ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Jagan On Early Polls: ముందస్తు ఎన్నికలపై తేల్చి చెప్పిన సీఎం జగన్‌రెడ్డి.. ఆ ఒక్క మాటతో జేబులో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్లిపోయిన ఎమ్మెల్యేలు!

ABN, First Publish Date - 2023-04-03T15:09:20+05:30

ఆంధ్రప్రదేశ్‌లో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందన్న వార్తలపై సీఎం జగన్ రెడ్డి కుండబద్ధలు కొట్టారు. ముందస్తు ఎన్నికలు లేవని ఏపీ ముఖ్యమంత్రి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ముందస్తు ఎన్నికలు (Andhra Pradesh Early Polls) వచ్చే అవకాశం ఉందన్న వార్తలపై సీఎం జగన్ రెడ్డి (AP CM Jagan Reddy) కుండబద్ధలు కొట్టారు. ముందస్తు ఎన్నికలు లేవని ఏపీ ముఖ్యమంత్రి తేల్చి చెప్పారు. ఎన్నికలకు ఇంకా 14 నెలలు సమయం ఉందని సీఎం జగన్‌రెడ్డి వర్క్‌షాప్‌లో (CM Jagan Reddy Workshop) ఎమ్మెల్యేలకు, మంత్రులకు దిశానిర్దేశం చేయడంతో ప్రస్తుతానికి సీఎం జగన్ రెడ్డికి ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన లేదని స్పష్టమైంది. ఆ ఒక్క మాటతో వైసీపీ ఎమ్మెల్యేలు జేబులో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్లిపోయినంత హ్యాపీగా ఫీలయ్యారు. ముందస్తుపై ప్రకటన చేస్తారేమోనని అప్పటివరకూ కొందరు ఎమ్మెల్యేలు మదనపడ్డారు. వాళ్లంతా రిలాక్స్ కావడం విశేషం.

ఇది కూడా చదవండి: YCP Jagan: ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై జగన్ రెడ్డి ఎమ్మెల్యేలతో ఏమన్నారో తెలిస్తే నోటితో నవ్వరు..!

అంతేకాదు.. పనిలోపనిగా తనకు బాకా ఊదని, ప్రజాపక్షం నిలిచే మీడియాపై కూడా తన అక్కసు వెళ్లగక్కారు. 60 మందికి టికెట్లు ఇవ్వమని ప్రచారం చేస్తున్నారని, ఒక్కో ఎమ్మెల్యేని టార్గెట్ చేసి విషప్రచారం చేస్తున్నారని జగన్‌రెడ్డి ఎమ్మెల్యేలతో చెప్పడం గమనార్హం. అసత్య ప్రచారాలను మనం తిప్పికొట్టలేకపోతున్నామని ఎమ్మెల్యేలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతి లబ్దిదారుడిని మన ప్రచారకర్తగా తయారు చేసుకోవాలని, ఆగస్టు నాటికి గడపగడపకు ప్రభుత్వ కార్యక్రమం పూర్తి చేయాలని జగన్‌రెడ్డి ఎమ్మెల్యేలకు, మంత్రులకు దిశానిర్దేశం చేశారు. అయితే.. ఈ వర్క్‌షాప్ సాక్షిగా జగన్ తన డొల్లతనాన్ని బయటపెట్టుకున్నారు. రాష్ట్ర అభివృద్ధికి ఏం చేశారో ఎమ్మెల్యేలతో కూడా చెప్పుకోలేని దుస్థితిలో పడిపోయారు.

‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో.. అభివృద్ధి పనులపై జనం తమను నిలదీస్తున్నా.. వచ్చే ఎన్నికల్లో టికెట్‌ రావడానికి ఈ కార్యక్రమంతో ముడిపెట్టడంతో ఇష్టం లేకున్నా వారు పాల్గొంటూ వస్తున్నారు. సంక్షేమ పథకాల అమలు, నగదు పంపిణీ, లబ్ధిదారుల ఎంపికలో ఎమ్మెల్యేలకు ఎలాంటి భాగస్వామ్యం లేదు. వలంటీర్లదే పెత్తనం. దీంతో నియోజకవర్గాల్లో తమకు విలువ లేకుండా పోయిందని ఎమ్మెల్యేలు లబోదిబోమంటున్నా జగన్‌ గానీ, నాయకత్వంగానీ పట్టించుకోవడం లేదు. పార్టీ, అధికారిక సమావేశాల్లో ఐ-ప్యాక్‌ బృందం సభ్యులు జగన్‌ ప్రతినిధుల్లా హాజరవుతున్నారు. ఎమ్మెల్యేల పనితీరుపై అక్కడి నుంచే నాయకత్వానికి నివేదికలు పంపుతున్నారు. దీనికితోడు తమ కదలికలపై అనుక్షణం సొంత ప్రభుత్వమే నిఘా పెట్టడం వారు సహించలేకపోతున్నారు.

ఈ పరిస్థితుల్లో ఉత్తరాంధ్ర, తూర్పు, పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గాల శాసనమండలి ఎన్నికలు జరిగాయి. దొంగ ఓట్లను చేర్పించినా.. పదో తరగతి కూడా చదవనివారిని గ్రాడ్యుయేట్‌ ఓటర్లుగా నమోదు చేయించినా.. చివరకు భారీఎత్తున రిగ్గింగ్‌కు పాల్పడినా.. మూడు స్థానాల్లోనూ వైసీపీ ఘోరంగా ఓడిపోయింది. ఈ మూడు పట్టభద్ర స్థానాల పరిధిలో 9 ఉమ్మడి జిల్లాలు, 108 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. పది లక్షల మంది విద్యావంతులు ఓటర్లుగా ఉన్నారు. వీరందరూ ఒకే విధంగా ఆలోచించి మరీ అధికార పార్టీని ఓడించి.. ప్రతిపక్ష తెలుగుదేశాన్ని భారీ ఆధిక్యంతో గెలిపించారు. మరో ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు రానున్న తరుణంలో తమ ఉద్దేశమేమిటో తెలియజేశారు.

Updated Date - 2023-04-03T15:35:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising