BRS : ఐదుసార్లు సర్వే చేయించినా ఆ మంత్రిపై నెగిటివ్‌గానే ఫలితం.. టికెట్ లేనట్టే..!?
ABN, First Publish Date - 2023-08-12T19:42:06+05:30
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదుసార్లు సర్వే చేయించినా ఆ మంత్రి (Minister) నియోజకవర్గంలో నెగిటివ్ అనే మాట తప్పితే.. ఇసుమంతైనా పాజిటివ్‌గా రాలేదట.! పోనీ సర్వే సంస్థల్లో అలా తేలింది కదా..? అని ఇంటెలిజెన్స్ ద్వారా సర్వే (Intelligence Survey) చేయించినా సేమ్ సీనట..
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదుసార్లు సర్వే చేయించినా ఆ మంత్రి (Minister) నియోజకవర్గంలో నెగిటివ్ అనే మాట తప్పితే.. ఇసుమంతైనా పాజిటివ్‌గా రాలేదట.! పోనీ సర్వే సంస్థల్లో అలా తేలింది కదా..? అని ఇంటెలిజెన్స్ ద్వారా సర్వే (Intelligence Survey) చేయించినా సేమ్ సీనట. ఆయనేమీ సాదా సీదా లీడర్ కాదు.. సీనియర్ నేత.. అంతకుమించి మంత్రిగా కూడా పనిచేస్తు్న్నారు. మంత్రికే టికెట్ ఇవ్వకుండా పక్కనెడితే పరిస్థితేంటి..? ప్రతిపక్షాలు ఏమంటాయ్..? రాష్ట్ర ప్రజానీకానికి ఏమని సందేశం ఇచ్చినట్లు ఉంటుంది..? ఇస్తే ఓటమే.. ఇవ్వకపోతే పరిస్థితి మరోలా ఉంటుంది..? దీంతో ఏం చేయాలో దిక్కుతోచక గులాబీ బాస్ తర్జనభర్జన పడుతున్నారట. ఇంతకీ ఆ మంత్రి ఎవరు..? గులాబీ బాస్‌కు ఎందుకింత తలనొప్పిగా మారారు..? టికెట్ ఇవ్వకుండా కేసీఆర్ (CM KCR) ఏం చేయాలని యోచనలో ఉన్నారు..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలపై ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ (ABN-Andhrajyothy) ప్రత్యేక కథనం..
ఇదీ అసలు కథ..!
తెలంగాణలో ఎన్నికలు (TS Elections) సమీపిస్తున్న కొద్దీ అధికార, ప్రతిపక్ష పార్టీలు జోరు పెంచాయి. ప్రతిపక్ష పార్టీలకు ఊహకందని రీతిలో అభ్యర్థుల ఎంపిక, జాబితాను విడుదల చేయలన్నది కేసీఆర్ వ్యూహమట. అయితే.. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్‌ను గద్దె దించాల్సిందేనని కాంగ్రెస్ పార్టీ (Congress) ప్రతివ్యూహాలు రచిస్తోంది. ఏ చిన్నపాటి అవకాశం వచ్చినా సరే బీఆర్ఎస్‌ను (BRS) బంతాట ఆడుకుంటోంది కాంగ్రెస్. ఇక బీజేపీ మాత్రం మునుపటితో పోలిస్తే చాలా వరకు జోష్ తగ్గిందనడంలో ఎలాంటి సందేహాలు అక్కర్లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఎక్కడ్నుంచి ఎవర్ని బరిలోకి దింపాలి..? ఎవర్ని మార్చాలి..? ఎవర్ని అసెంబ్లీకి పంపాలి.. పార్లమెంట్‌కు పంపాలి? అని సర్వేలు చేయించేశారట గులాబీ బాస్. అంతే ఓకే ఇక అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేయడమే తరువాయి అనుకున్న ప్రతిసారీ.. ఒకరిద్దరి విషయంలో మాత్రం కేసీఆర్‌కు తలనొప్పి తప్పట్లేదట. అందులో ఒకరు మంత్రట. కేసీఆర్, కేటీఆర్ (KCR And KTR) ఇద్దరికీ అత్యంత సన్నిహితుడేనట. దీంతో ఆయన్ను పక్కకు తప్పించాలంటే బాస్‌కు మనసు ఒప్పట్లేదట. ఆయన మరెవరో కాదట.. ఉమ్మడి పాలమూరి జిల్లాకు (Palamuru District) చెందిన కీలక మంత్రట.
ఎందుకింత నెగిటివ్..!
వాస్తవానికి ఆ మంత్రి నియోజకవర్గంలో కంటే హైదరాబాద్‌లోనే (Hyderabad) ఎక్కువగా ఉంటున్నారంట. పేరుకే మంత్రిగానీ.. నియోజకవర్గానికి చేసిందేమీ లేదట. పొరపాటున నియోజకవర్గానికి వస్తే జనాల సమస్యలు చెప్పినా వినిపించుకునే పరిస్థితుల్లో లేరట. ఆయన మంత్రి పదవితో అనుచరులు తప్పితే.. నియోజకవర్గ ప్రజలకు మేలు జరిగింది శూన్యమేనట. దీంతో సర్వే సంస్థలు ఏ ఒక్కర్ని పలకరించినా అబ్బే ఆయనకు టికెట్ ఇస్తే కచ్చితంగా ఓడిస్తామని తేల్చి చెప్పేస్తున్నారట. ఇంకొందరేమో ‘మహాప్రభో ఆయనకు టికెట్ ఇవ్వకండి’ అని మొత్తుకుంటున్నారట. దీంతో ఆ మంత్రిని ఇబ్బంది పెట్టకుండా వీలైతే ఎమ్మెల్సీ లేదా పార్లమెంట్ నుంచి పోటీ చేయించాలనే యోచనలో గులాబీ బాస్ ఉన్నారట. అయితే.. ఎన్నికలకు ఇంకా సమయం ఉంది కదా మార్పులు, చేర్పులు.. లోటు పాట్లున్నా సరిచేసుకుంటానని.. ఇక్కడ్నుంచే సీటు ఇవ్వాలని ఆ మంత్రి కేసీఆర్‌ను కోరుతున్నారట. ఈ ఒక్క మంత్రి వల్లే తొలి జాబితా ఆలస్యమైందట. అయితే.. ప్రస్తుతానికి ఆ మంత్రి నియోజకవర్గాన్ని అలాగే పెండింగ్‌లో పెట్టేసి అభ్యర్థుల జాబితాను ప్రకటించాలనే యోచనలో కేసీఆర్ ఉన్నారట. మరోవైపు.. ఆ మంత్రికి కాంగ్రెస్, బీజేపీ పార్టీలు మాత్రం రెడ్ కార్పెట్ వేసి మరీ ఆహ్వానిస్తున్నాయట. సార్ ఏదో ఒకటి తేల్చేస్తే కాంగ్రెస్‌లోకి వెళ్లి అదే నియోజకవర్గం నుంచే పోటీచేయాలనే యోచనలో మంత్రి ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మరి ఫైనల్‌గా ఏం జరుగుతుందో చూడాలి.
ఇవి కూడా చదవండి
AP Politics : ఏపీ ఎన్నికల ముందు వైఎస్ జగన్‌కు ఇంత భయమెందుకో..!?
AP Politics : టీడీపీలోకి యార్లగడ్డ వెంకట్రావు.. ముహూర్తం ఫిక్స్..!
YS Sharmila : కాంగ్రెస్‌లో వైఎస్సార్టీపీ విలీనమే.. ఈ ఒక్క పరిణామంతో క్లియర్ కట్‌గా తెలిసిపోయిందిగా..!?
AP Politics : వామ్మో.. జగన్ సర్కార్ మరీ ఇంత దిగజారిందేంటి.. ఈ విషయం గానీ మీకు తెలిస్తే..!?
AP Politics : వైసీపీకి బాలినేని శ్రీనివాస్ నిజంగానే గుడ్ బై చెబుతున్నారా..!?
YSRTP : ఢిల్లీకెళ్లిన వైఎస్ షర్మిల హైదరాబాద్‌కు ఎలా వచ్చారంటే.. ఈ ఒక్క సీన్‌తో..!?
Updated Date - 2023-08-12T20:55:49+05:30 IST