ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Secretariat Inauguration : కొత్త సచివాలయం ప్రారంభం... సీఎం కేసీఆర్ తొలి సంతకం దేనిపై చేశారంటే...

ABN, First Publish Date - 2023-04-30T13:17:29+05:30

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ నూతన సచివాలయం మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఆదివారం ఉదయం 6:30 గంటల నుంచే పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: కొత్త సచివాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. సచివాలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. వాస్తు పూజ చేశారు. అనంతరం ఛాంబర్‌లో కేసీఆర్‌ను వేదపండితులు ఆశీర్వదించారు. కొత్త కార్యాలయంలో కేసీఆర్ కార్యకలాపాలు ప్రారంభించారు. పోడు పట్టాల మార్గదర్శకాలపై ఆయన తొలి సంతకం చేశారు. సీఎం సీఎం కేసీఆర్‌కు మంత్రులు, స్పీకర్, పలువురు నేతలు శుభాకాంక్షలు తెలిపారు. కాగా రూ.1,200 కోట్ల వ్యయంతో తెలంగాణ నూతన సచివాలయం నిర్మితమైంది. దీనికి డా.బీఆర్ అంబేడ్కర్ తెలంగాణ సచివాలయంగా ప్రభుత్వం పేరు పెట్టిన విషయం తెలిసిందే.

అంతకుముందు తూర్పుగేటు నుంచి సచివాలయంలోకి కేసీఆర్ వెళ్లారు. శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అంతక్రితం కొత్త సెక్రటేరియట్ ప్రాంగణంలో సుదర్శన యాగం జరిగింది. మధ్యాహ్నం ఒంటి గంటకు మొదలై 1:20 గంటలకు పూర్తయిన ఈ యాగంలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు.

కాగా నూతన సచివాలయానికి ప్రారంభానికి విచ్చేసిన సీఏం కేసీఆర్‌కు ఘనస్వాగతం లభించింది. మంత్రి ప్రశాంత్ రెడ్డి, సీఎస్ తదితరులు ఆయనకు సాదరస్వాగతం చెప్పారు.

కట్టుదిట్టమైన భద్రత మద్య ప్రగతి భవన్ నుంచి నూతన సచివాలయానికి చేరుకున్నారు.

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ నూతన సచివాలయం ప్రారంభం దృష్ట్యా ఆదివారం ఉదయం 6:30 గంటల నుంచే పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. సచివాలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రేకుల షెడ్డులో సుదర్శన యాగం జరిగింది. ఈ యాగం మధ్యాహ్నం ఒంటి గంటకు మొదలై 1:20 గంటలకు పూర్తయ్యింది. ఆ తరువాత అర్చకులు నిర్ణయించిన పుష్కర అంశలో సీఎం కేసీఆర్‌ నూతన సచివాలయాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన నేరుగా ఆరో అంతస్తులోని తన కార్యాలయానికి చేరుకున్నారు. మూడో అంతస్తులో మంత్రి కేటీఆర్, రెండో అంతస్తులో మంత్రి హరీశ్‌రావు కార్యాలయం ఉంది. ఆ తరువాత మంత్రులు, అధికారులు కూడా వారి చాంబర్లకు వెళతారు. మధ్యాహ్నం 1:58 నుంచి 2:04 గంటల మధ్య 6 నిమిషాల వ్యవధిలో సీఎంతో సహా మంత్రులు, అధికారులు అందరూ ఏదో ఒక ఫైలుపై సంతకం చేసి పాలనను ప్రారంభించాల్సి ఉంది.

Updated Date - 2023-04-30T14:43:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising