Biotin: జుట్టుకు బలాన్ని చేకూర్చే పొడిని.. మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి..
ABN , Publish Date - Dec 22 , 2023 | 04:36 PM
ప్రస్తుత పరిస్థితుల్లో యువత ఎదుర్కొనే అనేక రకాల ఆరోగ్య సమస్యల్లో జుట్టు రాలే సమస్య ఒకటి. వాతావరాణం, రోజు వారీ తీసుకునే ఆహారం, పని ఒత్తిడి తదితర కారణాల వల్ల చాలా మంది హెయిర్ ఫాల్ సమస్యలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే..
ప్రస్తుత పరిస్థితుల్లో యువత ఎదుర్కొనే అనేక రకాల ఆరోగ్య సమస్యల్లో జుట్టు రాలే సమస్య ఒకటి. వాతావరాణం, రోజు వారీ తీసుకునే ఆహారం, పని ఒత్తిడి తదితర కారణాల వల్ల చాలా మంది హెయిర్ ఫాల్ సమస్యలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ సమస్య పరిష్కారం చూపే బయోటిన్ పొడిని మీ ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. అదెలాగో తెలుసుకుందాం..
బాదం, వేరుశెనగ, పొద్దుతిరుగుడు గింజలు, వాల్‌నట్స్ గింజల పొడిని 1/2 కప్పు తీసుకోవాలి. అలాగే వోట్స్ లేదా బార్లీ గింజలు, చనా, చియా గింజలు, అవిసె, ఎండిన చేప ఎముకల పొడిని అరకప్పు తీసుకోవాల్సి ఉంటుంది. సన్నటి మంట మీద పాన్‌పై పైన చెప్పిన నట్స్ ని ఒక్కొక్కటిగా వేస్తూ దోరగా వేయించుకోవాలి. తర్వాత ఇవన్నీ పూర్తిగా చల్లారనివ్వాలి. చివరగా వీటిని మెత్తగా అయ్యేలా మిక్సీ పట్టుకోవాలి. వీటన్నింటిని పొడిని మిక్స్ చేసి ఫ్రిజ్‌లో నిల్వ చేసుకోవాలి.
పైన తెలిపిన పదార్థాలలో బయోటిన్ పుష్కలంగా ఉండడంతో జుట్టును సంరక్షిస్తుంది. బయోటిన్ పౌడర్‌ని వాడేందుకు ముందుగా ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఓ చెంచా పౌడర్‌ను కలపాలి. రోజూ ఉదయం ఈ నీటిని తాగడం వల్ల శరీరానికి అవసరమైన బయోటిన్ ఈజీగా లభిస్తుంది. తద్వారా జుట్టు రాలడం తగ్గిపోయి.. బలంగా మారేందుకు అవకాశం ఉంటుంది.
పాలు, గింజలు, కాయగూరలు, సోయా చిక్కుడు, చేపలు, మాంసం తదితరాల్లో బయోటిన్ పుష్కలంగా ఉంటుంది. బయోటిన్ పౌడర్‌ను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జుట్టుతో పాటూ చర్మానికీ ఎంతో మేలు చేస్తుంది. బయోటిన్ లోపం ఉన్న వారికి చర్మం ఎర్రబడడం, దుద్దుర్లు మొదలవుతాయి. ఈ పౌడర్ తీసుకోవడం వల్ల ఆ సమస్యలు తగ్గడంతో పాటూ చర్మం కాంతివంతంగా మారుతుంది.
Updated Date - Dec 22 , 2023 | 04:36 PM