ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chandrababu Case : చంద్రబాబు కేసులో లూథ్రా, సాల్వే ఎలా వాదించారో చూడండి..!

ABN, First Publish Date - 2023-09-19T14:54:15+05:30

టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబుపై (Chandrababu) ఏపీ ప్రభుత్వం (AP Govt) బనాయించిన స్కిల్ డెవలప్మెంట్ అక్రమ కేసులో క్వాష్ పిటిషన్‌పై (Quash Petition) ఇవాళ ఏపీ హైకోర్టులో (AP High Court) విచారణ జరిగింది..

టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబుపై (Chandrababu) ఏపీ ప్రభుత్వం (AP Govt) బనాయించిన స్కిల్ డెవలప్మెంట్ అక్రమ కేసులో క్వాష్ పిటిషన్‌పై (Quash Petition) ఇవాళ ఏపీ హైకోర్టులో (AP High Court) విచారణ జరిగింది. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు ప్రముఖ న్యాయమూర్తులు సిద్ధార్థ లూథ్రా (Siddarth Luthra), హరీష్ సాల్వేలు (Harish Salve) వాదించారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి కాస్త అటు ఇటు 2 గంటల వరకూ ఈ ఇద్దరూ వాదనలు వినిపించారు. ఓ వైపు సాల్వే, మరోవైపు లూథ్రా ఇద్దరూ పలు లాజిక్‌లు, పాతకేసులు ఉదహరించి మరీ న్యాయమూర్తికి వివరంగా వాదనలు వినిపించారు. ఈ ఇద్దరూ ఏం వాదించారు..? ఎలా వాదించారు..? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.


సాల్వే ఏం వాదించారు..?

  • వర్చువల్‍గా వాదనలు వినిపించిన హరీష్ సాల్వే

  • చంద్రబాబు అరెస్టులో సరైన నియామవళి పాటించలేదు

  • చంద్రబాబు అరెస్టుపై గవర్నర్ అనుమతి తీసుకోలేదు

  • ప్రీవెన్షన్‌ ఆఫ్‌ కరప్షన్‌ యాక్ట్‌ సెక్షన్‌ 17A ప్రకారం అరెస్ట్‌ చూపించారు

  • దీని ప్రకారం పోలీసులు గవర్నర్‌ అనుమతి తర్వాతే అరెస్ట్‌ చేయాలి

  • ప్రజాప్రతినిధుల అరెస్టుపై గత తీర్పులు అనేకం ఉన్నాయి

  • 2020లో నమోదైన ఎఫ్ఐఆర్‌లో చంద్రబాబును ఎలా అరెస్ట్ చేస్తారు..?

  • అరెస్ట్ చేసే సమయానికి చంద్రబాబుపై ఎఫ్ఐఆర్ లేదు

  • ఎఫ్ఐఆర్ నమోదయ్యాకే అరెస్ట్ చేయాలి

  • చంద్రబాబు అరెస్ట్ 2024 ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే చేశారు

  • ఇదంతా Regime Revenge గా ఉంది

  • సీమెన్స్‌ కంపెనీ రాసిన మెయిల్‌ ఆధారంగా APSSDC ఛైర్మన్‌ ఫిర్యాదు చేశారు

  • స్కిల్‌ డెవలప్‌మెంట్‌లో సేవలందించింది సీమెన్స్‌కు చెందిన ఉప కంపెనీనే

  • ప్రభుత్వం బాధ్యత నిధులు విడుదల చేయడం, సేవలు పొందడం

  • CID ఆరోపించినట్టు ఎక్కడా సాక్ష్యాలను తారుమారు చేయలేదు

  • ఈ కేసులో చంద్రబాబు సహకరిస్తున్నా.. అరెస్ట్‌కు తొందరపడ్డారు

  • రాష్ట్ర ప్రభుత్వం తన అధికారాన్ని పరిధి దాటి వాడిన సమయంలో కోర్టులు జోక్యం చేసుకోవచ్చు

  • ఇది కేవలం GST కేసు మాత్రమే.. ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు

  • అర్ణబ్ గోస్వామి కేసులో కోర్టు తీర్పును ఉదహరించిన సాల్వే

  • స్టేట్ ఆఫ్ రాజస్థాన్ వర్సెస్ తేజ్‍మాల్ చౌదరి కేసును ప్రస్తావించిన సాల్వే

లూథ్రా ఎలా వాదించారు..?

  • చంద్రబాబును అరెస్ట్‌ చేసిన తీరుపై అభ్యంతరాలున్నాయి

  • ఒక వేళ ఈ FIR 2018 సవరణ కంటే ముందు నమోదై ఉంటే అడిగేవాళ్లం కాదు

  • కానీ FIR 2020లో నమోదయింది కాబట్టి అరెస్ట్‌ చేయాలంటే గవర్నర్‌ అనుమతి తప్పనిసరి

  • అవినీతి నిరోధక చట్టం క్రింద ప్రజాప్రతినిధిపై కేసు నమోదు చేసే సమయంలో గవర్నర్ అనుమతి తప్పనిసరి

  • 2020లో అచ్చెన్నాయుడును అరెస్ట్‌ చేసినప్పుడు ఇలాగే జరిగింది

  • కర్ణాటక కేసును ఉదహరించిన లూథ్రా, 17Aలో ముందస్తు అనుమతి అవసరమని లూథ్రా వాదన

ఇలా వాదనలు విన్న తర్వాత మధ్యాహ్నం భోజనానికి కోర్టు విరామం ఇచ్చింది. ఇప్పటికైతే క్వాష్ పిటిషన్‌పై చంద్రబాబు తరపు వాదనలు పూర్తయ్యాయి. తిరిగి కోర్టు ప్రారంభం తర్వాత సీఐడీ తరఫు వాదనలను న్యాయమూర్తి వింటారు. ప్రస్తుతం హైకోర్టులో సీఐడీ తరపున ముకుల్‌ రోహత్గీ వాదనలను న్యాయమూర్తికి వినిపిస్తున్నారు. సెక్షన్‌-17Aపై వాదనలు జరుగుతున్నాయి. ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత పరిశీలనకు సమయం పట్టనుంది. అనంతరం తీర్పు వెలువడనున్నది. అయితే తీర్పు ఇవాళ వచ్చే అవకాశాలు కనిపించట్లేదు. ఏం జరుగుతుందో చూడాలి మరి.

Verdict On CBN Cases : చంద్రబాబు పిటిషన్లపై విచారణలో ఏం జరిగింది.. తీర్పు ఎప్పుడు.. లాజిక్ పట్టిన సాల్వే..!?

Updated Date - 2023-09-19T14:54:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising