YSRCP : అప్పట్లో స్టేజ్‌పై రజిని ఏడవటం.. ఇప్పుడు ముఖ్య నేతల భేటీకి సంబంధమేంటి.. ఎక్కడో తేడా కొడుతోందే..!?
ABN, First Publish Date - 2023-04-14T15:09:35+05:30
ఆ మధ్య రజిని స్టేజ్‌పై సీఎం జగన్ ముందే బోరున ఏడవటానికి ఇప్పుడు ముఖ్య నేతల భేటీకి ఏమైనా సంబంధం ఉందా..? అనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం..
అవును.. రానున్న ఎన్నికల్లో మంత్రి విడదల రజినికి (Vidadala Rajini) చిలకలూరిపేట నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ (Chilakaluripet MLA Ticket) ఇవ్వొద్దు. ఇస్తే మాత్రం తాము సహకరించబోం.. కచ్చితంగా ఓడిస్తాం.. అంతేకాదు తమను కాదని టికెట్ ఇస్తే మాత్రం స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతాం.. ఇందులో ఎటువంటి సందేహాలు అక్కర్లేదు.. ఇవీ నియోజకవర్గ అసమ్మతి నాయకుల నుంచి వచ్చిన మాటలు. చిలకలూరిపేట పక్క నియోజకవర్గ ప్రజలు కూడా తమ మండలాన్ని రజిని నియోజకవర్గంలో కలిపేయాలని కోరుకుంటున్న వేళ సడన్‌గా ఇలా అసమ్మతి నాయకులు మీడియా ముందుకు రావడంతో పెద్ద సంచలనమే అయ్యింది. రజినిపై ఈ నాయకులకు ఎందుకంత కోపం..? రజినితో వీరికి మధ్య ఎక్కడ విబేధాలు వచ్చాయ్..? టికెట్ ఇవ్వొద్దన్న మాటలు వెనుక ఆంతర్యమేంటి..? ఆ మధ్య రజిని స్టేజ్‌పై సీఎం జగన్ ముందే బోరున ఏడవటానికి ఇప్పుడు ముఖ్య నేతల భేటీకి ఏమైనా సంబంధం ఉందా..? అనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం..
అసలేం జరిగిందంటే..!
2019 ఎన్నికలకు ముందు టీడీపీకి (Telugudesam) గుడ్ బై చెప్పిన విడదల రజిని.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) సమక్షంలో వైసీపీ (YSR Congress) తీర్థం పుచ్చుకున్నారు. ఆర్థికంగా, యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉండటంతో.. ఆ నియోజకవర్గంలో సీనియర్ నేతగా ఉన్న, వైఎస్ ఫ్యామిలీకి (YS Family) నమ్మినబంటుగా ఉన్న మర్రి రాజశేఖర్‌ను (Marri Rajasekhar) పక్కనపెట్టి మరీ రజినికి ఎమ్మెల్యే టికెట్ కట్టబెట్టారు వైఎస్ జగన్. అంతేకాదు.. రెండోసారి మంత్రివర్గ విస్తరణలో కీలక శాఖ అయిన వైద్య ఆరోగ్య శాఖకు (Health, Family Welfare & Medical Education) మంత్రిని కూడా చేశారు జగన్. అయితే నాడు టికెట్ ఇవ్వలేకపోవడంతో ఈ మధ్యే మర్రి రాజశేఖర్‌కు (Marri Rajasekhar) ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిలిపి వైసీపీ గెలిపించుకుంది. త్వరలోనే ఆయనకు మంత్రి పదవి దక్కుతుందని వార్తలు వస్తున్నాయ్.. ఇందులో నిజానిజాలెంత అనేది ఇక్కడ అప్రస్తుతం. రానున్న ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి ఎవరికి ఎమ్మెల్యే టికెట్ దక్కుతుందో అని చిలకలూరిపేట వైసీపీ కార్యకర్తలు, జగన్ వీరాభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. సరిగ్గా ఇదే సమయంలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు మండలాల ముఖ్య నేతలు.. రజినిపై తమ అసంతృప్తిని వెళ్లగక్కారు. అంతేకాదు.. పల్నాడు జిల్లా ప్రాంతీయ సమన్వయకర్త, రాజ్యసభ ఎంపీ బీద మస్తాన్‌రావును (Beeda Masthan Rao) ఈ అసమ్మతి వర్గం ఓ హోటల్‌లో కలిసి.. మంత్రిపై ఫిర్యాదు కూడా చేశారు. రానున్న ఎన్నికల్లో రజినికి టికెట్ ఇస్తే తాము సహకరించబోమని తేల్చి చెప్పేశారు. కచ్చితంగా చిలకలూరిపేట అభ్యర్థిని మార్చాల్సిందేనని అసమ్మతివర్గం పట్టుబట్టింది. ఎంపీని కలిసిన వారిలో నాదెండ్ల మాజీ ఎంపీపీ కంజుల వీరారెడ్డి, గొంటు శ్రీనివాసరెడ్డి, చల్లా యఘ్నేశ్వరరెడ్డి, కోవెలమూడి సాంబశివరావు, గంటా హరికృష్ణ, జాలాది సుబ్బారావుతో పాటు పలువురు నేతలు కూడా ఉన్నారు. వీరంతా.. చిలకలూరిపేట టౌన్, నాదెండ్ల, యడ్లపాడు మండలాలకు చెందిన నేతలు. వీరితో సుమారు అరగంటకుపైగా భేటీ అయిన ఎంపీ.. సమస్యలు ఉంటే మాట్లాడి సర్దుబాటు చేసుకుందామని.. మంత్రితో మాట్లాడుతానని ఇంతకుమించి వేరే ఆలోచన పెట్టుకోవద్దని నేతలకు హామీ ఇచ్చినట్లు సమాచారం.
కారణం ఇదే..!
విడదల రజినికి మంత్రి పదవి వచ్చిన తర్వాత ఏకపక్ష నిర్ణయాలు ఎక్కువయ్యాయని సొంత పార్టీ నేతల నుంచే ఆరోపణలు వెల్లువెత్తిన సందర్భాలు చాలానే ఉన్నాయి. నియోజకవర్గ స్థాయిలో జరిగే ముఖ్య నాయకుల సమావేశానికి కనీసం మండలాల కీలకంగా వ్యవహరించే నేతలకు ఎలాంటి సమాచారం ఇవ్వట్లేదని అసమ్మతి వర్గం ఆరోపిస్తోంది. ఇలా ఈ మూడు మండల్లాలోనే కాదు దాదాపు నియోజకవర్గం మొత్తమ్మీద ఇవే పరిస్థితులున్నాయని ఇన్‌సైడ్ టాక్ నడుస్తోంది. ఎన్నికలకు ముందే పరిస్థితులు ఇలా ఉంటే.. ఎన్నికల సీజన్‌కు ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈ అసమ్మతి వర్గం ఇంత కరాఖండిగా టికెట్ ఇవ్వొద్దని చెబుతుండటంతో అసలు గ్రౌండ్ లెవల్‌లో ఏం జరుగుతోంది..? రజిని గ్రాఫ్ ఎలా ఉందనే దానిపై అధిష్ఠానం సైతం ఓ కన్నేసిందట. మొత్తమ్మీద మంత్రి పదవి దక్కక ముందు.. ఆ తర్వాత రజిని రేంజ్ మారిపోయిందనే మాట సొంత పార్టీ నేతలే చెబుతున్న పరిస్థితి. సీనియర్ నేత మర్రి రాజశేఖర్‌తో ఈమెకు పడట్లేదనే టాక్ అప్పట్లో నడిచింది. ఇక నరసారావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలుతోనూ విబేధాలున్నాయి. ఇప్పుడు కొత్తగా కింది స్థాయి నేతలు కూడా ఇలా గుర్రుగా ఉండటం.. ఈ పరిణామాలన్నీ అధిష్ఠానానికి పెద్ద తలనొప్పిలా మారే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో అధిష్ఠానం ఏం నిర్ణయం తీసుకుంటుందో అని నియోజకవర్గ ప్రజలు ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.
ఎక్కడో లింక్ ఉందే..!
ఇటీవల చిలకలూరిపేటలో జరిగిన ఫ్యామిలీ డాక్టర్ (Family Doctor) కార్యక్రమంలో సీఎం జగన్ ఎదుటే మంత్రి రజిని బోరున విలిపించిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ తర్వాత సీఎంపై ఓ రేంజ్‌లో పొగడ్తల వర్షం కురిపించారు. రజిని కామెంట్స్, బావేద్వేగానికి లోనవ్వడంపై పెద్ద ఎత్తున ట్రోల్స్, మీమ్స్ వచ్చాయ్. అయితే తాజాగా అసమ్మతి వర్గం సమావేశం కావడం.. అప్పట్లో రజిని భావోద్వేగానికి లోను కావడం ఈ రెండింటికి ఎక్కడో లింక్ ఉందన్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. నియోజకవర్గంలో రజినికి వ్యతిరేకంగా కార్యక్రమాలు జరుగుతుండటం, రానున్న ఎన్నికల్లో సెంటిమెంట్‌ను రగిల్చడం కోసమే ఇలా జగన్ ముందే బోరున ఏడ్చేశారని టాక్ నడుస్తోంది. తాజాగా అసమ్మతి వర్గం ఎంపీని కలవడంతో మరోసారి ఆ వ్యవహారం తెరపైకి వచ్చింది. ఇందులో నిజానిజాలెంతో.. ఇంత అసమ్మతి ఉన్న పరిస్థితుల్లో చిలకలూరిపేట విషయంలో అధిష్ఠానం ఏం నిర్ణయం తీసుకుంటుందో తెలియాలంటే మరికొన్నిరోజులు వేచి చూడాల్సిందే మరి.
*****************************
ఇవి కూడా చదవండి..
*****************************
Rajini Emotional : బాబోయ్.. నిండు సభలో జగన్ గురించి మాట్లాడుతూ విడదల రజిని కంటతడి.. నాడు అలా.. నేడు ఇలా.. సోషల్ మీడియాను ఊపేస్తున్న వీడియోలు..
*****************************
Ambedkar Jayanti : అంబేడ్కర్ జయంతి రోజున అడ్డంగా బుక్కయిన బండి సంజయ్.. ఓ రేంజ్‌లో ట్రోలింగ్స్.. సీన్ కట్ చేస్తే..!
*****************************
Vizag Steel Plant : సీఎంవో నుంచి మంత్రి సీదిరికి సడన్‌గా ఫోన్ కాల్.. కంగారు పడుతూ కాల్ లిఫ్ట్ చేయగా..!
*****************************
YSRCP : బాలినేనిని వైఎస్ జగన్ బుజ్జగించి, బటన్ నొక్కించిన తర్వాత కూడా.. సడన్‌గా ఇలా మాట్లాడేశారేంటి..!?
*****************************
Jagan Balineni Interesting Scene: పాపం జగన్.. బాలినేనిని సభకు రప్పించారు సరే.. మనస్తాపానికి మందు పూయలేకపోయారే..!
*****************************
Kavitha on Sukesh : సుఖేష్ చంద్రశేఖర్ రిలీజ్ చేసిన వాట్సాప్ చాట్‌పై కవిత రియాక్షన్ ఇదీ.. మీడియాకే ఛాలెంజ్ చేస్తూ..
*****************************
Kavitha Vs Sukesh : కవిత సంచలన ప్రకటనపై సుకేష్ లాయర్ స్ట్రాంగ్ రియాక్షన్.. ఇంత మాట అనేశారేంటి..?
*****************************
Updated Date - 2023-04-14T16:30:55+05:30 IST