంత్రిత్వ శాఖకు చెందిన డిజిటల్ ఛానెల్‌ల ద్వారా సమాచారం తెలియజేస్తామని" మంత్రిత్వశాఖ తన ప్రకటనలో పేర్కొంది. ఇక మంత్రిత్వశాఖ టార్గెట్ చేసిన ప్రైవేట్ రంగంలో ఆర్థిక కార్యకలాపాలు నిర్వహిస్తున్న14 కేటగిరీ ఉద్యోగాలివే..

Passport: విదేశీ పర్యటనకు పాస్‌పోర్ట్ అనేది తప్పనిసరి.. కానీ, ఈ ముగ్గురికి మాత్రం అది అవసరం లేదు.. వారెవరో తెలుసా..?

• సమాచారం మరియు కమ్యూనికేషన్లు

• ఆర్థిక మరియు బీమా కార్యకలాపాలు

• రియల్ ఎస్టేట్

• వృత్తిపరమైన మరియు సాంకేతిక కార్యకలాపాలు

• పరిపాలనా మరియు సహాయ సేవలు

• కళలు మరియు వినోదం

• మైనింగ్ మరియు క్వారీ

• రూపాంతర పరిశ్రమలు

• చదువు

• ఆరోగ్య సంరక్షణ మరియు సామాజిక పని

• నిర్మాణం

• టోకు మరియు రిటైల్

• రవాణా మరియు గిడ్డంగులు

• హాస్పిటాలిటీ మరియు రెసిడెన్సీ సేవలు

ఇదిలాఉంటే.. యూఏఈ ఇలా ఎమిరైటైజేషన్‌కు ప్రాధాన్యమిస్తూ.. ప్రవాసుల ప్రాబల్యం తగ్గించే పనిలో పడడంతో వలసదారులకు ఉపాధి అవకాశాలు తగ్గే అవకాశం ఉంది. ప్రధానంగా అమెరికా తర్వాత అత్యధిక సంఖ్యలో భారతీయ ప్రవాసులు ఉన్నది యూఏఈలోనే. కనుక మనోళ్లకు కష్టాలు మొదలైనట్టేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Kuwait: ప్రవాసులూ జర జాగ్రత్త.. అలాంటి సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ కువైత్ వార్నింగ్..!


Updated Date - 2023-07-12T11:17:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising