ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Assembly Elections 2023: ఓటు వేసిన వెంటనే వేలిపై ఉన్న సిరా చుక్క ఎందుకు చెరిగిపోదో తెలుసా..

ABN, First Publish Date - 2023-11-25T12:05:03+05:30

సిరా చుక్క.. భారతదేశంలో ప్రజాస్వామ్య విలువలకు చిహ్నం. మనం ఓటేశామని చెప్పడానికి సిరా చుక్క ఓ గుర్తుగా మాత్రమే కాదు.. దొంగ ఓట్లను చెక్ పెట్టే ఆయుధం. తద్వారా ఓటరు మళ్లీ మళ్లీ ఓటు వేయలేరు. ఈ ఎలక్టోరల్ ఇంక్ ఓటింగ్‌లో మోసాల నుంచి రక్షించడానికి పనిచేస్తుంది. ఎన్నికల్లో ఉపయోగించే సిరాను చెరగని సిరా అని కూడా అంటారు.

1/6

గత 62 ఏళ్లుగా ప్రతి ఎన్నికల సమయంలో ఈ ఇంక్ ఉపయోగిస్తున్నారు. ఈ సిరా ధర గురించి కూడా మనలో చాలా మందికి తెలియదు. ఒక బాటిల్ ఇంక్ ధర సుమారు రూ. 127 ఉంటుంది. ఒక సీసాలో సుమారు 10 ml సిరా ఉంటుంది. ఒక లీటర్ ఎన్నికల ఇంక్ ధర రూ.12,700.

2/6

భారతదేశంలో ఈ సిరాను మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిష్ లిమిటెడ్ అనే ఓ కంపెనీ మాత్రమే తయారు చేస్తుంది. మొదట్లో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల సమయంలో మాత్రమే ఈ ఇంక్‌ను ఉపయోగించగా.. ఆ తర్వాత మునిసిపల్ బాడీలు, సహకార సంఘాల ఎన్నికల్లోనూ ఉపయోగించడం ప్రారంభించారు.

3/6

ఈ నీలం రంగు సిరా 1962 ఎన్నికల్లో తొలిసారి ఉపయోగించారు. భారత తొలి ఎన్నికల కమిషనర్ సుకుమార్ సేన్ ఈ సిరాను ఎన్నికల్లో చేర్చాలని సూచించారు.

4/6

ఎన్నికల సిరా తయారీలో సిల్వర్ నైట్రేట్ ఉపయోగించబడుతుంది. అందువల్ల, ఒకసారి పెట్టిన తర్వాత అది సులభంగా చెరిగిపోదు.

5/6

ఈ సిరా కనీసం 72 గంటల పాటు వేలి నుంచి చెరిగిపోదు. అంతే కాకుండా నీటికి తాకినప్పుడు మరింత నల్లగా మారి ఎక్కువ కాలం ఉంటుంది.

6/6

మొదట్లో సిరాను చిన్న బాటిల్స్‌లో నింపి సరఫరా చేసేవారు, 2004 తర్వాత ఇంక్‌ మార్కర్‌లను తీసుకొచ్చారు. మనదేశంతో పాటు ప్రపంచంలోని చాలా దేశాలు ఎన్నికల వేళ ఓటేసిన అభ్యర్థికి సిరా చుక్క పెట్టడం తప్పనిసరి చేశాయి.

Updated Date - 2023-11-25T12:05:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising