YSRCP : తాడేపల్లి ప్యాలెస్‌లో సీఎం వైఎస్ జగన్ మూడాఫ్ అయ్యారా.. ఈ దెబ్బతో..!
ABN, First Publish Date - 2023-04-16T18:14:29+05:30
సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మూడాఫ్ (YS Jagan Mood Off) అయినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే సోమవారం నాటి..
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో (YS Viveka Murder Case) ప్రధాన సూత్రదారిగా కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి (YS Avinash Reddy) తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని (YS Bhaskar Reddy) సీబీఐ (CBI) అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ అరెస్ట్‌తో వైసీపీలో (YSR Congress) గుబులు మొదలైంది. భాస్కర్ రెడ్డి తర్వాత ఎంపీ అవినాష్‌ను కూడా అరెస్ట్ చేస్తారని వార్తలు గుప్పుమంటున్నాయి. ఆదివారం తెల్లవారుజాము నుంచి సాయంత్రం 5 గంటల వరకూ జరిగిన పరిణామాలన్నింటినీ ఎప్పటికప్పుడు సమాచారం అందుకున్న సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మూడాఫ్ (YS Jagan Mood Off) అయినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే సోమవారం నాటి అనంతపురం జిల్లా శింగనమల పర్యటనను రద్దు చేసుకున్న జగన్.. తాజాగా అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఈ నెల మొత్తం తన పర్యటనలను రద్దు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇంతకీ ఈ నెలలో జగన్ ఎక్కడెక్కడ పర్యటించాల్సి ఉంది..? సీఎం రద్దు చేసుకున్న పర్యటన కథేంటి..? అనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
మొదట్నుంచీ ఉక్కిరిబిక్కిరి..!
బాబాయ్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్ జగన్ ఉక్కిరిబిక్కిరవుతున్నారనే వార్తలు మొదట్నుంచీ వస్తూనే ఉన్నాయి. ఈ హత్య ఎలా జరిగింది..? ఎవరు చేశారు..? పాత్రదారులెవరు.. సూత్రదారులెవరు..? అని తేల్చేపనిలో సీబీఐ నిమగ్నమైంది. ఇప్పటికే పదుల సంఖ్యలో అరెస్ట్ కాగా.. తాజాగా ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని కూడా సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ అరెస్ట్‌తో వైఎస్ ఫ్యామిలీతో పాటు వైసీపీ అధిష్టానం కూడా సతమతం అవుతోందట. ఈ వ్యవహారంపై ఎలా ముందుకెళ్లాలని సమాలోచనలు చేస్తున్నట్లు ఆదివారం ఉదయమే వార్తలు వచ్చాయి. ఇది ఒక రకంగా వైసీపీకి చేదు అంశమేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా సొంత ఇంటి వారినే సీబీఐ అదుపులోకి తీసుకోవడం జగన్‌ను ఇరకాటంలో పడేసిందని విశ్లేషకులు చెబుతున్నారు.
అరెస్ట్ ఎఫెక్ట్.. టూర్లన్నీ రద్దు..!
వివేకా హత్యకేసులో పార్టీకి గానీ.. సోదరుడు అవినాష్‌కు.. ఇందులో ఇంటి వారికి ఎలాంటి సంబంధమేలేదని ఇన్ని రోజులు వైఎస్ జగన్ చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఇప్పుడు భాస్కర్ రెడ్డి అరెస్టుతో మీడియా ముందుకు వచ్చినా.. బహిరంగ సభల్లో మాట్లాడాల్సి వచ్చినా ఏం చెప్పాలో.. ఎలా మేనేజ్ చేయాలో జగన్ దగ్గర సమాధానం లేదట. ఇన్ని రోజులు అలా చెప్పిన తాను.. ఇప్పుడు ఏంచెప్పాలో దిక్కుతోచట్లేదట. దీంతో ఈ నెల మొత్తం ప్రభుత్వం పరంగా ఉండే కార్యక్రమాలు, విదేశీ పర్యటనలు.. సమీక్షలు అన్నీ రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది.మొత్తానికి చూస్తే.. సీబీఐ దూకుడుతో అరెస్ట్‌లు చేయడం జగన్ పర్యటనలపై గట్టిగానే ప్రభావం చూపిందని సోషల్ మీడియాలో నెటిజన్లు తెగ చెవులు కొరుక్కుంటున్నారు.
- సోమవారం నాడు అనంతపురం జిల్లా శింగనమలలో ‘జగనన్న వసతి దీవెన’ (Jagananna Vasathi Deevena) కార్యక్రమంలో జగన్ పాల్గొనాల్సి ఉంది. అయితే ఈ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు ఇప్పటికే సీఎంవో నుంచి ప్రకటన కూడా వచ్చేసింది. ఈ కార్యక్రమాన్ని ఈ నెల 26కు వాయిదా వేస్తున్నట్లు సీఎంవో (AP CMO) తెలిపింది. దీంతో 26న అయినా పక్కాగా విద్యార్థుల అకౌంట్లో నగదు పడుతుందా అనేది అనుమానమేనని తెలుస్తోంది.
- ఈ నెల 21న వైఎస్ జగన్ విదేశీ పర్యటనకు వెళ్లాలని భావించారు. వారం రోజుల పాటు కుటుంబ సభ్యులతో లండన్‌లో గడపాలని భావించారు. అక్కడ్నుంచి భార్య వైఎస్ భారతి, కుమార్తెలు హర్షా రెడ్డి, వర్షా రెడ్డితో కలిసి యూరప్ టూర్‌కు వెళ్లాలని జగన్ అనుకున్నారట. అయితే ఇప్పుడున్న ఈ పరిస్థితులు విదేశీ పర్యటనకు వెళ్లేలా లేవని.. రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది.
- ఇవన్నీ ఒక ఎత్తయితే సోమవారం లేదా మంగళవారం రాత్రికి జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నట్లు సమాచారం. ఏపీలో జరుగుతున్న తాజా పరిణామాలు ముఖ్యంగా.. అవినాష్‌రెడ్డిని అరెస్ట్ చేస్తారనే వార్తలు గుప్పుమనడంతో ఈ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకునే ఛాన్స్ అవకాశం ఉంది. గత నెలలో వరుసగా జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లొచ్చిన తర్వాతే.. సీబీఐ విచారణ వేగం మందగించిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ తర్వాతే సుప్రీంకోర్టు సీబీఐ అధికారిని మార్చడం, దర్యాప్తునకు డెడ్‌లైన్ విధించడంతో సీబీఐ దూకుడు పెంచింది.
మరోవైపు.. జగన్ మూడాఫ్ నుంచి కోలుకోవడానికి కచ్చితంగా విదేశీ పర్యటనకు వెళ్తారని వైసీపీ కార్యకర్తలు, వీరాభిమానులు సోషల్ మీడియాలో చెప్పుకుంటున్నారు. ప్రభుత్వ పరంగా, ఫ్యామిలీ పరంగా.. ఏం జరిగినా జగన్ మూడాఫ్ అవుతారని కొద్దిరోజుల పాటు ఎవరికీ అందుబాటులో ఉండరనే వార్తలు ఎప్పట్నుంచో ఉన్నవే. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్ ఏం చేస్తారో.. ఏంటో అని వైసీపీ శ్రేణులు ఎంతగానే ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయట. అయితే తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఈ కొద్దిరోజులు జగన్ అస్సలే బయటికి రారట. భాస్కర్ రెడ్డి అరెస్ట్.. జగన్ టూర్ రద్దు గురించి ఇప్పటి వరకూ వైసీపీ నుంచి పెద్దగా రియాక్షన్స్ రాలేదు.. నేతలు మీడియా ముందుకొచ్చి ఏమేం మాట్లాడుతారో వేచి చూడాల్సిందే మరి.
******************************
ఇవి కూడా చదవండి..
******************************
YS Bhaskar Reddy Arrest : తండ్రి అరెస్ట్‌పై ఫస్ట్ టైమ్ స్పందించిన అవినాష్ రెడ్డి.. కీలక విషయాలు వదిలి సిల్లీగా...!
******************************
YS Viveka Murder Case : వివేకా హత్య కేసులో అరెస్టయిన వైఎస్ భాస్కర్ రెడ్డిపై ఉన్న అభియోగాలేంటి.. సీబీఐ అనుమానాలేంటి..!?
******************************
YS Jagan : వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్ట్‌తో సీఎం జగన్ సడన్‌గా.. ఏపీ రాజకీయాల్లో ఓ రేంజ్‌లో చర్చ
*****************************
YS Bhaskar Reddy Arrest Live Updates : భాస్కర్‌రెడ్డికి అమాంతం పెరిగిపోయిన బీపీ.. 14 రోజులు రిమాండ్ విధించిన సీబీఐ కోర్ట్.. ఉదయం అరెస్ట్ నుంచి ఇప్పటి వరకూ ఇలా..
*****************************
Updated Date - 2023-04-16T18:20:28+05:30 IST