NCBN Case : చంద్రబాబు కేసులో వాదనలు పూర్తి.. టీడీపీ శ్రేణులు టెన్షన్ పడుతున్నా.. ఇదొక బిగ్ రిలీఫ్!
ABN, First Publish Date - 2023-09-10T15:12:44+05:30
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కేసులో (Chandrababu Case) కస్టడీకి సంబంధించి వాదనలు పూర్తయ్యాయి. స్కిల్ డెవలప్‌మెంట్ (Skill Development Case) కేసులో అటు సీఐడీ.. ఇటు చంద్రబాబు తరఫున లాయర్ల వాదనలను ఏసీబీ కోర్టు విన్నది...
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కేసులో (Chandrababu Case) కస్టడీకి సంబంధించి వాదనలు పూర్తయ్యాయి. స్కిల్ డెవలప్‌మెంట్ (Skill Development Case) కేసులో అటు సీఐడీ.. ఇటు చంద్రబాబు తరఫున లాయర్ల వాదనలను ఏసీబీ కోర్టు విన్నది. ఉదయం నుంచి ఏడున్నర గంటలపాటు ఇరువాదనలు విన్న కోర్టు.. తీర్పు రిజర్వ్‌లో పెట్టింది. మరో గంటలో ఈ కేసులో కీలక తీర్పు వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు.. ఏ క్షణమైనా తీర్పు రావొచ్చని అక్కడున్న పరిస్థితిని బట్టి అర్థమవుతోంది. కోర్టు తీర్పు ఎలా ఉంటుందా..? అనేదానిపై ఇరువర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. చంద్రబాబును రిమాండ్‌కు ఇవ్వాలని సీఐడీ.. అస్సలు ఇవ్వొద్దని, ఇదంతా కుట్రలో భాగమేనని లూథ్రా వాదించారు. మరోవైపు.. ఏసీబీ కోర్టు పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. ఒకవేళ రిమాండ్‌కు ఇస్తే కోర్టు నుంచి నేరుగా రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించడానికి ఆ రూట్లన్నీ పోలీసులు క్లియర్ చేశారు. దీంతో కీలక పరిణామమే చోటుచేసుకునే అవకాశాలే ఉన్నాయని తెలుస్తోంది.
ఏం జరగబోతోంది..?
ఏసీబీ కోర్టు బయట పోలీసులు భారీగా మోహరించడంతో పాటు.. భారీ కాన్వాయ్‌ను ఏర్పాటు చేశారు. దీంతో ఎప్పుడేం జరుగుతుందో అని టీడీపీ శ్రేణులు టెన్షన్ పడుతున్నాయి. ఓ వైపు కోర్టు లోపల వాడివేడిగా వాదనలు.. మరోవైపు కోర్టు బయట కాన్వాయ్, పోలీసుల హడావుడిని చూసిన టీడీపీ శ్రేణులు.. టీవీలకు అతుక్కుపోయిన సామాన్య ప్రజలకు సైతం టెన్షన్ మొదలైంది. అంతా మంచే జరగాలని టీడీపీ శ్రేణులు ప్రార్థనలు చేస్తున్నారు. ఈ కేసులో చంద్రబాబుకు ఎలాంటి రిమాండ్ ఇచ్చే పరిస్థితి లేదని.. తప్పకుండా బెయిల్ వస్తుందని టీడీపీ నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. 409 సెక్షన్ వర్తించదని ఏసీబీ కోర్టు చెప్పడంతో ఇది చంద్రబాబు బిగ్ రిలీఫ్ అనిచెప్పుకోవచ్చు. 2021లో నమోదైన ఈ కేసులో హైకోర్టులో ఇదివరకే వాదనలు పూర్తయిన విషయం తెలిసిందే. అంతేకాదు.. తీర్పు కూడా రిజర్వ్‌తో పాటు ఈ కేసు ఎప్పుడో ముగిసిపోయింది. అయితే ఇప్పుడు ఆ కేసును మళ్లీ రీ ఓపెన్ చేయడంతో ఇదంతా కుట్రపూరితమేనని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
వాదనలు ఇలా..?
ఉదయం కోర్టుకు రాగానే చంద్రబాబు వాంగ్మూలం ఇవ్వడంతో పాటు.. అనుమతి తీసుకొని స్వయంగా వాదనలు కూడా బాబే వినిపించుకున్నారు. అనంతరం ఇరువర్గాల వాదనలు మొదలయ్యాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సీఐడీ తరఫున న్యాయవాది ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి (AAG Ponnavolu Sudhakar Reddy) వాదనలు వినిపించగా.. మధ్యాహ్నం నుంచి చంద్రబాబు తరఫున ప్రముఖ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా (Justice Siddharth Luthra) వాదనలు వినిపించారు. ఈ ఏడున్నర గంటల్లో సుమారు మూడు గంటలు ఏకథాటిగా లూథ్రానే వాదనలు వినిపించారు. ఈ క్రమంలో సీఐడీపై ఏసీబీ కోర్టు జడ్జి ప్రశ్నల వర్షం కురిపించారు. ఆ తర్వాత కేసు కథేంటి..? గవర్నర్ అనుమతి లేనిదే ఎలా అరెస్ట్ చేశారు..? సెక్షన్-409 అంటే ఏంటి..? అసలు సీఐడీకి అరెస్ట్ చేసే విధానం తెలుసా..? ఇలా పలు కేసులను ఉదహరించి మరీ లూథ్రా సుదీర్ఘ వాదనలు వినిపించారు. అంతకుమించి పలు సాంకేతిక ప్రశ్నలు సంధించి.. సీఐడీని చిక్కుల్లోకి నెట్టేలా వాదనలు వినిపించారు. లూథ్రా వాదనలు వినిపిస్తున్నంతసేపు వాతావరణం మొత్తం ఒక్కసారిగా మారిపోయింది.
ఇవి కూడా చదవండి
Luthra On CBN Case : రంగంలోకి దిగిన సిద్ధార్థ లూథ్రా.. లాజిక్ ప్రశ్నలు, సెక్షన్లతో కొట్టిన లాయర్.. అంతా సైలెంట్!
NCBN Arrest : ఏసీబీ కోర్టు వద్ద భారీగా పోలీసు వాహనాలు.. అసలేం జరుగుతోంది..?
Skill Development Case : చంద్రబాబు కేసులో హోరాహోరీగా వాదనలు.. జడ్జి లాజిక్ ప్రశ్నలతో సీఐడీ షాక్..!
CBN Arrest Case : ఏసీబీ కోర్టులో స్వయంగా వాదనలు వినిపించిన చంద్రబాబు.. ఏం చెప్పారంటే..?
NCBN Arrest : FIR లో ఎక్కడా కనిపించని చంద్రబాబు పేరు.. కొద్దిసేపటి క్రితమే..?
Updated Date - 2023-09-10T15:19:59+05:30 IST