ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Telugu Desam Party: చంద్రబాబు కేసులో నెక్ట్స్ ఏంటి? టీడీపీ నేతలు ఏం చేయబోతున్నారు?

ABN, First Publish Date - 2023-09-22T16:29:22+05:30

సీఐడీ కస్టడీ పిటిషన్‌పై ఏసీబీ కోర్టు తీర్పు వెల్లడించిన నేపథ్యంలో జడ్జిమెంట్ కాపీలను పరిశీలించి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసే యోచనలో చంద్రబాబు తరఫు న్యాయవాదులు ఉన్నట్లు తెలుస్తోంది.

టీడీపీ అధినేత చంద్రబాబు అభ్యర్థన, ఆక్రోశాన్ని విజయవాడ ఏసీబీ కోర్టు పరిగణనలోకి తీసుకున్నట్లు కనిపించడం లేదు. దీంతో సీఐడీ తరఫు లాయర్ల వాదనలతో ఏకీభవించి చంద్రబాబుకు రిమాండ్ పొడిగించడంతో పాటు రెండురోజుల కస్టడీని విధించింది. ఈ తీర్పుపై టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వైసీపీ నేతలు పక్కా వ్యూహంతోనే చంద్రబాబు కేసులో ముందుకెళ్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను కూడా ఏపీ హైకోర్టు కొట్టివేసింది. ఈ నేపథ్యంలో టీడీపీ నేతల నెక్ట్స్ స్టెప్ ఏంటనే ప్రశ్నలు సామాన్యుల మదిలో ఉత్పన్నం అవుతున్నాయి. అయితే హైకోర్టు ఉత్తర్వులను టీడీపీ నేతలు సుప్రీంకోర్టులో సవాల్ చేయనున్నట్లు తెలుస్తోంది.

సీఐడీ కస్టడీ పిటిషన్‌పై ఏసీబీ కోర్టు తీర్పు వెల్లడించిన నేపథ్యంలో జడ్జిమెంట్ కాపీలను పరిశీలించి శనివారం లేదా సోమవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసే యోచనలో చంద్రబాబు తరఫు న్యాయవాదులు ఉన్నట్లు తెలుస్తోంది. అటు చంద్రబాబు క్వాష్ పిటిషన్ డిస్మిస్‌ను సుప్రీంకోర్టులో టీడీపీ సవాల్ చేయనుంది. ఈ మేరకు దేశ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ వేసేందుకు టీడీపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ అంశంపై ఢిల్లీ పర్యటనలో ఉన్న నారా లోకేష్ సహా పలువురు టీడీపీ నేతలు సీనియర్ లాయర్లతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం అందుతోంది. దీంతో ఈరోజు లేదా రేపు సుప్రీంకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఏపీ సర్కారు అక్రమ కేసులను సుప్రీంకోర్టులోనే తేల్చుకోవాలని చంద్రబాబు లాయర్లు నిర్ణయం తీసుకున్నట్లు టీడీపీ వర్గాలు చెప్తున్నాయి.

ఇది కూడా చదవండి: Justice For CBN: టీడీపీ అధినేతకు సంఘీభావం.. సముద్ర తీరంలో చంద్రబాబు సైకత శిల్పం

కాగా చంద్రబాబుపై జగన్‌ ఎన్ని కేసులు పెట్టినా కడిగిన ముత్యంలా బయటకు వస్తారని మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు అభిప్రాయపడ్డారు. గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలో జరుగుతున్న నిరసన దీక్షలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు సీఎం అవుతారనే భయంతోనే స్కిల్ డెవలప్‌మెంట్ కేసును తెరపైకి తీసుకువచ్చారని ఆరోపించారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీ కేడర్‌ను నిరుత్సాహపర్చేందుకు కుట్ర జరుగుతోందని మండిపడ్డారు. జగన్‌ 16 నెలలు జైలు జీవితం గడిపారని.. అప్పటి కేసులను ఇప్పటివరకు విచారణకు రానివ్వడం లేదన్నారు. అవి విచారణకు వస్తే మళ్లీ జైలుకు వెళ్లాల్సి వస్తుందన్నారు. ఎన్ని అవాంతరాలు కల్పించినా టీడీపీ కేడర్ ఎక్కడా నిరుత్సాహపడదని నక్కా ఆనంద్‌బాబు స్పష్టం చేశారు.

Updated Date - 2023-09-22T16:29:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising