YS Jagan Reddy : ప్చ్.. వైసీపీలో అంతా అయోమయం.. సడన్‌గా ఇంత మౌనమెందుకో.. భయం మొదలైందా..!?
ABN, First Publish Date - 2023-04-21T18:05:12+05:30
వైసీపీలో (YSR Congress) గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయా..? నేతలంతా (YSRCP Leaders) అయోమయంలో ఉన్నారా..?
వైసీపీలో (YSR Congress) గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయా..? నేతలంతా (YSRCP Leaders) అయోమయంలో ఉన్నారా..? ఇటీవల ఏపీలో (Andhra Pradesh) చోటుచేసుకున్న కొన్ని పరిణామాలు వైసీపీకి రుచిచండం లేదా..? ఈ పరిణామాలే వైసీపీ పెద్దలకు నిద్ర కరువు చేస్తున్నాయా..? ఈ వరుస ఘటనలతో ఒక్కసారిగా వైసీపీ నేతల నోటికి తాళం పడిందా..? అందుకే నేతలు ఇంతలా సైలెంట్ అయ్యారా..? అంటే తాజా పరిస్థితులను బట్టి చూస్తే ఇవన్నీ అక్షరాలా నిజమేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. నిన్న, మొన్నటి వరకూ ఎగిరి గంతులేసిన వైసీపీలో సడన్‌గా ఎందుకింత సైలెంట్..? ఇవన్నీ కాదు ఎన్నికలకు ముందే వైసీపీ పెద్దలకు భయం పట్టుకుందా..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
అసలేం జరుగుతోంది..!?
- తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) 2019 ఎన్నికల ముందు జరిగిన కోడికత్తి కేసు (Kodai Kathi Case) గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ ఘటనకు పాల్పడిందెవరనేది తెలిసింది కానీ.. ఎందుకు..? ఏమిటి..? ఎలా అని మాత్రం పూర్తిగా నిర్ధారణ కాని పరిస్థితి. ఏళ్లు గడుస్తున్నా ఈ వ్యవహారం ఇంకా కొలిక్కి రాలేదు.. ఎప్పుడు ఫుల్‌స్టాప్ పడుతుందో కూడా తెలియని పరిస్థితి. మొత్తం మీరే చేశారని టీడీపీని (Telugudesam) వైసీపీ అంటుంటే.. చేసిందంతా మీరు పేరు మాకా..? అని వైసీపీని టీడీపీ నిలదీస్తోంది. ఈ కేసులో నిందితుడు శ్రీనివాస్ మాత్రం తాను వైఎస్ జగన్ అభిమానంతో.. సీఎం కావాలనే చేశానని చెబుతుండగా.. వైసీపీ మాత్రం ఇదంతా టీడీపీ కుట్రలో భాగమేనని మాత్రం వితండవాదం చేస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ఈ కేసు ఎన్ఐఏ (NIA) చేతిలో ఉండగా.. కోర్టుకు రమ్మన్నా కూడా వైఎస్ జగన్ (CM YS Jagan) రావడం లేదు. దీంతో తప్పు చేయనప్పుడు వెళితే తప్పేంటి..? అని ప్రతిపక్షాలు నిలదీస్తున్నాయి. ప్రస్తుతం ఈ కేసును వీలైనంత త్వరగానే తేల్చేయాలని NIA భావిస్తోంది. అయితే ఇది ఎవరు చేయించారు..? ఎందుకు చేయించారనే విషయం పైనున్న పెరుమాళ్లకే తెలియాలి కానీ.. వైసీపీకి మాత్రం ఇదో పెద్ద నెగిటివ్‌గా మారిందని విశ్లేషకులు చెబుతున్నారు. రానున్న ఎన్నికల్లో కూడా ఇది జగన్‌కు మైనస్ కానుందనే సొంత పార్టీలు నేతలు సైతం చెవులు కొరుక్కుంటున్న పరిస్థితి వైసీపీలో నెలకొందట.
- ఇక వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు వ్యవహారంలోనూ వైసీపీ ఉక్కిరి బిక్కిరి అవుతోందన్న విషయం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. వివేకా హత్యకేసులో పార్టీకి గానీ.. సోదరుడు అవినాష్‌కు.. ఇందులో ఇంటి వారికి ఎలాంటి సంబంధమేలేదని ఇన్ని రోజులు వైఎస్ జగన్ చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఇప్పుడు భాస్కర్ రెడ్డి అరెస్టు తర్వాత ఒక్కసారిగా సీన్ మారిపోయింది. ఇప్పుడు మూడ్రోజులుగా ఎంపీ అవినాష్ రెడ్డిపై సీబీఐ ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. అయితే సోమవారం తర్వాత అరెస్ట్ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. గత ఎన్నికల సమయంలో జరిగిన ఈ ఘటన ఇంతవరకూ ఎటూ తేలకపోవడం గమనార్హం. అయితే.. ఈ విషయంపై మీడియా ముందుకు వచ్చినా.. బహిరంగ సభల్లో మాట్లాడాల్సి వచ్చినా ఏం చెప్పాలో.. ఎలా మేనేజ్ చేయాలో వైసీపీ నేతలతో పాటు ఆఖరికి వైఎస్ జగన్ దగ్గర కూడా సమాధానం లేదట. ఇన్ని రోజులు చిత్రవిచిత్రాలుగా ప్రతిపక్షాలు.. వివేకా హత్య కేసు అంటే చాలు.. విరుచుకుపడి మాట్లాడిన మంత్రులు, వైసీపీ నేతలు.. ఇప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా దిక్కుతోచట్లేదట. కొందరు వైసీపీ నేతలు అయితే.. ఈ కేసు వ్యవహారంలో పచ్చి బూతులు మాట్లాడిన రోజులున్నాయ్. అయితే తాజాగా నెలకొన్న కొన్ని పరిణామాలతో వైసీపీ నేతలు, మంత్రులు స్వరం మార్చేశారు. ఎంతలా అంటే తీవ్ర పదజాలం నుంచి కనీసం మీడియా ముందుకొచ్చి పరిస్థితే వైసీపీలో లేదట.
- వివేకా హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డి పాత్ర కీలకమైందని.. ఆయన్ను పలుమార్లు విచారించిన సీబీఐ అధికారులు అరెస్ట్ చేసి చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఎప్పుడైతే అరెస్ట్ జరిగిందో అప్పట్నుంచే వైసీపీలో కలవరం మొదలైందట. హుటాహుటిన అత్యవసర సమావేశాలు ఏర్పాటు చేయడం.. ఎలా ముందుకెళ్లాలని సాధ్యాసాధ్యాలను పరిశీలించడం ఇవన్నీ చక చకా జరిగిపోయాయి. అసలు ఈ కేసు నుంచి భాస్కర్ రెడ్డి, అవినాష్‌ను బయటపడేయడానికి ఢిల్లీ వేదికగా స్వయంగా వైఎస్ జగన్ రంగంలోకి దిగి చక్రం తిప్పినా అస్సలు పనవ్వలేదట. అంతేకాదు.. ఢిల్లీలోని పెద్దలు అపాయింట్మెంట్ ఇవ్వడానికి కూడా సాహసించలేదట. కర్ణాటక ఎన్నికల పనుల్లో బిజీగా ఉన్నామని చేతులు దులుపుకుంటున్నారట. ఆ మధ్య అసలు వైసీపీ-బీజేపీకి మధ్య ఎలాంటి సంబంధమే లేదని చెప్పడానికి భాస్కర్ రెడ్డి అరెస్టే నిదర్శనమని కొందరు ఏపీకి చెందిన కమలనాథలు చెప్పుకున్న పరిస్థితి. అందుకే ఇలా చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసిన తర్వాతే.. లాబియిస్ట్ విజయ్ కుమార్‌ను రంగంలోకి దింపినట్లు తెలిసింది. ఈయన కూడా తన పరిచయాలతో గట్టి ప్రయత్నాలే చేసినా ఇది కూడా వర్కవుట్ అవ్వలేదట.
- దీంతో పాటు ఈ మధ్య జరిగిన కొన్ని పరిణామాలు ఇలా అన్నీ వైసీపీకి పెద్ద మైనస్‌లుగా మారాయే కానీ.. ఏ మాత్రం కలిసి రాలేదని విశ్లేషకుల నుంచి వినిపిస్తున్న మాట. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే 2024 ఎన్నికల్లో గెలిచే పరిస్థితులు కూడా లేవని ఇప్పటికే కొన్ని నివేదికలు వచ్చాయని టాక్ నడుస్తోంది. ఈ వరుస పరిణామాలు ఇలా జరగడం.. ఇలా నివేదికలు పూర్తి వ్యతిరేకంగా రావడంతో వైసీపీలో భయం మొదలైందట. అందుకే వారం రోజులుగా వైసీపీ నుంచి పెద్దగా ఎవరూ మీడియా ముందుకు రావట్లేదట. అందరూ సైలెంట్ అయ్యారట. సోషల్ మీడియాలోనూ వైసీపీ కార్యకర్తలు, అభిమానులు దీనిపైనే చర్చించుకుంటున్నారట. ఇప్పటికే పరిస్థితులు ఇలా ఉంటే ఎన్నికల సీజన్ మొదలైతే ఎలా ఉంటుందో.. ఇప్పుడున్న పరిణామాలకు తోడు వైసీపీకి ఇంకా ఏమేం ఎదురుదెబ్బలు తగులుతాయో.. ఫైనల్‌గా ఫలితాలు టీడీపీకి అనుకూలంగా వస్తాయో.. వైసీపీకి అనుకూలంగా వస్తాయో వేచి చూడాల్సిందే మరి.
******************************
ఇవి కూడా చదవండి..
******************************
BRS No Bidding : వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌కు కేసీఆర్ సర్కార్ బిడ్ వేయకపోవడం వెనుక పెద్ద కథే ఉందిగా.. గులాబీ బాస్ కంగుతిన్నారా..!?
******************************
YSRCP : తాడేపల్లి ప్యాలెస్‌లో సీఎం వైఎస్ జగన్ మూడాఫ్ అయ్యారా.. ఈ దెబ్బతో..!
******************************
Viveka Murder Case : ఎంపీ అవినాష్ ముందస్తు బెయిల్‌పై ముగిసిన వాదనలు.. తగ్గేదేలే అని తేల్చి చెప్పేసిన సీబీఐ.. హైకోర్టు కీలక ఆదేశాలు
******************************
AP Ministers Vs Harish Rao : తగ్గేదేలే అంటున్న హరీష్ రావు.. ఏపీ మంత్రులపై మరోసారి సీరియస్ కామెంట్స్..
******************************
Updated Date - 2023-04-21T18:10:09+05:30 IST