Congress : ఆదరించిన కాంగ్రెస్.. కొత్తగా పార్టీలో చేరినోళ్లకు ఎన్ని టికెట్లు వచ్చాయో ఓ లుక్కేయండి..!
ABN, First Publish Date - 2023-10-27T22:01:22+05:30
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇన్నిరోజులూ అటు అధికార బీఆర్ఎస్.. ఇటు బీజేపీ ఆదరించకపోవడం, తగిన ప్రాధాన్యత ఇవ్వట్లేదని వందలాది నేతలు, లక్షలాది కార్యకర్తలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ..
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇన్నిరోజులూ అటు అధికార బీఆర్ఎస్.. ఇటు బీజేపీ ఆదరించకపోవడం, తగిన ప్రాధాన్యత ఇవ్వట్లేదని వందలాది నేతలు, లక్షలాది కార్యకర్తలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇందులో ముఖ్య నేతలు, కీలక నేతలు.. ద్వితియ శ్రేణి నేతలూ ఉన్నారు. వారందర్నీ అక్కున్న చేర్చుకున్న కాంగ్రెస్ ఇటీవల పార్టీలో చేరిన ముఖ్యనేతలకు దాదాపు టికెట్లు ఇచ్చింది. పార్టీలో చేరగానే ఆ నేతలకు ప్రజల్లో ఉన్న ఆదరణ, ఎవర్ని ఎక్కడ్నుంచి బరిలోకి దింపితే గెలిచే అవకాశాలు ఉన్నాయని ఇవన్నీ సర్వేలు చేయించి మరీ టికెట్లు కేటాయించడం జరిగింది. కాంగ్రెస్ కేటాయించిన టికెట్లను చూసిన బీఆర్ఎస్, బీజేపీ పార్టీల అధిష్టానాలు ఒకింత కంగుతిన్న పరిస్థితి. టికెట్లు ఇవ్వడమే కాదు.. కచ్చితంగా గెలిపించుకుంటామనే ధీమాతో కాంగ్రెస్ ఉంది.
మొత్తం 100 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులు ప్రకటన
రెడ్డి సామాజిక వర్గానికి మొత్తం 37 స్థానాలు
బిసిలకు 15 స్థానాలు
వెలమలకు 8 స్థానాలు
కమ్మలకు 3 స్థానాలు
బ్రాహ్మణులకు 2 స్థానాలు
మైనారిటీలకు 4 స్థానాలు
ఎస్.సీ స్థానాలు 19
ఎస్.టి స్థానాలు 12
ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన వారికి కేటాయించిన స్థానాలు
ఆదిలాబాద్- కంది శ్రీనివాస్‌రెడ్డి
ఆసిఫాబాద్ - శ్యామ్‌నాయక్
ముధోల్- బి.నారాయణరావు
కూకట్‌పల్లి - బండి రమేష్
శేరిలింగంపల్లి - జగదీశ్వర్‌గౌడ్
తాండూర్- మనోహర్‌రెడ్డి
సికింద్రాబాద్ కంటోన్మెంట్- వెన్నెల
మహబూబ్‌నగర్ - ఎన్నం శ్రీనివాస్‌రెడ్డి
మునుగోడు- రాజగోపాల్‌రెడ్డి
పాలకుర్తి- యశస్విని
పరకాల - రేవూరి ప్రకాష్‌రెడ్డి
వర్ధన్నపేట- నాగరాజు
ఖమ్మం - తుమ్మల నాగేశ్వర్‌రావు
పాలేరు- పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
పినపాక- పాయం వెంకటేశ్వర్లు
పూర్తి జాబితా ఇదే..
1. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా:
ఆదిలాబాద్ : కంది శ్రీనివాసరెడ్డి
బోథ్ : బాపూరావ్ రాథోడ్
ముధోల్: భోస్లే నారాయణ రావ్ పటేల్
సిర్పూర్ : రావి శ్రీనివాస్
ఆసిఫాబాద్: అజ్మీరా శ్యామ్
ఖానాపూర్ : ఎడ్మ బొజ్జు
2. నిజామాబాద్ జిల్లా :
నిజామాబాద్ (గ్రామీణ): రేకులపల్లి భూపతిరెడ్డి
ఎల్లారెడ్డి : మదన్‌మోహన్‌రావ్
3. కరీంనగర్ జిల్లా :
చొప్పదండి : మేడిపల్లి సత్యం
హుజురాబాద్ : ఒడితెల ప్రణవ్
కోరుట్ల : జువ్వాడి నర్సింగరావ్
హుస్నాబాద్ : పొన్నం ప్రభాకర్ గౌడ్
4. వరంగల్ జిల్లా :
జనగాం : కొమ్మూరి ప్రతాప్ రెడ్డి
పరకాల : రేవూరి ప్రకాశ్ రెడ్డి
వరంగల్ వెస్ట్ : నాయిని రాజేందర్ రెడ్డి
వరంగల్ ఈస్ట్ : కొండా సురేఖ
వర్థన్నపేట : కేఆర్ నాగరాజు
పాలకుర్తి: ఎం యశస్విని
మహబూబాబాద్ : డాక్టర్ మురళీ నాయక్
5. మెదక్ జిల్లా:
నర్సాపూర్ : ఆవుల రాజిరెడ్డి
సిద్దిపేట : పూజల హరికృష్ణ
దుబ్బాక : చెరుకు శ్రీనివాసరెడ్డి
6. రంగారెడ్డి జిల్లా :
తాండూర్ : బుయ్యని మనోహర్ రెడ్డి
ఇబ్రహీంపట్నం : మల్‌రెడ్డి రంగారెడ్డి
ఎల్బీనగర్ : మధు యాష్కీ
మహేశ్వరం : కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి
రాజేంద్రనగర్ : కస్తూరి నరేందర్
శేరిలింగంపల్లి : జగదీశ్వర్ గౌడ్
కూకట్‌పల్లి : బండి రమేశ్
7. హైదరాబాద్ జిల్లా :
అంబర్‌పేట్ : రోహిన్ రెడ్డి
ఖైరతాబాదు : పి.విజయారెడ్డి
జూబ్లీహిల్స్ : అజారుద్దీన్
సికింద్రాబాద్ కంటోన్మెంట్: డాక్టర్ గుమ్మడి వెన్నెల
8. మహబూబ్‌నగర్ జిల్లా :
నారాయణ్ పేట్: డాక్టర్ పర్ణిక చిట్టెంరెడ్డి
మహబూబ్‌నగర్: ఎన్నం శ్రీనివాసరెడ్డి
జడ్చర్ల: అనిరుధ్ రెడ్డి
దేవరకద్ర: జి మధుసూధన్ రెడ్డి
మక్తల్: వాకిటి శ్రీహరి
వనపర్తి: జి. చిన్నారెడ్డి
9. నల్లగొండ జిల్లా :
దేవరకొండ: బాలూ నాయక్
మునుగోడు: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి
భువనగిరి: కుంభం అనిల్ కుమార్ రెడ్డి
10. ఖమ్మం జిల్లా :
పినపాక: పాయం వెంకటేశ్వర్లు
ఖమ్మం: తుమ్మల నాగేశ్వరరావు
పాలేరు: పొంగులేటి శ్రీనివాసరెడ్డి
కొత్తోళ్లకే ప్రాధాన్యత
వాస్తవానికి మొదట్నుంచీ కాంగ్రెస్ పార్టీలో చేరిన నేతలకు కచ్చితంగా ప్రాధాన్యం కల్పించాలనే భావనలోనే హైకమాండ్ ఉంది. మొదటి జాబితాలో కొత్త వారికి మొత్తం 12 సీట్లు వారికి దక్కగా.. మైనంపల్లి హన్మంతరావు, ఆయన కుమారుడు రోహిత్‌రావు, నిర్మల్ నియోజకవర్గానికి చెందిన కూచాడి శ్రీహరిరావు, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఇటీవలి కాలంలో కాంగ్రెస్‌లో చేరారు. వెలమ సామాజిక వర్గానికి చెందిన ఈ నలుగురికీ సీట్లు దక్కాయి. ఇటీవల కాంగ్రెస్ కండువా కప్పుకొన్న వినయ్ కుమార్ రెడ్డి, సునీల్ రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, కూసుకుళ్ల రాజేష్‌రెడ్డి, సరిత, ఎ చంద్రశేఖర్, వేముల వీరేశం, కోట నీలిమలకు కూడా అభ్యర్థిత్వం లభించింది. రెండో జాబితాలో 15 మంది కొత్తవారికి చోటు లభించింది. ఇప్పటి వరకూ మొత్తం 100 స్థానాలకు అభ్యర్థులకు కేటాయించిన కాంగ్రెస్.. ఇందులో 27 మంది కొత్త అభ్యర్థులే కావడం విశేషం. అయితే.. కొత్తవారికి టికెట్లు కేటాయించడంతో ఇప్పటి వరకూ పార్టీలో పాతుకుపోయిన.. ఏళ్ల తరబడి పార్టీకి సేవలు చేస్తున్న వారికి.. యువనేతలకు టికెట్లు దక్కలేదని ఆరోపణలూ లేకపోలేదు.
TS Assembly Polls : 45 మందితో కాంగ్రెస్ రెండో జాబితా
Updated Date - 2023-10-27T22:10:36+05:30 IST