ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TS Congress : కాంగ్రెస్‌లోకి భారీగా చేరికలు జరుగుతున్న వేళ సీన్ రివర్స్.. ఎందుకిలా..?

ABN, First Publish Date - 2023-06-12T21:09:12+05:30

తెలంగాణలో కాంగ్రెస్‌ (Telangana Congress) మంచి జోష్ మీద ఉంది. కర్ణాటక ఫలితాల (Karnataka Results) తర్వాత ఒక్కసారిగా తెలంగాణలో సీన్ మారిపోయింది. మునుపెన్నడూ లేని విధంగా గాంధీ భవన్ (Gandhi Bhavan) చేరికలతో కలకలలాడుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తెలంగాణలో కాంగ్రెస్‌ (Telangana Congress) మంచి జోష్ మీద ఉంది. కర్ణాటక ఫలితాల (Karnataka Results) తర్వాత ఒక్కసారిగా తెలంగాణలో సీన్ మారిపోయింది. మునుపెన్నడూ లేని విధంగా గాంధీ భవన్ (Gandhi Bhavan) చేరికలతో కలకలలాడుతోంది. ఇప్పటికే అధికార బీఆర్ఎస్ (BRS) , బీజేపీ (BJP) నుంచి పెద్ద ఎత్తున నేతలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోగా.. మరో ఇద్దరు బిగ్ షాట్‌లు పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Sreenivasa Reddy) , జూపల్లి కృష్ణారావుల (Jupally Krishna Rao) చేరిక కూడా క్లైమాక్స్‌కు చేరుకుంది. అధిష్టానం ఇతర పార్టీల నేతలను చేర్చుకునే పనిలో బిజిబిజీగా ఉండగా.. బీజేపీ మాత్రం వ్యూహం మార్చింది.. దీంతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి.

కాషాయ కండువా కప్పుకుంటారా..?

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ రంగారెడ్డి (EX MLC Ranga Reddy) పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. సోమవారం నాడు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణతో (DK Aruna) రంగారెడ్డి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. తనకు సరైన ప్రాధాన్యత ఇవ్వట్లేదని గత కొన్నిరోజులుగా ఈయన కాంగ్రెస్‌లో అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. ఎన్నికలు సమీపిస్తుండటంతో తన సేవలు వినియోగించుకుని.. ప్రాధాన్యత ఇచ్చే పార్టీలో చేరాలని ఆయన భావించారట. అందుకే ఇవాళ డీకే అరుణతో భేటీ అయినట్లు తెలుస్తోంది. రంగారెడ్డి అలా భేటీ అయ్యారో లేదో.. కాషాయ కండువా కప్పుకుంటారని పెద్ద ఎత్తున వార్తలు గుప్పుమన్నాయి. ఈయనతో పాటు మరికొంతమంది బీజేపీలో చేరే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. రంగారెడ్డి.. వైఎస్ షర్మిలతో (YS Sharmila) కూడా గతంలో భేటీ అయ్యారు. వైఎస్సార్టీపీ (YSRTP) పార్టీని స్వాగతించారు కూడా.. అప్పట్లో ఈయన షర్మిల పార్టీలో చేరతారని కూడా వార్తలొచ్చాయి. ఇప్పుడు సడన్‌గా డీకే అరుణతో భేటీ కావడంతో మరోసారి పార్టీ మారుతారని వార్తలు వస్తున్నాయి.

కిరణ్ రెడ్డి షురూ చేశారా..?

మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత కిరణ్ కుమార్ రెడ్డికి (Kiran Kumar Reddy) సన్నిహుతుడుగా రంగారెడ్డికి పేరుంది. కిరణ్ రెడ్డి పార్టీలో చేరిన తర్వాత.. తెలుగు రాష్ట్రాల్లోని ఆయన సన్నిహితులు, ఆప్తులు, సీనియర్లను కచ్చితంగా పార్టీలోకి పట్టుకొస్తారని కమలనాథులు ఎంతో నమ్మారు..! ఈ చేరికల బాధ్యతను కిరణ్‌రెడ్డికే బీజేపీ అప్పగించిందట. ఇందులో భాగంగానే తెలంగాణలో రంగారెడ్డితో కిరణ్ రెడ్డి చేరికలు ప్రారంభించినట్లుగా కూడా తెలుస్తోంది. త్వరలోనే ఏపీలో కూడా కాంగ్రెస్‌, వైసీపీలోని సీనియర్ నేతలతో కిరణ్ భేటీ కాబోతున్నారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. కిరణ్ రెడ్డికి పార్టీలో ఏదైనా పదవి ఇస్తే మరింత ఉత్సాహంగా పనిచేస్తారని బీజేపీ భావిస్తోందట. ఇదేగానీ జరిగితే కిరణ్ రెడ్డి ద్వారా ఎంతమంది కాషాయ కండువా కప్పుకుంటారో చూడాలి.!

ఓహో.. బీజేపీ ప్లాన్ ఇదా..?

కీలక నేతలు, బిగ్ షాట్‌ల చేరికలతో తెలంగాణ కాంగ్రెస్‌ ఇప్పుడు మంచి జోష్ మీద ఉంది. మరీ ముఖ్యంగా నిన్న, మొన్నటి వరకూ బీజేపీ తీర్థం పుచ్చుకుంటారనుకున్న పొంగులేటి, జూపల్లితో పాటు పలువురు నేతలు.. ఇప్పుడు కాంగ్రెస్ కండువాలు కప్పుకోవడానికి సిద్ధమైపోయారు. దీంతో కాంగ్రెస్‌లో అసంతృప్తిగా ఉన్న సీనియర్లు, కీలక నేతలపై బీజేపీ ఫోకస్‌పెట్టినట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగానే మాజీ ఎమ్మెల్సీ రంగారెడ్డి గురించి తెలుసుకున్న కిరణ్ రెడ్డి, డీకే అరుణ.. ఇవాళ పిలిపించుకుని మాట్లాడినట్లుగా తెలుస్తోంది. అంటే.. కాంగ్రెస్ వేరే పార్టీల నేతలను చేర్చుకునే పనిలో బిజీగా ఉంటే.. బీజేపీ మాత్రం కాంగ్రెస్‌లో అసంతృప్తులపై స్పెషల్ ఫోకస్ పెట్టిందని తాజా పరిణామాలను బట్టి చూస్తే అర్థం చేసుకోవచ్చు. జంపింగ్ నేతలను కాంగ్రెస్ నిలువరిస్తుందో.. బీజేపీ ఏ మేరకు నేతలను లాక్కోగలుగుతుందో తెలియాలంటే ఒకట్రెండు రోజులు వేచి చూడాల్సిందే.

******************************

ఇవి కూడా చదవండి..

******************************

Mudragada : రీ-ఎంట్రీకి సిద్ధమైన ముద్రగడ.. ఎంపీగా బరిలోకి దింపే యోచనలో వైసీపీ.. ఇంత నమ్మకద్రోహం చేసినా ఎందుకీ సాహసం..!?

******************************
TS Politics : రేవంత్ రెడ్డి సక్సెస్.. బీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. కేసీఆర్‌ అత్యంత సన్నిహితుడు రాజీనామా..

******************************

Updated Date - 2023-06-12T21:26:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising