ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Big Breaking : చంద్రబాబుపై మరో కేసు నమోదు చేసిన సీఐడీ.. ముగ్గురు కీలకనేతలపై కూడా..!!

ABN, First Publish Date - 2023-11-02T17:07:44+05:30

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబును ఇబ్బంది పెట్టడమే టార్గెట్‌గా పెట్టుకున్న జగన్ సర్కార్ ఇప్పటికే అక్రమ కేసులు బనాయించిన సంగతి తెలిసిందే. స్కిల్ కేసులో అక్రమంగా అరెస్ట్ చేసి 52 రోజులపాటు రాజమండ్రి సెంట్రల్ జైలులో పెట్టింది...

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబును ఇబ్బంది పెట్టడమే టార్గెట్‌గా పెట్టుకున్న జగన్ సర్కార్ ఇప్పటికే అక్రమ కేసులు బనాయించిన సంగతి తెలిసిందే. స్కిల్ కేసులో అక్రమంగా అరెస్ట్ చేసి 52 రోజులపాటు రాజమండ్రి సెంట్రల్ జైలులో పెట్టింది. అనారోగ్య కారణాలతో కొన్ని చికిత్సలు, ఆపరేషన్లు చేయాల్సి ఉండటంతో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. అలా జైలు నుంచి బయటికి వచ్చిన ఒక్కరోజు గ్యాప్‌లోనే మరోసారి ప్రభుత్వం తన అక్కసు వెల్లగక్కింది. ఇప్పటికే.. స్కిల్ డెవలప్మెంట్, ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ నెట్, మద్యం, అసైన్డ్ ల్యాండ్‌లకు సంబంధించి చంద్రబాబుపై కేసులు నమోదయ్యాయి.


ఇదీ కేసు కథ..

చంద్రబాబుపై తాజాగా మరో కేసును సీఐడీ నమోదు చేసింది. టీడీపీ హయాంలో ఇసుక అక్రమాలపై ఏపీ ఎండీసీ ఇచ్చిన ఫిర్యాదుతో ఈ కేసు నమోదయ్యింది. ఈ కేసులో ఏ1గా పీతల సుజాత, ఏ2గా చంద్రబాబు, ఏ3గా చింతమనేని ప్రభాకర్, ఏ4గా దేవినేని ఉమ పేర్లను సీఐడీ చేర్చింది. టీడీపీ హయాంలో ప్రభుత్వ ఖజానాకు తీవ్ర నష్టం చేకూర్చేలా వీరంతా వ్యవహరించారనే ఫిర్యాదుతో సీఐడీ కేసు నమోదు చేసింది. ఉచిత ఇసుక ముసుగులో మొత్తం రూ. 10వేల కోట్ల దోపిడీ చేవారని.. తద్వారా ప్రభుత్వ ఖజానాకు తీవ్ర నష్టం వాటిల్లిందని ఫిర్యాదులో ఉంది. ఉచిత ఇసుక పేరుతో సహజ వనరుల హద్దు లేకుండా అక్రమ తవ్వకాలకు ఆస్కారం ఇచ్చారని ‌సీఐడీ అభియోగాలు మోపింది.

కాగా.. చంద్రబాబు హయాంలో పీతల సుజాత గనుల శాఖ మంత్రిగా పనిచేశారు. ఈ నలుగురితో పాటు మరికొందరిపైనా సీఐడీ కేసులు నమోదు చేసింది. ఎన్ని కేసులు పెట్టుకున్న పార్టీని.. చంద్రబాబును ఏమీ చేయలేరని.. అక్రమ కేసులో ఎన్నోరోజులు నిలబడవని.. అంతిమ విజయం న్యాయానిదేనని టీడీపీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి.

Updated Date - 2023-11-02T19:02:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising