ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP assembly: అసెంబ్లీలో స్పీకర్ ఏవిధంగా వ్యవహరించకూడదో మరోసారి చూపించిన తమ్మినేని సీతారాం..!

ABN, First Publish Date - 2023-09-21T14:26:43+05:30

సమన్వయం, ఓర్పుతో సభను సజావుగా నడిపించాల్సిన స్పీకర్ అనుచితంగా వ్యవహరిస్తే సభలు ఎంతటి పరిహాసమవుతాయో అందుకు ప్రత్యేక్ష ఉదాహరణే నేటి (గురువారం) ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ (AP Assembly). ‘‘ వాట్ ఈజ్ దిస్. యా.. పో.. త్... యూజ్‌లెస్ ఫెలో.. ఎవడ్రా చెప్పాడు నీకు’’... అంటూ విపక్ష సభ్యులైన టీడీపీ ఎమ్మెల్యేలను అసహ్యహించుకుంటూ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం చేసిన వ్యాఖ్యలు విస్మయం కలిగిస్తున్నాయి.

సమన్వయం, ఓర్పుతో సభను సజావుగా నడిపించాల్సిన స్పీకర్ అనుచితంగా వ్యవహరిస్తే సభలు ఎంతటి పరిహాసమవుతాయో అందుకు ప్రత్యేక్ష ఉదాహరణే నేటి (గురువారం) ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ (AP Assembly). ‘‘ వాట్ ఈజ్ దిస్. యా.. పో.. త్... యూజ్‌లెస్ ఫెలో.. ఎవడ్రా చెప్పాడు నీకు’’... అంటూ విపక్ష సభ్యులైన టీడీపీ ఎమ్మెల్యేలను అసహ్యించుకుంటూ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సర్వత్రా విస్మయం కలిగిస్తున్నాయి. టీడీపీ అధినేత నారా చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ గురించి సభలో ఎక్కడా వినిపించకూడదని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్టుగా ఆయన వ్యవహార శైలి చూస్తే అర్థమవుతోంది. స్పీకర్ స్థానాన్ని గౌరవించలేదనే కారణాన్ని చూపుతూ మొదటి రోజు సమావేశాల నుంచి ఏకంగా 15 మంది ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు వేశారు. అంతేకాదు మరో ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలపైనైతే ఏకంగా సమావేశాలు అయిపోయే వరకు సస్పెన్షన్ విధించడం ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు వేయడం ఒక ఎత్తైతే.. అంతకుమించి అన్నట్టు స్పీకర్ వాడిన భాష ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.


స్పీకర్ పదవికి అర్హులేనా?

ఏపీ అసెంబ్లీ సమావేశాలు మొదలైన తొలి రోజే స్పీకర్ తమ్మినేని సీతారాం ఎప్పటిలాగానే తన మార్క్‌ను ప్రదర్శించారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ను నిరసించిన టీడీపీ ఎమ్మెల్యేలపై వెంటనే చర్యలకు పూనుకున్నారు. ఓపిక పట్టలేదు.. పెద్దగా సర్దిచెప్పే ప్రయత్నమూ చేయకుండానే ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటేశారు. స్పీకర్ స్థానాన్ని అగౌరవపరిచేలా కాగితాలు చించివేశారని, మీసాలు మెలివేయడం, తొడలు చరచడం లాంటి వికృత చేష్టలకు పాల్పడ్డారని కారణాలుగా చెప్పారు. కానీ స్పీకర్ తమ్మినేని సీతారాం మాత్రం అనుచిత వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష సభ్యులను ఉద్దేశించి ‘యూజ్‌లెస్ ఫెలోస్’, ‘ఎవడ్రా చెప్పాడు నీకు’ వంటి భాషను వాడడంతో ఆయనవైపే వేళ్లన్ని చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. స్పీకర్ ఈ విధంగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసం? స్పీకర్ స్థాయి వ్యక్తికి ఇది తగునా? అనే ప్రశ్నలు వస్తున్నాయి.

అనుచితంగా వ్యవహరించిన స్పీకర్‌పై ప్రతిపక్ష టీడీపీ (TDP) మండిపడింది. ఆయన తీరును ఎక్స్‌ (గతంలో ట్విటర్) వేదికగా ఖండించింది. ఈయన అసలు స్పీకర్ పదవికి అర్హుడేనా? అని నిలదీసింది. ‘టీడీపీ వాళ్ళని యూజ్ లెస్ ఫెలో అంటాడు.. వైసీపీ వాళ్ళని ‘మన వాళ్ళు’ అంటాడు’ అని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు స్పీకర్ తమ్మినేని సీతారాం అసెంబ్లీలో మాట్లాడిన వీడియో క్లిప్‌ను టీడీపీ షేర్ చేసింది. దీంతో స్పీకర్ తీరుపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. అయితే స్పీకర్‌గా తమ్మినేని సీతారాం ఈ విధంగా వ్యవహరించడం కొత్తేమీ కాదని, ఆయనలో తీరులో మార్పురాదని మరోసారి చాటి చెప్పినట్టు అయ్యిందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇక అనుచితంగా ప్రవర్తించారని ఎమ్మెల్యేలపై వేటు వేసిన స్పీకర్ ఇలా మాట్లాడొచ్చా అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. వీటిపై స్పీకర్ స్పందిస్తారో లేదో వేచిచూడాలి మరి.

Updated Date - 2023-09-21T14:43:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising