ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

KarnatakaElections2023: కర్ణాటకలో ఒకే విడత ఎన్నికలు.. లాభమెవరికి..?

ABN, First Publish Date - 2023-03-30T16:38:56+05:30

శాసనసభ ఎన్నికల నేపథ్యంలో (KarnatakaElections2023) ఆరు నెలల ముందుగానే కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికల వేడి (KarnatakaAssembly Elections) ప్రారంభమైంది. మార్చి సమీపించే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

బెంగళూరు (ఆంధ్రజ్యోతి): శాసనసభ ఎన్నికల నేపథ్యంలో (KarnatakaElections2023) ఆరు నెలల ముందుగానే కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికల వేడి (KarnatakaAssembly Elections) ప్రారంభమైంది. మార్చి సమీపించే కొంద్దీ రాజకీయ పార్టీలపై ఒత్తిడి తీవ్రమైంది. అభ్యర్థుల ఎంపికతో పాటు ప్రత్యర్థులను విమర్శలతో తిప్పికొట్టేందుకు చేసే ప్రయత్నాలలో బిజీగా గడిపారు. అధికార బీజేపీతో (Karnataka BJP) పాటు ప్రతిపక్ష కాంగ్రెస్‌ (Karnataka Congress), జేడీఎస్‌ పార్టీలకు (JDS) ఒకే బెంగ పట్టుకుంది. ఎన్నికలు ఎన్ని విడతలలో సాగుతాయనే విషయమై మూడు పార్టీలు తర్జనభర్జన పడ్డాయి.

రాష్ట్రంలో గడిచిన కొన్ని దశాబ్దాల కాలంగా జరిగిన శాసనసభ ఎన్నికలు అన్నీ ఒకే విడతలో జరిగాయి. కానీ ఇటీవల వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలు నాలుగైదు విడతలకు మించి సాగడంతో రాష్ట్రంలోను మార్పు తప్పదనుకున్నారు. రాష్ట్రంలో 224 నియోజకవర్గాలు ఉన్నందున కనీసం రెండు లేదా మూడు విడతలు సాగుతాయని భావించారు. అదే జరిగితే ఏదైనా ఒక పార్టీకి అనుకూలంగా పరిస్థితి మారిపోతుందనే చర్చలు సాగాయి. ఒకానొక దశలో అధికార పార్టీకి ఎదురే ఉండదనే చర్చలు సాగాయి. మరో వైపు ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ కూడా తమకు కలసివస్తుందని అంచనా వేసింది.

ఒక ప్రాంతంలో ఎన్నికల ప్రక్రియ ముగిస్తే నాయకులందరినీ ఇతర ప్రాంతాలకు తరలించి అనుకూలం చేసుకోవచ్చునని ఆలోచించారు. అందుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేయాలనుకున్నారు. జేడీఎస్‌ పార్టీ మాత్రం పాత మైసూరు, బెంగళూరు ప్రాంతాల్లో రెండు సార్లు జరిగితే బాగుంటుందని ఆశించింది. కనీసం వారం రోజుల వ్యత్యాసం ఉంటే మరింత మంది ప్రజలను కలుసుకోవచ్చని నేతలు అనుకున్నారు. కానీ కేంద్ర ఎన్నికల కమిషన్‌ బుధవారం విడుదల చేసిన షెడ్యూల్లో ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో రాజకీయ పార్టీలు కొంత ఊపిరి పీల్చుకున్నాయి. విడతలవారీ పోలింగ్‌ జరిగితే అగ్రనేతల సభలు పెరిగేవి, ప్రస్తుతం ఆ అవకాశం లేకుండాపోయింది.

Updated Date - 2023-03-30T16:39:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising