ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

YS Jagan Delhi Tour : మరోసారి ఢిల్లీకి వైఎస్ జగన్.. సరిగ్గా ఈ టైమ్‌లోనే ఎందుకో..!?

ABN, First Publish Date - 2023-05-16T22:46:22+05:30

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈనెల 27న జగన్ హస్తినలో పర్యటించనున్నట్లు సీఎంవో నుంచి అధికారిక ప్రకటన వెలువడింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Reddy) మరోసారి ఢిల్లీ పర్యటనకు (Jagan Delhi Tour) వెళ్లనున్నారు. ఈనెల 27న జగన్ హస్తినలో పర్యటించనున్నట్లు సీఎంవో నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. ప్రధాని మోదీ నేతృత్వంలో నీతి ఆయోగ్ టీమ్ ఇండియా సమావేశంలో పాల్గొనాలని జగన్‌కు కేంద్రం నుంచి ఆహ్వానం అందింది. ఢిల్లీ విజ్ఞాన్ భవన్‌లో జరిగే ఈ సమావేశంలో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొననున్నారు. ఆహ్వానం రావడంతో సమావేశానికి హాజరుకావాలని జగన్ కూడా నిర్ణయించారు. అయితే.. మొదట్లో ఈ సమావేశానికి డుమ్మా కొట్టాలని భావించినప్పటికీ ఆ తర్వాత మనసు మార్చుకున్న హస్తినకు వెళ్లాల్సిందేనని నిర్ణయించారట. అయితే.. రాష్ట్రం ఎదుర్కొంటున్న విభజన సమస్యలు కేంద్రానికి జగన్ వినిపించనున్నట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఏపీకి ప్రత్యేక హోదా, పోలవరంతో పాటు రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి జగన్ గళమెత్తనున్నట్లు వైసీపీ చెబుతోంది.

అపాయింట్మెంట్ ఉంటుందా..!?

27న సమావేశం ఉండటంతో 26న సాయంత్రమే జగన్ ఢిల్లీకి వెళ్తున్నట్లు తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi), కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో (Amit Shah) భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరితో పాటు కీలక శాఖల మంత్రుల అపాయింట్మెంట్‌ను కూడా కోరినట్లు సమాచారం. ఈ భేటీలకు సంబంధించి వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయిరెడ్డి (MP Vijaya Sai Reddy) అన్నీ దగ్గరుండి చూస్తున్నారని తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే మొదట అమిత్ షా.. ఆ తర్వాత పలువురు కేంద్ర మంత్రులను జగన్ కలుసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాగా.. గత నెలలో రెండు, మూడు సార్లు జగన్ హస్తిన పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే ఈసారి అపాయింట్మెంట్ దొరుకుతుందో లేదో తెలియాల్సి ఉంది.

సీబీఐ దూకుడు..!

తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన వైఎస్ వివేకా హత్యకేసులో సీబీఐ యమా దూకుడు మీద ఉంది. మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ అటు హైదరాబాద్‌లో.. ఇటు పులివెందులలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ కేసులో సహ నిందితుడిగా తన సోదరుడు, కడప ఎంపీ అవినాష్ రెడ్డిని ఏ క్షణమైనా అరెస్ట్ చేయొచ్చని ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. మంగళవారం నాడు విచారణ పూర్తయిన తర్వాత అరెస్ట్ చేస్తారని కూడా ప్రచారం జరిగింది. అయితే ఆఖరి నిమిషంలో తాను విచారణకు రావట్లేదని చెప్పి.. గడువు కోరి పులివెందులకు వెళ్లిపోయారు. దీంతో అవినాష్ అరెస్ట్‌ను ఆపాలని అమిత్ షాతో చర్చించే ఛాన్స్ ఉంది. వాస్తవానికి మొదట నీతి ఆయోగ్ సమావేశానికి వెళ్లకూడదని భావించినప్పటికీ.. పనిలో పనిగా అమిత్ షా భేటీ అయ్యి ఈ విషయం చర్చించొచ్చని జగన్ హస్తినకు వెళ్తున్నారట.

మొత్తానికి చూస్తే.. వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడుగా ముందుకెళ్తున్న ప్రతిసారి జగన్ హస్తిన పర్యటనకు పరుగులు తీస్తారనే ఆరోపణలు కోకొల్లలు. అయితే సరిగ్గా ఇప్పుడు కూడా కేసు కీలక దశకు చేరుకోవడంతో ఢిల్లీ వెళ్తున్నారనే ప్రతిపక్షాల నుంచి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే.. ఢిల్లీ పర్యటనలో జగన్ ఏమేం చేస్తారు..? ఎవరెవరితో భేటీ అవుతారో తెలియాలంటే ఈ నెల 27వరకు వేచి చూడాల్సిందే మరి.

******************************

ఇవి కూడా చదవండి..

******************************

Avinash In Viveka Case : సీబీఐ విచారణకు వెళ్తున్న ఎంపీ అవినాష్‌కు చివరి నిమిషంలో ఫోన్ చేసిందెవరు..!?

******************************
AV Subbareddy Vs Akhila : లోకేష్ పాదయాత్రలో ఉద్రిక్తత.. ఏవీ సుబ్బారెడ్డిపై అఖిల ప్రియ వర్గం దాడి.. తీవ్ర గాయాలు..

******************************

Updated Date - 2023-05-16T23:02:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising