Dubai లో ఉన్న ప్రవాసులకు గుడ్ న్యూస్.. కేవలం 4500 రూపాయలు చెల్లిస్తే..
ABN, First Publish Date - 2023-02-07T12:51:19+05:30
ఇటీవల సౌదీ అరేబియా (Saudi Arabia) ఉచిత స్టాప్‌ఓవర్స్ (Stopovers) వీసాను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. 90 రోజుల వ్యవధితో ఉండే ఈ వీసాను ప్రపంచంలోని ఏ దేశం వారైనా ఉపయోగించుకోవచ్చు.
దుబాయ్: ఇటీవల సౌదీ అరేబియా (Saudi Arabia) ఉచిత స్టాప్‌ఓవర్స్ (Stopovers) వీసాను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. 90 రోజుల వ్యవధితో ఉండే ఈ వీసాను ప్రపంచంలోని ఏ దేశం వారైనా ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు ఇదే తరహాలో వరల్డ్‌లోనే పర్యాటకులకు అత్యంత అనుకూలమైన గమ్యస్థానంగా పేరొందిన దుబాయ్ కూడా టూరిస్టులకు ఇచ్చే వీసాల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. యూఏఈ (UAE) లో ఉండే ప్రవాసులు తమ కుటుంబ సభ్యులను విజిట్ వీసాపై (Visit Visa) లేదా టూరిస్ట్ వీసా (Tourist Visa) మీద దుబాయికి తీసుకెళ్లి చూపిస్తూ ఉంటారు కదా. అలాంటి వారికి తాజాగా దుబాయ్ తీసుకున్న ఈ నిర్ణయం మంచి కిక్ ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇంతకీ దుబాయ్ విజిటర్లకు ఇచ్చే వీసాల విషయంలో ఏం నిర్ణయించిందంటే.. కేవలం 200 దిర్హమ్స్‌తో (రూ.4,500) ప్రవాసులు ఏ రకమైనా వీసానైనా 60 రోజుల వరకు పొడిగించుకునే అవకాశం కల్పించింది. అంటే మీరు ఇంతకుముందు పొందిన వీసా వాలిడిటీతో పాటు మరో రూ. 4,500 చెల్లిస్తే అదనంగా రెండు నెలలు దుబాయ్‌లో ఉండొచ్చు అన్నమాట. ఇంతకుముందెన్నడూ లేని విధంగా దుబాయ్ ఇప్పుడు ఇంత తక్కువ ధరలో వీసా గడువును పొడిగించుకునే వీలు కల్పించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తిందనే చెప్పాలి. అయితే, దీనికి చిన్న షరతు ఉంది. ఒక్కొ వ్యక్తికి వ్యక్తిగతంగా కేవలం ఒకసారి మాత్రమే ఇలా వీసా ఎక్స్‌టెన్షన్ పొందే వెసులుబాటు ఉంది. రెండోసారి ఆ అవకాశం ఉండదు.
ఇది కూడా చదవండి: భూతల స్వర్గం అంటే ఇదేనేమో.. సౌదీలోని ఈ 'రిసార్ట్' విశేషాలు తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..!
ఈ మేరకు ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, నేషనాలిటీ, కస్టమర్స్ అండ్ పోర్ట్స్ సెక్యూరిటీ (ICP) తాజాగా ప్రకటన విడుదల చేసింది. ఇక టూరిస్టులు ఈ వెసులుబాటును పొందేందుకు దేశంలో ప్రవేశించడానికి ముందే దాని తాలూకు ప్రాసెస్‌ను ఐసీపీ వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా పూర్తి చేయాల్సి ఉంటుంది. యూఏఈ పాస్ పేరిట 200 దిర్హమ్స్ ఫీజు చెల్లించాలి. అలాగే స్మార్ట్ సర్వీసులకు మరో 100 దిర్హమ్లు(రూ.2,251), దరఖాస్తు ఫారమ్‌కు మరో 50 దిర్హమ్స్ (రూ.1,125) చెల్లించాల్సి ఉంటుంది. ఇలా మొత్తంగా 350 దిర్హమ్స్‌తో (రూ. 7,881) రెండు నెలల ఎక్స్‌ట్రా వాలిడిటీ పొందవచ్చు. ఇంతకుముందు కేవలం 30 రోజుల వీసా ఎక్స్‌టెన్షన్ కోసమే దాదాపు రెట్టింపు అంటే.. 600 దిర్హమ్స్ (రూ.13,510) చెల్లించాల్సి వచ్చేదని ఈ సందర్భంగా ఐసీపీ అధికారులు గుర్తు చేశారు.
Updated Date - 2023-02-07T12:51:22+05:30 IST