BRS First List Live Updates : 115 స్థానాలకు అభ్యర్థుల ప్రకటన.. రెండు చోట్ల నుంచి కేసీఆర్ పోటీ
ABN, First Publish Date - 2023-08-21T14:06:34+05:30
పంచమి తిథి కావడం, పైగా శుభ ముహూర్తం కూడా ఉండటంతో ఎంత మంది సిట్టింగులు అసంతృప్తి చెందినా.. ఆశావహులకు భంగం కలిగినప్పటికీ ఎట్టి పరిస్థితుల్లో ప్రకటన చేయాల్సిందేనని కేసీఆర్ ఫిక్స్ అయ్యారు..
కమ్యూనిస్టుల దారెటు? (03:45PM)
సీపీఎం, సీపీఐ అడిగిన సీట్లలోనూ బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్
మునుగోడు, పాలేరు, బెల్లంపల్లి, కొత్తగూడెం, హుస్నాబాద్ సీట్లను పొత్తులో భాగంగా ఆశించిన కమ్యూనిస్టులు
వామపక్షాలు ఆశించిన స్థానాల్లో సిట్టింగ్‌లకే సీట్లు ఇచ్చిన కేసీఆర్
దీంతో బీఆర్ఎస్, కమ్యూనిస్టుల పొత్తుపై సందిగ్ధత
ప్రస్తుతం కొత్తగూడెంలో కూనంనేని సాంబశివరావు, ఖమ్మంలో ఉన్న తమ్మినేని వీరభద్రం
ఆంధ్రజ్యోతిపై కేసీఆర్ అక్కసు (03:40PM)
మా మీద విషం చిమ్మే పత్రికల జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వం
అది మా విధానం అంటూ ఆంధ్రజ్యోతి పత్రికపై కేసీఆర్ అక్కసు
రుణమాఫీపై రాసిన పత్రిక మొహం ఎక్కడ పెట్టుకుంటుంది
రాష్ట్రంలో కొన్ని కుల పత్రికలు, కొన్ని గుల పత్రికలు ఉన్నవి : కేసీఆర్
మైనంపల్లీ.. నీ ఇష్టం..! (03:25PM)
మైనంపల్లి పోటీ చేయడం, చేయకపోవడం ఆయన ఇష్టం : కేసీఆర్
ఇవాళ ఉదయం టికెట్ల విషయమై తీవ్ర వ్యాఖ్యలు చేసిన మైనంపల్లి
హరీష్ రావు గతం గుర్తించుకో..
నీ నియోజకవర్గంని వదిలి మా జిల్లాలో పెత్తనం ఏంటి..?
హరీష్ రావు బట్టలు ఊడతీసే వరకు నిద్రపోను : మైనంపల్లి
అక్రమంగా రూ. లక్ష కోట్లు సంపాదించాడని మైనంపల్లి ఆరోపణ
సిద్దిపేటలో హరీష్ రావు అడ్రస్ గల్లంతు చేస్తాను : మైనంపల్లి
మెదక్‌లో నా కుమారుడు.. మల్కాజ్‌గిరిలో నేను పోటీ చేస్తాం : మైనంపల్లి
మెదక్‌లో నా కుమారుడిని గెలిపించుకుంటాం.. : మైనంపల్లి
సీట్లు కోల్పోయింది వీరే.. (03:20 PM)
ఆసిఫాబాద్ - ఆత్రం సక్కు
ఖానాపూర్ - అజ్మీరా రేఖా నాయక్
స్టేషన్ ఘన్‌పూర్ - రాజయ్య
ఉప్పల్ - బేతి సుభాష్ రెడ్డి
వైరా - లావుడ్యా రాములు నాయక్
కోరుట్ల - కల్వకుంట్ల విద్యాసాగర్ రావు
వేములవాడ - రమేష్ చెన్నమనేని
కామారెడ్డి - గంప గోవర్ధన్
బోథ్ - రాథోడ్ బాపూరావు
ఉన్నట్టుండి బాంబ్ పేల్చిన కేసీఆర్ (03:15 PM)
115 మందితో జాబితా ప్రకటించినా ఊహించని ట్విస్ట్ ఇచ్చిన కేసీఆర్
పరిస్థితులను బట్టి అభ్యర్థులను మార్చే అవకాశం ఉంటుందన్న కేసీఆర్
అభ్యర్థుల గుండెల్లో పిడుగు పేల్చిన గులాబీ బాస్
ఎమ్మెల్యే అభ్యర్థుల్లో కొత్త ముఖాలు.. (03:11 PM)
ఆసిఫాబాద్ : కోవా లక్ష్మి
ఖానాపూర్ : భూఖ్య జాన్సన్ రాథోడ్ నాయక్
స్టేషన్ ఘన్‌పూర్ : కడియం శ్రీహరి
ఉప్పల్ : బండారి లక్ష్మారెడ్డి
వైరా : బానోతు మదన్‌లాల్
కోరుట్ల - డా. సంజయ్ కల్వకుంట్ల
పంతం నెగ్గించుకున్న కేటీఆర్ (03:07 PM)
ఫ్రెండ్ విషయంలో కేసీఆర్ దగ్గర పంతం నెగ్గించుకున్న కేటీఆర్
కోరుట్ల టికెట్ తన స్నేహితుడు సంజయ్‌కు ఇప్పించుకున్న కేటీఆర్
చివరి క్షణం వరకు విద్యాసాగర్ రావు వైపే మొగ్గు చూపిన కేసీఆర్
పెండింగ్ స్థానాలు ఇవే..
01. జనగామ
02. నాంపల్లి
03. నర్సాపూర్
04. గోషామహల్
ఫుల్ లిస్ట్ ఇదిగో..
కేసీఆర్ రూటు మారింది..! (02:49PM)
గజ్వేల్‌తో పాటు కామారెడ్డిలోనూ కేసీఆర్ పోటీ
7 బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాల్లో ఎమ్మెల్యే అభ్యర్థుల మార్పులు
సారొచ్చేశారు! (02:45PM)
ప్రగతి భవన్ చేరుకున్న సీఎం కేసీఆర్
తొలి జాబితా ప్రకటిస్తున్న గులాబీ బాస్
ఆరుగురికి హ్యాండిచ్చిన కేసీఆర్! (02:40 PM)
ఒకేసారి 105 మంది అభ్యర్థులతో తొలి జాబితా
ఆరుగురు సిట్టింగ్‌లకు సీట్లు లేవని టాక్
పెండింగ్
5-6 సీట్లు పెండింగ్‌లో ఉంటాయంటున్న బీఆర్ఎస్ వర్గాలు
తొలి జాబితాలో 5-6 కొత్త ముఖాలు
105 మందితో తొలి జాబితా..! (02:35 PM)
తొలి జాబితాలో 105 అభ్యర్థుల పేర్లు!
కాసేపట్లో సీఎం కేసీఆర్ ప్రెస్‌మీట్
ప్రగతి భవన్‌కు బయల్దేరిన గులాబీ బాస్
ముందుగా అనుకున్న 02:30 సమయం కూడా మించి పోవడంతో అభ్యర్థులు, ఆశావాహుల్లో పెరిగిపోయిన టెన్షన్
జాబితాలో జాతకాలు..! (02:33 PM)
కాసేపట్లో బీఆర్ఎస్ తొలి జాబితా విడుదల
జాబితాపై బీఆర్ఎస్ నేతల్లో నరాలు తెగే ఉత్కంఠ
ప్రగతి భవన్‌కు క్యూ కట్టిన బీఆర్ఎస్ నేతలు
అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలకు ప్రగతి భవన్ నుంచి పిలుపు
చివరి వరకూ ఆశవాహుల ప్రయత్నాలు
టికెట్ రాలేదని తేలడంతో వీధికెక్కుతున్న కొందరు నేతలు
మరోవైపు తెలంగాణ భవన్‌కు చేరుకుంటున్న మంత్రులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు
ప్రకటనకు వేళాయే.. (2:20 PM)
బీఆర్ఎస్ (BRS) సిట్టింగులు, ఆశావహులు ఎంతగానో వేచి చూస్తున్న తొలి అభ్యర్థులకు (BRS First List) సమయం ఆసన్నమైంది. ముందుగా అనుకున్నట్లే 02:20 నిమిషాలకు సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌కు చేరుకోనున్నారు. పంచమి తిథి కావడం, పైగా శుభ ముహూర్తం కూడా ఉండటంతో ఎంత మంది సిట్టింగులు అసంతృప్తి చెందినా.. ఆశావహులకు భంగం కలిగినప్పటికీ ఎట్టి పరిస్థితుల్లో ప్రకటన చేయాల్సిందేనని కేసీఆర్ ఫిక్స్ అయ్యారు. సరిగ్గా 02:30 గంటలకు ప్రగతి భవన్ వేదికగా అభ్యర్థుల జాబితాను కేసీఆర్ చదవడం మొదలుపెట్టనున్నారు. 02:30 గంటల నుంచి 03:00 గంటలకు వరకు అభ్యర్థుల ప్రకటన ఉండనుంది.
వన్ అండ్ ఓన్లీ..!
ఇప్పటి వరకూ మొదటి జాబితాలో 80 నుంచి 87 మంది అభ్యర్థుల పేర్లు ఉంటాయని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే చివరి నిమిషంలో కేసీఆర్ మనసు మార్చుకున్నారట. దీంతో మొత్తం సీన్ మారిపోయిందని విశ్వసనీయ వర్గాల సమాచారం. తొలి జాబితా, రెండో జాబితా, మలి జాబితా అని కాకుండా ఒకేసారి.. ఏకంగా 116 మంది పేర్లను ఒకేసారి ప్రకటించబోతున్నారని తెలుస్తోంది. ప్రతిపక్షాలకు ఊహకందని రీతిలో ఇలా ప్రకటన చేయబోతున్నారని బీఆర్ఎస్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. కేవలం 3 నియోజకవర్గాల్లో పేర్లను పెండింగ్‌లో పెట్టబోతున్నారని తెలుస్తోంది. ఆ మూడు నియోజకవర్గాలు.. ఉమ్మడి ఖమ్మంలోని రెండు, ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒకటి అని తెలిసింది. ఈ మూడు వామపక్షాలకు పొత్తులో భాగంగా ప్రకటించే అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలియవచ్చింది. సమాలోచనలు చేసిన తర్వాత అధికారికంగా ఈ మూడు స్థానాలపై ప్రకటన ఉంటుందని సమాచారం.
ఇవి కూడా చదవండి
BRS First List : ఒకటే జాబితా.. ఒకేసారి 116 మంది అభ్యర్థులను ప్రకటించనున్న కేసీఆర్..!
BRS MLA Tickets : ప్చ్.. అభ్యర్థుల ప్రకటనకు మళ్లీ టైమ్ మార్చేసిన కేసీఆర్..!
BRS First List : బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటనకు ముందు కీలక పరిణామం.. నరాలు తెగే ఉత్కంఠ!
BRS First List : ఆ ఒక్కరికి తప్ప.. కాంగ్రెస్ నుంచి కారెక్కిన ఎమ్మెల్యేలందరికీ నో టికెట్..!?
Big Breaking : 10 మంది సిట్టింగ్‌లకు షాకిచ్చేసిన కేసీఆర్.. ఆ నియోజకవర్గాలు ఇవే..
TS Politics : గులాబీ బాస్ మాస్టర్ ప్లాన్.. అసెంబ్లీ బరిలో గుమ్మడి నర్సయ్య కుమార్తె..!?
BRS MLAs List : రెండుసార్లు గెలిచిన మహిళా ఎమ్మెల్యేకు ‘నో’.. కేటీఆర్ ఫ్రెండ్‌కు జై కొట్టిన కేసీఆర్!?
TS Assembly Elections 2023 : సీఎం కేసీఆర్‌తో భేటీ ముగిసిన నిమిషాల్లోనే ఎమ్మెల్యే ఫోన్ స్విచాఫ్.. ఏం జరిగిందా అని ఆరాతీస్తే..!
Updated Date - 2023-08-21T15:44:44+05:30 IST