Revanth Reddy: రేవంత్ రెడ్డి టీమ్ సభ్యులు వెళ్లే...
ABN, First Publish Date - 2023-12-07T14:34:37+05:30
తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. గురువారం మధ్యాహ్నం 1.4 గంటకు ఎల్బీస్టేడియంలో గవర్నర్ తమిళి సై ఆయనతో రాష్ట్ర సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, పలువురు ముఖ్య నేతలు పాల్గొన్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో గవర్నర్ తమిళి సై ప్రమాణం చేయించారు.

మధిర నియోజక వర్గం నుంచి గెలిచిన భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేశారు. ఆయన ఛీప్ విప్, డిప్యూటీ స్పీకర్, సీఎల్పీ నేతగా పని చేశారు.
హుజూర్ నగర్ నియోజక వర్గం నుంచి గెలుపొందిన ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రిగా ప్రమాణం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో ఫ్రోటోకాల్ అధికారిగా ఆయన పని చేశారు.
ఆందోల్ నియోజక వర్గం నుంచి గెలిచిన దామోదర రాజనర్శింహా మంత్రిగా ప్రమాణం చేశారు. ఆయన వైఎస్, రోశయ్య, కిరణ్ కుమార్ మంత్రి వర్గంలో పనిచేశారు.
నల్గొండ నియోజక వర్గం నుంచి విజయం సాధించిన కోమటిరెడ్డి వెంటక్ రెడ్డి మంత్రిగా ప్రమాణం చేశారు. ఆయన వైఎస్, రోశయ్య, కిరణ్ కుమార్ మంత్రి వర్గంలో పనిచేశారు.
మంథని నియోజక వర్గం నుంచి గెలిచిన శ్రీధర్ బాబు మంత్రిగా ప్రమాణం చేశారు. ఆయన వైఎస్, రోశయ్య, కిరణ్ కుమార్ మంత్రి వర్గంలో పనిచేశారు.
తొలిసారిగా ఎమ్మెల్యేగా పాలేరు నియోజక వర్గం నుంచి గెలుపొందిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మంత్రిగా ప్రమాణం చేశారు. ఆయన 2014లో తొలిసారి ఎంపీగా గెలిచారు.
హుస్నాబాద్ నుంచి గెలుపొందిన పొన్నం ప్రభాకర్ మంత్రిగా ప్రమాణం చేశారు. ఆయన 2019లో ఎంపీగా ఎన్నికయ్యారు.
వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి విజయం సాధించిన కొండా సురేఖ మంత్రిగా ప్రమాణం చేశారు. ఆమె వైఎస్ హయాంలో మంత్రిగా పనిచేశారు.
ములుగు నియోజకవర్గం నుంచి విజయం సాధించిన సీతక్క మంత్రిగా ప్రమాణం చేశారు. ఆమె జాతీయ మహిళా ప్రదాన కార్యదర్శిగా పని చేశారు.
సత్తుపల్లి నియోజకవర్గం నుంచి గెలుపొందిన తుమ్మల నాగేశ్వరరావు మంత్రిగా ప్రమాణం చేశారు. ఆయన ఎన్టీఆర్, చంద్రబాబు, కేసీఆర్ మంత్రి వర్గాల్లో పనిచేశారు.
కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన జూపల్లి కృష్ణారావు మంత్రిగా ప్రమాణం చేశారు. ఆయన వైఎస్, కిరణ్ కుమార్ మంత్రి వర్గంలో కూడా పనిచేశారు.
Updated Date - 2023-12-07T14:36:46+05:30 IST