ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP Politics : చంద్రబాబు ఆరోగ్యంపై ఆరా తీసిన గవర్నర్.. పావు గంట లోకేష్‌తో ప్రత్యేకంగా చర్చ

ABN, First Publish Date - 2023-11-07T18:42:25+05:30

ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో టీడీపీ బృందం భేటీ అయ్యింది. సుమారు గంటపాటు జరిగిన ఈ భేటీలో ఏపీలో జరుగుతున్న పరిణామాలు, జగన్ సర్కార్ చేపడుతున్న కక్షపూరిత కార్యక్రమాల గురించి నిశితంగా గవర్నర్‌కు నారా లోకేష్, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, ధూళిపాళ్ల నరేంద్ర, పీతల సుజాత, అశోక్ కుమార్ వివరించారు..

టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. స్కిల్ అక్రమ కేసులో అరెస్టయ్యి 52 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉండి అనారోగ్య కారణాల రీత్యా మధ్యంతర బెయిల్‌పై బయటికొచ్చి హైదరాబాద్‌లోని ప్రముఖ ఆస్పత్రులైన ఏఐజీ, ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు. మంగళవారం నాడు కుడి కంటికి కాటరాక్ట్ ఆపరేషన్ కూడా విజయవంతంగా జరిగింది. మరోవైపు.. ఇవాళే ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో టీడీపీ బృందం భేటీ అయ్యింది. సుమారు గంటపాటు జరిగిన ఈ భేటీలో ఏపీలో జరుగుతున్న పరిణామాలు, జగన్ సర్కార్ చేపడుతున్న కక్షపూరిత కార్యక్రమాల గురించి నిశితంగా గవర్నర్‌కు నారా లోకేష్, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, ధూళిపాళ్ల నరేంద్ర, పీతల సుజాత, అశోక్ కుమార్ వివరించారు. అనంతరం.. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు ఉండకూడదన్న లక్ష్యంతో జగన్ కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారంటూ.. చంద్రబాబుపై ప్రభుత్వం పెడుతున్న అక్రమ కేసుల గురించి ఆధారాలతో సహా గవర్నర్‌కు వివరించారు.


బాబు ఎలా ఉన్నారు..?

ఈ భేటీలో భాగంగా చంద్రబాబు ఆరోగ్యం గురించి ప్రస్తావన వచ్చింది. చంద్రబాబు ఎలా ఉన్నారు..? బాబు ఆరోగ్యం ఎలా ఉంది..? అని నారా లోకేష్‌ను అడిగి తెలుసుకున్నారు. బాబు గారు కోలుకుంటున్నారని లోకేష్‌, ఆయన బృందం వివరించింది. టీడీపీ నేతలు చెప్పిన విషయాలన్నింటినీ గవర్నర్ ఆసక్తిగా విన్నారు. నవ్వుతూనే అన్ని విషయాలను అబ్దుల్ నజీర్ విన్నారు. అనంతరం నారా లోకేష్‌తో పావు గంటపాటు ప్రత్యేకంగా గవర్నర్ మాట్లాడారు. అయితే ఏం చర్చించారన్న విషయం బయటికి రాలేదు. ఈ చర్చ తర్వాత లోకేష్ కోరిక మేరిక తన ఛాంబర్‌కు గవర్నర్ తీసుకెళ్లారు. ఈ భేటీ తర్వాత లోకేష్, అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడారు. వైసీసీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు, చేస్తోన్న సామాజిక అన్యాయంపై గవర్నర్‌కు ఫిర్యాదు చేయడం జరిగింది.

ఏమేం ఫిర్యాదు చేశారు..?

ముఖ్యంగా.. రాష్ట్రంలో గత 53 నెలల వైసీపీ ప్రభుత్వ అరాచక పాలనలో బీసీ, ఎస్సీ, ఎస్టీలపై దాడులు జరిగాయంటూ గవర్నర్‌కు లోకేశ్‌ వివరించారు. టీడీపీ సానుభూతిపరులపై 60 వేల కేసులు పెట్టారన్నారు. చంద్రబాబు అరెస్టు సమయంలో పోలీసుల తీరును గవర్నర్‌కు తెలిపామన్నారు. చంద్రబాబుపై ఎలాంటి ఆధారాలు లేకుండా పదుల సంఖ్యలో కేసులు పెట్టారని టీడీపీ నేతలు ఆరోపించారు. వైసీపీ పాలనలో దక్షిణ భారతదేశ బిహార్‌గా ఏపీ మారిందని లోకేష్ విమర్శలు గుప్పించారు. కాగా.. త్వరలోనో ప్రజా సమస్యలపై జనసేనతో కలిసి ప్రజా ఉద్యమం చేపడతామని లోకేష్ తెలిపారు. జనసేనతో సంప్రదింపులు జరిపారని, త్వరలో మేనిఫెస్టో విడుదల చేస్తామని లోకేష్ ప్రకటించారు.


ఇవి కూడా చదవండి


YSRTP : ఎన్నికల ముందు వైఎస్ షర్మిలకు ఊహించని షాక్..


Chandrababu : చంద్రబాబు‌కు కంటి ఆపరేషన్ పూర్తి.. ఎక్స్‌క్లూజివ్ ఫొటో..


Updated Date - 2023-11-07T18:42:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising