TS Congress : కర్ణాటక ఫలితాల ఎఫెక్ట్.. హైదరాబాద్ గాంధీభవన్‌లో కనిపించిన సీన్ ఇదీ..
ABN, First Publish Date - 2023-05-13T12:18:13+05:30
కర్ణాటకలో (Karnataka) ఎగ్జిట్ పోల్స్ (Exit Polls) అక్షరాలా నిజమవుతున్నాయ్.. ఒకట్రెండు తప్ప మిగిలిన సర్వే సంస్థలన్నీ కర్ణాటక కాంగ్రెస్‌దే (Congress) అని తేల్చి చెప్పేశాయి. అనుకున్నట్లుగానే..
కర్ణాటకలో (Karnataka) ఎగ్జిట్ పోల్స్ (Exit Polls) అక్షరాలా నిజమవుతున్నాయ్.. ఒకట్రెండు తప్ప మిగిలిన సర్వే సంస్థలన్నీ కర్ణాటక కాంగ్రెస్‌దే (Congress) అని తేల్చి చెప్పేశాయి. అనుకున్నట్లుగానే కన్నడనాట కాంగ్రెస్ ఊహించని రీతిలో విజయం దిశగా దూసుకెళ్తోంది. మధ్యాహ్నం లోపే ఫలితాలు తేలిపోనున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ దాటేయడంతో పార్టీ కార్యకర్తలు, అభిమానులు స్వీట్లు పంచుకుని.. బాణా సంచాలు పేల్చుతూ సంబరాలు చేసుకుంటున్నారు. ఒక్క కర్ణాటకలోనే కాదు.. దేశ వ్యాప్తంగా ఇదే పరిస్థితి. ఈ ఫలితాలతో తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త జోష్ వచ్చింది. కార్యకర్తలంతా సంబరాల్లో మునిగిపోయారు. నిన్న, మొన్నటి వరకూ వెలవెలబోయిన హైదరాబాద్‌లోని గాంధీభవన్ (Gandhi Bhavan).. ఇప్పుడు కార్యకర్తలతో కళకళలాడుతోంది. కర్ణాటక ఫలితాలు తమలో కొత్త జోష్ నింపాయని కార్యకర్తలు చెబుతున్నారు. నిజంగా ఇది టీ కాంగ్రెస్‌కు (TS Congress) మంచి కిక్కించే పరిణామమే.
ఎక్కడ చూసినా కార్యకర్తలే..!
మునుగోడు ఎన్నికల ఫలితాల (Munugodu Election Results) ముందు వరకూ గాంధీ భవన్‌లో కాంగ్రెస్ కార్యకర్తల హడావుడి గట్టిగానే ఉండేది. అయితే ఎన్నికల్లో సిట్టింగ్ సీటు నిలబెట్టుకోలేకపోవడంలో కాంగ్రెస్ అట్టర్‌ప్లాప్ కావడంతో పార్టీ ఢీలా పడిపోయింది. ఆ తర్వాత ప్రతిరోజూ కాంగ్రెస్ నేతలు కొట్లాటలతోనే వార్తల్లో నిలిచారే తప్ప.. సమీక్షలు చేసినట్లు గానీ కనీసం నేతలు కలిసినట్లుగానీ కార్యకర్తలతో సమావేశాలు జరిగినట్లుగానీ ఎక్కడా కనిపించలేదు. ఇప్పుడు పూర్తిగా పరిస్థితులు మారిపోయాయి. కన్నడనాట కాంగ్రెస్ విజయం దిశగా దూసుకెళ్తుండటంతో గాంధీభవన్ నిండా కార్యకర్తలే ఉన్నారు. ఈ సీన్ చూసిన జనాలంతా ‘ఎన్నాళ్లకెన్నాళ్లకు..’ అని పాత రోజులు గుర్తు చేసుకుంటున్నారు. ఇది ఇలాగే కంటిన్యూ అయితే కార్యకర్తలందరం కలిసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చుకోవచ్చని ఒకరికొకరు చెప్పుకుంటున్నారు. మరి ఈ పరిస్థితుల్లో అయినా కొట్లాటలు ఆగి.. కలిసిమెలిసి ఉంటే తెలంగాణలో అధికారంలోకి రావచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ..
కర్ణాటక ఫలితాలను బట్టి రెండు జాతీయ పార్టీలకు తదుపరి టార్గెట్ తెలంగాణనే. ఇప్పుడు కర్ణాటకను దాదాపు ‘హస్త’గతం చేసుకోవడంతో.. తెలంగాణపై కాంగ్రెస్ పెద్దలు ప్రత్యేక దృష్టిసారించనుంది. రాష్ట్రంలో గులాబీ పార్టీ హ్యాట్రిక్ కొట్టకుండా చూడాలన్నదే కాంగ్రెస్ మెయిన్ టార్గెట్. ఇందుకుగాను ఇప్పట్నుంచే చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తూ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ఇరుకున పెడుతోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట. అంతేకాదు.. ఇకపై జాతీయ స్థాయి నాయకులు కూడా రెండు వారాలకోసారి తెలంగాణకు రావాలని ప్లాన్ చేసుకునే పనిలో ఉన్నారట. కర్ణాటకలో ప్రమాణ స్వీకారోత్సవం తర్వాత తెలంగాణలో ఎలా ముందుకెళ్లాలి..? అనేదానిపై ప్రణాళిక రచించే యోచనలు రాష్ట్ర, కేంద్ర నాయకులు భావిస్తున్నారని తెలుస్తోంది.
మొత్తానికి చూస్తే.. కర్ణాటక ఫలితాలతో తెలంగాణకు మంచిరోజులు వచ్చినట్లేనని కార్యకర్తలు చెప్పుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో నేతలు రెండ్రోజులకోసారి కొట్లాటలు మాని కలిసిమెలిసి కేసీఆర్ సర్కార్‌ను ఢీ కొడితే కచ్చితంగా అధికారంలోకి వచ్చేయచ్చని కాంగ్రెస్ హైకమాండ్.. రాష్ట్ర నేతలకు ఇప్పటికే సూచనలు అందాయి. మరి రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ ఎలాంటి వ్యూహాలు, ఎత్తుగడలతో ముందుకెళ్తుందో.. ఇదే గాంధీ భవన్ సీన్ మళ్లీ ఎప్పుడు కనిపిస్తుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే మరి.
******************************
ఇవి కూడా చదవండి..
******************************
Pawan on Nadendla : ఎవరైనా సరే తగ్గేదేలే.. నాదెండ్ల ఎపిసోడ్‌పై ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన పవన్..!
******************************
Karnataka Election Results : హైదరాబాద్‌కు మారుతున్న కర్ణాటక రాజకీయాలు.. హోటల్స్ అన్నీ ఫుల్.. రేవంత్‌రెడ్డితో కీలక మంతనాలు
******************************
Updated Date - 2023-05-13T12:29:08+05:30 IST