ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

YS Jagan : మైలవరం పంచాయితీపై ఒక్కమాటతో తేల్చేసిన సీఎం జగన్.. భేటీ తర్వాత పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చేసిన వసంత కృష్ణప్రసాద్.. ఇదీ అసలు కథ..

ABN, First Publish Date - 2023-02-09T22:15:09+05:30

మైలవరం అసెంబ్లీ నియోజకవర్గంపై గత కొన్నిరోజులుగా పంచాయితీకి సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి (CM Jagan Reddy) ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మైలవరం అసెంబ్లీ నియోజకవర్గంపై గత కొన్నిరోజులుగా పంచాయితీకి సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి (CM Jagan Reddy) ఫుల్‌స్టాప్ పెట్టేశారు. మంత్రి జోగు రమేష్-ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ (Minister Jogi Ramesh- MLA Vasantha Krishna Prasad) వర్గాల మధ్య నెలకొన్న పంచాయితీపై ప్రత్యేక దృష్టిసారించిన జగన్.. నిన్న జోగు రమేష్, ఇవాళ వసంతను ప్రత్యేకంగా పిలిపించుకున్నారు. ఇద్దరితో చర్చించాక ఇవాళ్టితో ఈ వ్యవహారానికి ఫుల్‌స్టాప్ పడిపోయింది. అయితే.. భేటీ తర్వాత మీడియా ముందుకొచ్చిన వసంత ఆసక్తికర వ్యాఖ్యలే చేశారు. అసలు నిన్న జోగితో.. ఇవాళ వసంతతో జగన్ ఏం మాట్లాడారు..? ఇద్దరితో సుదీర్ఘంగా చర్చించాక జగన్ తీసుకున్న నిర్ణయమేంటి..? పార్టీ మార్పుపై ఆయన ఏమన్నారు..? అనే విషయాలపై ప్రత్యేక కథనం.

అసలేం జరిగింది.. జోగికి జగనేం చెప్పారు..!?

కృష్ణా జిల్లా మంత్రిగా (Krishna District) అన్ని నియోజకవర్గాల్లో పట్టు సాధించాలని జోగి రమేష్ భావించారు. అయితే.. మైలవరంలో (Mylavaram) మాత్రం సీన్ రివర్స్ అయ్యింది. ఎప్పుడు ఏ ప్రోగ్రామ్ జరిగినా సరే జోగి వర్సెస్ వసంత వర్గీయులుగా పరిస్థితి నెలకొనేది. ఈ మధ్యనే గుంటూరు జిల్లా (Guntur District) పరిశీలకుడు మర్రి రాజశేఖర్ (Marri Rajasekhar) సమక్షంలో ఇరు వర్గీయులు తన్నుకున్నారు. దీంతో ఈ వ్యవహారం రాష్ట్రస్థాయిలో అందరి దృష్టినీ ఆకర్షించింది. మరోవైపు.. పరస్పరం తీవ్ర ఆరోపణలు, విమర్శలతో ఇరువర్గాలు రచ్చకెక్కాయి. ఇవన్నీ ఒకఎత్తయితే.. మంత్రి జోగి రమేష్ అనుచరుడు నల్లమోతు మధుబాబుపై పలు పోలీసు స్టేషన్లలో వసంత అనుచరులు కేసులు పెట్టారు. దీంతో ఇద్దరి మధ్య వర్గపోరు మరింత పెరిగింది. ఈ వరుస పరిణామాలపై నేరుగా జగన్‌కే ఫిర్యాదులు అందాయి. ఈ వివాదం మరింత ముదరక ముందే ఫుల్‌స్టాప్ పెట్టాలని భావించిన జగన్.. బుధవారం నాడు కేబినెట్ భేటీ (Cabinet Meeting) తర్వాత ప్రత్యేకంగా మంత్రి జోగిని క్లాస్ తీసుకున్నారు. జిల్లా రాజకీయాల్లో అసలేం జరుగుతోంది..? మీ నియోజకవర్గం పెడన అయితే మైలవరంతో మీకేం పని..? అని గట్టిగా ప్రశ్నించారట జగన్. అంతేకాదు.. ఇతరుల నియోజకవర్గాల్లో జోక్యం చేసుకోవడం ద్వారా అనవసర వివాదాలకు ఆస్కారం ఇవ్వొద్దని, ఇకపై అలాంటి చర్యలను సహించ బోనని సీఎం స్పష్టం చేసినట్లు సమాచారం.

ఇవాళ జరిగింది ఇదీ..!

నిన్న జోగి రమేష్‌కు క్లాస్ తీసుకున్న జగన్ ఇవాళ ఎమ్మెల్యే వసంతను సీఎం క్యాంప్ కార్యాలయానికి పిలిపించుకున్నారు. సుమారు అరగంటపాటు వసంతతో ఏకాంతంగా సీఎం మాట్లాడారు. జోగి రమేష్ పెడుతున్న ఇబ్బందులను పూసగుచ్చినట్లుగా జగన్ దృష్టికి తీసుకెళ్లారు వసంత. ఈ అరగంట భేటీతో మైలవరం పంచాయితీకి ఫుల్‌స్టాప్ పడిపోయింది. భేటీ తర్వాత తన సొంత నియోజకవర్గంలో ఎమ్మెల్యే మీడియా మీట్ నిర్వహించి అసలేం చర్చించారనే విషయంపై క్లారిటీగా చెప్పారు. ‘మీ సెగ్మెంట్‌ మీదే అప్పర్ హ్యాండ్.. మీ మాటే ఫైనల్ అని జగన్‌ తేల్చిచెప్పేశారు. రాజకీయాల్లో కొనసాగాలంటే నిరాసక్తత ఉందని జగన్‌తో నేను అన్నాను. అంతర్గతంగా ఇబ్బందులు పెట్టేవారిని కంట్రోల్ చేస్తామని జగన్ స్పష్టం చేశారు. నేను జగన్ నాయకత్వంలో పనిచేస్తాను. పార్టీ గీత దాటి ఎవరైనా వ్యవహరిస్తే కచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయని జగన్ ఖరాకండిగా చెప్పేశారు. నేను వైసీపీ పార్టీ సైనికుడినే. నాకు పార్టీలు మారాల్సిన అవసరం లేదు. పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలన్నీ అసత్యాలే’ అని వసంత మీడియాకు వెల్లడించారు. అయితే.. ‘మైలవరంలో మీ మాటే ఫైనల్’ అన్న ఒక్కమాటతో అటు పంచాయితీకి ఫుల్‌స్టాప్.. ఇటు ఎమ్మెల్యే కూడా సంతోషపడ్డారట.

మొత్తానికి చూస్తే.. మైలవరం నియోజకవర్గం పంచాయితీకి ఫుల్‌స్టాప్ పడిపోయింది. జిల్లా ఇంఛార్జ్ మంత్రి, జిల్లా పరిశీలకుడు కాకుండా డైరెక్టుగా జగన్‌ దగ్గరే పంచాయితీ జరగడంతో ఇకపై ఇలాంటి ఘటనలు రిపీట్ కావని వైసీపీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి. ఇంత జరిగిన తర్వాతైనా ఇరువర్గాలు సైలెంట్‌గా ఉంటాయా.. మళ్లీ మళ్లీ విర్రవీగి ప్రవర్తిస్తాయా అనేది వేచి చూడాల్సిందే మరి.

*************************

ఇవి కూడా చదవండి..

Telugudesam : ఫిబ్రవరి16న టీడీపీలో చేరనున్న కీలక వ్యక్తి.. పెద్ద బాధ్యతలు అప్పగించనున్న చంద్రబాబు..


*************************

YS Jagan : ఇద్దరు మంత్రులకు క్లాస్ తీసుకున్న సీఎం జగన్.. మారకపోతే బాగోదని సీరియస్ వార్నింగ్.. మౌనంగా వెళ్లిపోయిన మహిళా మినిస్టర్..!

*************************

YS Jagan : శభాష్ అంటూ ముగ్గురు మంత్రులను మెచ్చుకున్న వైఎస్ జగన్.. అందులో ఒకరు...!

*************************

YSRCP : చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరబోతున్న వైసీపీ ముఖ్యనేత.. భారీగా ఏర్పాట్లు చేస్తుండగా చంపుతామని బెదిరింపులు.. ఇంతకీ ఎవరాయన..?

*************************


KotamReddy : కోటంరెడ్డి ఫోన్ ట్యాపింగ్ విషయంలో అసలేం జరిగిందో.. పూసగుచ్చినట్లుగా చెప్పిన బెస్ట్ ఫ్రెండ్.. ఇదీ అసలు కథ..

*************************

YSRCP : కోటంరెడ్డి తర్వాత పార్టీ లైన్ దాటిన కీలక నేత.. వైసీపీ నుంచి సస్పెండ్ చేసేసిన YS Jagan.. అసలేం జరిగిందంటే...

*************************

Telangana: అధికారపార్టీ ఓటుకు లక్ష ఇచ్చి.. వెయ్యి కోట్లు ఖర్చుపెట్టినా గెలుస్తానంటున్న ఎమ్మెల్యే.. ఇంతకీ ఆయన ధీమా ఏంటి.. ఏ పార్టీ నుంచి పోటీచేస్తారు..?

*************************

YS Jagan YS Sharmila : రేపో మాపో జైలుకు వైఎస్ జగన్.. షర్మిలకు సీఎం అయ్యే ఛాన్స్.. ఆ కీలకనేత ఇలా అనేశారేంటి..?

*************************

BRS MLAs Poaching Case : ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక పరిణామం.. తెలంగాణ సర్కార్‌ పిటిషన్‌పై సుప్రీం నిర్ణయం ఇదీ..

*************************

YSRCP : నెల్లూరు రూరల్ ఇంఛార్జ్‌గా బాధ్యతలు చేపట్టాక ఆదాల ఇచ్చిన మొదటి హామీ ఇదే.. ఇదేదో సరికొత్తగా ఉందే..

*************************

Updated Date - 2023-02-09T22:40:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising