ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Janasena : పొత్తులపై చర్చ జరుగుతుండగానే జనసేనకు ఊహించని ఝలక్.. గుడ్ బై చెప్పిన కీలక నేత.. ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్..

ABN, First Publish Date - 2023-03-22T21:33:09+05:30

ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు ఏ ఇద్దరు కలిసినా బీజేపీ-జనసేన పొత్తు (BJP- Janasena Alliance) గురించే చర్చించుకుంటున్నారు. ఇప్పటికే ఆవిర్భావ సభలో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు ఏ ఇద్దరు కలిసినా బీజేపీ-జనసేన పొత్తు (BJP- Janasena Alliance) గురించే చర్చించుకుంటున్నారు. ఇప్పటికే ఆవిర్భావ సభలో బీజేపీతో పొత్తుల గురించి జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ (Janasena Chief Pawan Kalyan) కీలక వ్యాఖ్యలు చేయగా.. తాజాగా అసలు పొత్తే లేదన్నట్లుగా కటీఫ్ అయిపోయిందని బీజేపీ కీలక నేత మాధవ్ (BJP Leader Madhav) తేల్చి చెప్పేశారు. స్వతహాగానే ఏపీలో పార్టీని (AP BJP) బలోపేతం చేయడానికి నేతలంతా కృషి చేస్తామని చెప్పారు. దీనిపై ఇంతవరకూ సేనాని స్పందిచకపోగా.. టీడీపీకి (Telugudesam) దగ్గరవుతున్నట్లు వార్తలు మాత్రం గుప్పుమంటున్నాయి. సరిగ్గా ఇదే సమయంలో జనసేనకు (Janasena) ఊహించని షాక్ తగిలింది. కీలక నేత ఒకరు జనసేనకు గుడ్ బై చెప్పేశారు. తన ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన ఆయన.. బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. పొత్తుల గురించి ఇంకా చర్చ జరుగుతుండగానే ఆయన జనసేనను వీడి బీజేపీ తీర్థం పుచ్చుకోవడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యింది.

ఇంతకీ ఆ కీలక నేత ఎవరు..?

ఆకుల కిరణ్ కుమార్.. ఈయన జనసేనలో కీలక నేతగా (Janasena Leader Akula Kiran Kumar) వ్యవహరిస్తూ వస్తున్నారు. విజయవాడకు చెందిన ఈయన ఉన్నత చదువులు చదువుకున్నారు. పార్టీ తరఫున.. సమాజంలో ఏదైనా విషయంపైన మాట్లాడాలన్నా సబ్జక్ట్‌తో మాట్లాడుతుంటారు. ముఖ్యంగా.. మీడియా సమావేశాల్లో, టీవీ డిబెట్స్‌లో జనసేన తరఫున తన స్వరం వినిపిస్తూ ఎప్పుడూ వార్తల్లో నిలిచేవారు. జనసేనలో ఒకరిద్దరి తర్వాత ఇంతటి వాగ్ధాటి ఉన్న నేత లేరనే చెప్పుకోవాలి. అలా ఈయన కీలక నేతగా ఎదిగారు. ముఖ్యంగా టీవీ డిబెట్స్‌లో పాల్గొన్నారంటే అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలకు ఓ రేంజ్‌లో కౌంటర్లు ఉంటాయని జనసేన శ్రేణులు చెప్పుకుంటూ ఉంటాయి. పార్టీకోసం ఇంతలా పనిచేస్తున్న కిరణ్.. సడన్‌గా బుధవారం నాడు జనసేనకు గుడ్ బై చెప్పేశారు. పోనీ అధికార, ప్రతిపక్ష పార్టీలను కాదని.. బీజేపీ తీర్థం పుచ్చుకోవడంతో ఈ చేరికపైనే రాజకీయంగా చర్చ నడుస్తోంది. బుధవారం నాడు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఉగాది పంచాంగ శ్రవణ కార్యక్రమం రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు (AP BJP Chief Somu Veerraju) ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలోనే సోమువీర్రాజు సమక్షంలో ఆకుల కిరణ్ కుమార్ కాషాయ కండువా కప్పుకున్నారు. కిరణ్‌కు కండువా కప్పిన సోము.. సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. కాగా.. పొత్తులపై మాధవ్ చేసిన వ్యాఖ్యలను సోము వీర్రాజు ఇవాళ కూడా ఖండించారు. బీజేపీ-జనసేన విడిపోవని పరోక్షంగా వీర్రాజు చెప్పకనే చెప్పేశారు. ఇలాంటి పరిస్థితుల్లో జనసేనకు కిరణ్ రాజీనామా చేయడం గమనార్హం.

పార్టీని ఎందుకు వీడారు..?

జనసేనను వీడటానికి కిరణ్ చాలా కారణాలు చెబుతున్నారు. పార్టీలో కొంత మంది నాయకులు ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారని.. వారు తీరు నచ్చకే రాజీనామా చేయాల్సి వచ్చిందని చెబుతున్నారు. ఈయన రాజీనామాకు జనసేనకు బిగ్ షాకేనని కార్యకర్తలు చెప్పుకుంటూ ఉన్నారు. జనసేన ఆవిర్భావ సభ వరకూ ఈయన పార్టీలో చాలా కీలకంగా వ్యవహరించారు. మీడియా ముందుకు వచ్చినా.. ఇంటర్వ్యూల్లో ఏ విషయంపై అయినా సరే కిరణ్ చాలా నిశితంగా మాట్లాడే వ్యక్తని పవన్ వీరాభిమానులు చెబుతున్నారు. పార్టీలో అసలు లోపం ఎక్కడుందో దానిపై అధినేత దృష్టి పెడితే తప్ప.. రాజీనామాలు ఆగేలా లేవని మరికొందరు నేతలు చెబుతున్నారు.

మొత్తానికి చూస్తే.. జనసేన-బీజేపీ కటీఫ్ దాదాపు అయిపోయిందనుకున్న టైమ్‌లో ఇలా రాజీనామాలు, అటు బీజేపీలోకే చేరికలు మాత్రం పవన్‌కు ఊహించని రీతిలో షాకులేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇకనైనా పవన్ స్పందించి.. పార్టీలో లోటు పాట్లు ఎక్కడున్నాయో.. కిరణ్ చెబుతున్నట్లుగా ఆ ఒకరిద్దరు నేతలను మార్చే ప్రయత్నం పవన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పవన్ మార్పులు, చేర్పులు చేసి పార్టీని గాడిన పెడతారో లేకుంటే నేతలు వస్తుంటారు.. పోతుంటారని దీన్ని తేలిగ్గా తీసుకుంటారో వేచి చూడాలి మరి.

******************************

ఇవి కూడా చదవండి..

******************************

Janasena : పవన్ పదే పదే ‘కాపు’ ప్రస్తావన తేవడం వెనుక పెద్ద మాస్టర్ ప్లానే ఉందిగా.. ఇదేగానీ వర్కవుట్ అయితే..!


******************************

BRS MLC Kavitha : కేసీఆర్‌తో కీలక భేటీ తర్వాత నేరుగా ఇంటికెళ్లిన కవిత.. ఏం చేశారంటే.. హ్యాపీగా ఫీలవుతున్న బీఆర్ఎస్ శ్రేణులు..

******************************

AP MLC Elections : మరికొన్ని గంటల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్.. అదే జరిగితే వైసీపీ పతనానికి కౌంట్‌డౌన్‌ స్టార్టయినట్లే..!

******************************

BRS MLC Kavitha : ఢిల్లీ నుంచి నేరుగా ప్రగతి భవన్‌కు కవిత.. సీఎం కేసీఆర్‌తో కీలక భేటీ.. ఏమేం చర్చిస్తున్నారంటే..!

******************************

MLC Kavitha ED Enquiry : కవిత మీడియాకు చూపించిన మొబైల్ ఫోన్లను కాస్త జూమ్ చేస్తే...!!


******************************

Updated Date - 2023-03-22T21:44:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising