ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

BRS Vs Congress : నిజంగానే కాంగ్రెస్‌కు 50 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులు లేరా.. హరీష్ ఏ లెక్కన చెప్పారు.. అన్నీ సరే గానీ..!

ABN, First Publish Date - 2023-05-27T21:46:57+05:30

అవును.. తెలంగాణలో (Telangana) కాంగ్రెస్ (TS Congress), బీజేపీల (TS BJP) పనైపోయింది.. ఈ రెండు పార్టీల నేతలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు.. వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తామని కాంగ్రెస్‌ నేతలు కలలు కంటున్నారు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అవును.. తెలంగాణలో (Telangana) కాంగ్రెస్ (TS Congress), బీజేపీల (TS BJP) పనైపోయింది.. ఈ రెండు పార్టీల నేతలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు.. వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తామని కాంగ్రెస్‌ నేతలు కలలు కంటున్నారు.. అసలు ఆ పార్టీకి 40 నుంచి 50 స్థానాల్లో అభ్యర్థులే లేరు.. ఇవీ నల్లొండ జిల్లా వేదికగా జరిగిన బీఆర్ఎస్ (BRS) ఆత్మీయ సభలో తెలంగాణ ట్రబుల్ షూటర్, మంత్రి హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలు. అసలు హరీష్ ధీమా ఏంటి..? ఏ ఉద్దేశ్యంతో ఈయన ఆ మాటలు అన్నారు..? నిజంగానే కాంగ్రెస్‌కు అభ్యర్థులు లేరా..? హరీష్ ఇంత లెక్కలేసి మరీ 40 నుంచి 50 అని ఎందుకు అన్నారు..? అనే ఆసక్తికర విషయాలు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనంలో చూద్దాం..

హరీష్ మాటల్లో నిజమెంత..!?

రానున్న ఎన్నికల్లో ఎలాగైనా సరే గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని బీఆర్ఎస్ భావిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కేసీఆర్‌ను మళ్లీ సీఎంను కానివ్వమని ప్రతిపక్షాలైన బీజేపీ, కాంగ్రెస్ శపథాలు చేస్తున్నాయి. అదిగో అధికారంలోకి వచ్చేస్తున్నాం.. ఇదిగో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాం.. అని కౌంట్‌డౌన్ బోర్డులేసి మరీ హడావుడి చేసిన బీజేపీ ఇప్పుడెందుకో చతికిలపడింది. కర్ణాటక ఫలితాల తర్వాత తెలంగాణలో ఎందుకో బాగా ఢీలా పడిపోయినట్లుగా తెలుస్తోంది. ఈ మధ్యే దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జాతీయ నేత ఒకరు.. తెలంగాణలో రెండో స్థానం కాంగ్రెస్‌దేనని.. ఇప్పట్లో చేరికలు కూడా ఉండవని అవసరమైతే బీజేపీ-బీఆర్ఎస్ కలుస్తాయన్నట్లుగా కూడా చెప్పేశారు. మరోవైపు.. ఇప్పుడు అధికారంలో ఉన్న రాష్ట్రాలను కాపాడుకుంటూ.. జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌ ఆటలకు బ్రేక్ వేయాలన్నది కమలనాథుల టార్గెట్. ఇందుకుగాను అవసరమైతే బీఆర్ఎస్‌తో కలిసి తెలంగాణలో అడుగులేయడానికి కూడా వెనుకాడట్లేదు. ఇంత రచ్చ జరుగుతున్న సమయంలో తెలంగాణ ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్ రావు.. కాంగ్రెస్ గురించి సంచలన వ్యాఖ్యలు చేయడంతో ఇప్పుడిదే ఎక్కడ చూసినా చర్చ నడుస్తోంది. 40 నుంచి 50 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి అసలు అభ్యర్థులే లేరని వ్యాఖ్యానించారు. ఈయన మాటల వెనకున్న ఆంతర్యమేంటో అర్థం కాని పరిస్థితి. ఇందులో నిజానిజాలెంత అని ప్రస్తుతం అటు బీఆర్ఎస్‌లో.. అటు కాంగ్రెస్‌, బీజేపీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే అసలు ఈయన ఏ లెక్కన ఈ మాటలు అన్నారు..? ఏదో నోటికొచ్చిందని చెప్పేశారా..? లేకుంటే ప్రత్యేకించి సర్వేలు గట్రా ఏమైనా బీఆర్ఎస్ చేయించి ఇలా వ్యూహాత్మకంగా లీకులు చేస్తోందా..? అనేది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చ నడుస్తోంది.

హరీష్ లెక్క ఇదేనా..!?

వాస్తవానికి రెండోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక సుమారు 12 మందికి పైగానే ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు టాటా చెప్పేసి కారు పార్టీలో చేరిపోయారు. మరికొందరు ముఖ్యనేతలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అటు కొందరు.. ఇటు కొందరు పోవడంతో చాలా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పరిస్థితి సర్లేదని కనీసం నాయకుడే లేరన్నది బహుశా హరీష్ మనసులో మాటేమో. బీఆర్ఎస్‌లో చేరిన వారిలో సబితా ఇంద్రారెడ్డి ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా ఉండగా.. ఈమె ప్రాతినిథ్యం వహిస్తున్న మహేశ్వరం నియోజకవర్గంలో ప్రస్తుతానికి చెప్పుకోదగ్గ, ఎమ్మెల్యేగా పోటీచేసేంతటి వ్యక్తి లేరని చెప్పాలి. ఇలా ఒక్కటే కాదు.. తాండూరు నుంచి కాంగ్రెస్ తరఫున గెలిచిన ఫైలట్ రోహిత్ రెడ్డి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోగా ఇక్కడ కూడా అదే పరిస్థితి. ఇక హైదరాబాద్‌‌లోని కీలక స్థానమైన ఎల్బీ నగర్ నుంచి సుధీర్ రెడ్డి కాంగ్రెస్ తరఫున గెలిచి కారెక్కేశారు. ఈయనకు కేసీఆర్, కేటీఆర్ ఇద్దరూ మంచి ప్రాధాన్యతే ఇస్తున్నారు. దీంతో నియోజకవర్గాన్ని బాగానే అభివృద్ధి చేయిస్తున్నారని ప్రజలు చెప్పుకుంటూ ఉంటారు. ఇలా చెప్పుకుంటూ ప్రతి జిల్లాలో మూడు, నాలుగు నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ పరిస్థితి ఇలాగే ఉంది. ఇవన్నీ బేరీజు చేసుకుని హరీష్ చెప్పి ఉంటాడని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

పక్కపార్టీ సంగతి దేవుడెరుగు..!?

హరీష్ చెప్పినట్లుగా నిజంగానే కాంగ్రెస్‌కు ఈ పరిస్థితులు ఉన్నాయా అంటే.. అస్సలు లేనేలేవని, బీఆర్ఎస్-బీజేపీ ఇప్పటికీ ఎప్పటికీ ఒక్కటేనని ఆ పార్టీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. చెప్పడం ఎందుకు రానున్న ఎన్నికల్లో తమ సత్తా ఏంటో చూపిస్తామని కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు. మునుపటితో పోలిస్తే కాంగ్రెస్‌లో గ్రూపు తగాదాలు, వర్గ విబేధాలు చాలా వరకూ తగ్గాయనే చెప్పుకోవాలి. ఒకప్పుడు ఏదైతే కాంగ్రెస్‌కు మైనస్‌గా ఉందో.. ఇప్పుడు అదే ప్లస్ అయ్యిందని మాత్రం చెప్పవచ్చు. కాంగ్రెస్ గురించి హరీష్ మాట్లాడుతున్నారు సరే.. అటు బీజేపీ, కాంగ్రెస్ నుంచి వచ్చిన సిట్టింగ్‌ల సంగతేంటి..? ఆ నియోజకవర్గాల్లో ఇదివరకున్న, పోటీచేసిన బీఆర్ఎస్ నేతల సంగతేంటి..? అనేది ఆయనకే తెలియాలి. ఎన్నికలకు ముందే పక్క పార్టీ నుంచి వచ్చిన నేతలు.. బీఆర్ఎస్ నేతలు బహిరంగ సభల్లోనే ఓ రేంజ్‌లో తిట్టుకోవడం చూస్తున్నాం. టికెట్ తనకంటే తనకే అని వారికి వారే ప్రకటనలు కూడా చేసేసుకుంటున్నారు. ముందు వాళ్ల సంగతి హరీష్ చూసుకుంటే మంచిదని కాంగ్రెస్ నేతలు సూచిస్తున్నారు. హరీష్ చెబుతున్న మాటల్లో నిజమెంత.. కాంగ్రెస్ కౌంటర్లలో నిజమెంత అనేది తెలియాలంటే రానున్న ఎన్నికల వరకూ వేచి చూడాల్సిందే మరి.

******************************

ఇవి కూడా చదవండి..

******************************

Delhi Liquor Scam Case : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవిత సేఫ్.. ఎక్కడా కనిపించని పేరు.. క్లీన్ చిట్ వచ్చేసినట్లేనా..!?

******************************

Modi Vs Kcr : కర్ణాటక ఫలితాలు, గవర్నర్ వ్యవస్థను ప్రస్తావించి మరీ కేంద్రంపై కేసీఆర్ ఫైర్..

******************************

BJP and BRS : కారు-కమలం నిజంగానే కలిసిపోతాయా.. ఇన్ని అస్త్రాలున్నా కేసీఆర్ నోరు మెదపకపోవడం వెనుక ఇంత కథుందా.. సడన్‌గా ఎందుకో ఇలా..!?

******************************

Jagan In YS Viveka Case : పెను సంచలనం.. వివేకా హత్యకేసులో సీఎం వైఎస్ జగన్ పేరు..

******************************

TS Politics : తెలంగాణ బీజేపీకి ఊహించని ఝలక్.. కాంగ్రెస్ కండువా కప్పుకున్న కీలక నేత.. స్క్రిప్ట్ మారుతోందే..!

******************************

Updated Date - 2023-05-27T21:50:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising