KCR BRS: సొంత జిల్లాలోనే కేసీఆర్‌కు షాక్... బీజేపీలోకి సిట్టింగ్ ఎమ్మెల్యే?
ABN, First Publish Date - 2023-05-09T16:27:35+05:30
ఉమ్మడి మెదక్‌లో (Medak) సీనియర్ నేతగా, ఎమ్మెల్యేగా, ఉద్యమం నుండి నడుస్తున్న సదరు మహిళా ఎమ్మెల్యే తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు అన్నది ఓపెన్ సీక్రెట్. జిల్లా మంత్రితో సత్సంబంధాలు కంటిన్యూ అవుతున్నా... అధిష్టానంతో వచ్చిన గ్యాప్‌తో తనకు టికెట్ దక్కదన్న నిర్ణయానికి సదరు ఎమ్మెల్యే వచ్చినట్లు తెలుస్తోంది...
సొంత జిల్లాలోనే సీఎం కేసీఆర్‌కు (CM KCR) బిగ్ షాక్ తగలనుందా...? సీటు దక్కదన్న భయంతోనే సిట్టింగ్ ఎమ్మెల్యే ఒకరు బీజేపీ (BJP) గూటికి చేరబోతున్నారా...? నియోజకవర్గంలో గొడవలకు కేసీఆర్ అండ్ కో కారణమన్న భావనతోనే పార్టీని వీడబోతున్నారా...? సదరు ఎమ్మెల్యే భర్త అమిత్ షాతో భేటీ అందుకేనా?.. ఈ ప్రశ్నలకు అవును అనే సమాధానం వస్తోంది. ఉమ్మడి మెదక్‌లో (Medak) సీనియర్ నేతగా, ఎమ్మెల్యేగా, ఉద్యమం నుండి నడుస్తున్న సదరు మహిళా ఎమ్మెల్యే తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు అన్నది ఓపెన్ సీక్రెట్. జిల్లా మంత్రితో సత్సంబంధాలు కంటిన్యూ అవుతున్నా... అధిష్టానంతో వచ్చిన గ్యాప్‌తో తనకు టికెట్ దక్కదన్న నిర్ణయానికి సదరు ఎమ్మెల్యే వచ్చినట్లు తెలుస్తోంది.
ప్రగతి భవన్ డైరెక్షన్‌లోనే కేసీఆర్ సామాజిక వర్గానికి చెందిన ఓ గ్రేటర్ ఎమ్మెల్యే కొడుకు తన నియోజకవర్గంలో పనిచేసుకుంటున్నా పార్టీ పట్టించుకోవటం లేదని, సీఎంతో సన్నిహితంగా ఉండే ఓ ఎమ్మెల్సీ కూడా తనకంటూ ఓ గ్రూపు ఏర్పాటు చేసుకొని పనిచేస్తున్నా అడగటం లేదని... తనకు వ్యతిరేకంగా తన నియోజకవర్గంలోనే రెండు గ్రూపులు ఏర్పాటయ్యేలా చేశారని సదరు ఎమ్మెల్యే, ఎమ్మెల్యే భర్త ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. తమ ఇబ్బందిని పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లినా లాభం లేకుండా పోయిందని సదరు నేతలు సన్నిహితుల వద్ద చాలా కాలంగా వాపోతున్నారన్న ప్రచారం ఉంది.
ఇటీవల హుజురాబాద్ నియోజకవర్గ సమస్యను పరిష్కరించిన పార్టీ, అందరినీ కూర్చోబెట్టి మాట్లాడిందని... కొల్లాపూర్‌లో అయితే మాజీ మంత్రి అని కూడా చూడకుండా పార్టీ నుండి పంపించి సిట్టింగ్ ఎమ్మెల్యేకు అండగా ఉందని, ఇటు ఖమ్మంలోనూ అసమ్మతిని ప్రోత్సహించలేదని... కానీ తన నియోజకవర్గంలో మాత్రం చూసీ చూడనట్లు వ్యవహరించటం అనేక అనుమానాలకు తావిస్తున్నట్లు సదరు లీడర్లు భావిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో తమకు టికెట్ ఇచ్చే ఉద్దేశం లేకనే... ఇతర లీడర్లను ప్రోత్సహిస్తున్నారన్న అనుమానాలు కూడా సదరు లీడర్ వర్గంలో వినిపిస్తున్నాయి.
అదే సమయంలో బీజేపీ నుండి ఆఫర్ కూడా రావటంతో ఎమ్మెల్యే భర్త కొన్ని రోజుల క్రితం ఢిల్లీలో హోంమంత్రి అమిత్ షా ను కలిశారని, పార్టీ అండగా ఉండటంతో పాటు టికెట్ సహ పలు ఆర్థికపరమైన అంశాలపై రాష్ట్ర నాయకత్వం ఇప్పటికే ఓ హామీ కూడా ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.
Updated Date - 2023-05-09T16:27:35+05:30 IST