ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Big Breaking: చంద్రబాబుకు బిగ్ రిలీఫ్.. రెగ్యులర్ బెయిల్ మంజూరు

ABN, First Publish Date - 2023-11-20T14:26:10+05:30

Skill Development Case: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. ఈ కేసులో చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ లభించింది. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసినట్లు హైకోర్టు తీర్పు వెల్లడించింది.

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. ఈ కేసులో చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ లభించింది. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసినట్లు హైకోర్టు తీర్పు వెల్లడించింది. ఈనెల 29 నుంచి బెయిల్‌కు అంతకుముందు ఉన్న షరతులన్నింటినీ తొలగిస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది. ఈనెల 28లోపు చంద్రబాబు హెల్త్ రిపోర్టును విజయవాడ ఏసీబీ కోర్టు జడ్జికి సమర్పించాలని ఆదేశించింది. ఈనెల 29 నుంచి చంద్రబాబు రాజకీయ ర్యాలీల్లో నేరుగా పాల్గొనవచ్చని వెల్లడించింది. దీంతో ఏపీ వ్యాప్తంగా టీడీపీ కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్నారు. ఇప్పటికే స్కిల్ కేసులో చంద్రబాబుకు ఇచ్చిన రిమాండ్ ఆర్డర్ సస్పెండ్ చేయాలని, FIR క్వాష్ చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా గతంలోనే వాదనలు పూర్తయ్యాయి. గత నెలలో తీర్పును సుప్రీంకోర్టు ధర్మాసనం రిజర్వ్ చేసింది. దీపావళి సెలవుల అనంతరం తీర్పు ప్రకటిస్తామని ధర్మాసనం చెప్పింది. రేపో, మపో సుప్రీం ధర్మాసనం తీర్పు ప్రకటించనుంది.

కాగా స్కిల్ డెవలప్‌మెంట్ అక్రమ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. దీంతో 53 రోజుల పాటు చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. అయితే అనారోగ్య కారణాలతో చంద్రబాబుకు హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఈనెల 28 వరకు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఇటీవల స్కిల్ కేసులో చంద్రబాబు రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో మూడు రోజుల పాటు వాదనలు జరిగాయి. చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా, సీఐడీ తరపున ఏఏజీ పొన్నవొలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. 2021 డిసెంబర్ 9న స్కిల్ కేసు నమోదు చేశారు. 2023 సెప్టెంబర్ 9న చంద్రబాబును సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో చంద్రబాబును A37గా సీఐడీ చేర్చింది.


మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - 2023-11-20T14:51:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising